trinayani serial today Episode: పెద్దబొట్టమ్మ, నయని, విశాల్ ముగ్గురు కలిసి అందరూ పడుకున్నాక సీక్రెట్‌గా గుడికి వెళ్తుంటే తిలొత్తమ్మ, వల్లభ, సుమన వచ్చి లైట్స్ వేస్తారు. లైట్స్ ఎవరు ఆన్ చేశారు అని వల్లభ అడగ్గానే ఎవరూ కనిపించడం లేదు విక్రాంత్ బాబు అంటుంది నయని. ఇటు చూస్తూ కనిపిస్తాము నయని అంటుంది తిలొత్తమ్మ. తిలొత్తమ్మ మాటలకు నయని షాక్ అవుతుంది. బుల్లి బావగార ఇంపార్టెంట్ పని ఉంది అన్నారు ఇదేనా అని సుమన అడుగుతుంది. ఇంతలో ఏమైంది అంటూ విశాల్ వస్తాడు.
అడగాల్సిన అవసరం లేదు విశాల్ మీ ఆవిడను చూస్తేనే తెలుస్తుంది అంటుంది తిలొత్తమ్మ. దీంతో నయని ఏంటది.. విక్రాంత్ ఏం తీసుకెళ్తున్నారురా..? అని అడుగుతాడు విశాల్. ఏం లేదు బాబు గారు అంటుంద నయని.. టైం పాస్ అవ్వక మర్డర్ చేశారంట తమ్మి.. డెడ్ బాడీని తీసుకెళ్లి సిటీ అవుస్కట్ లో పారేసి వస్తారంటలే.. అంటాడు వల్లభ. బావగారు సరదాగా అన్నా సరే వీళ్లేదే సీరియస్ గానే పనిలోకి దిగినట్టు ఉంది అంటుంది సుమన. పైగా పెద్ద బొట్టమ్మతో కలిసి బయటకు వెళ్లాలనుకున్నారు అంటుంది తిలొత్తమ్మ.
నయని ఎంత సేపని అలా పట్టుకుంటారు కిందకు దించండి అని విశాల్ చెప్తాడు. దీంతో వాళ్ల చేతిలో ఉన్నది కింద పెట్టేస్తారు. విశాల్ బాబు నయని ఏం చేసినా మంచి కోసమే చేస్తుంది అని మీరు నమ్ముతారు కదా..? అని పెద్దబొట్టమ్మ అనగానే అవునని కానీ నేను అనుమానించడం లేదు అంటాడు విశాల్. ఇంతకీ అందులో ఏముందో చెప్పమని ఓపెన్ చేయండి అని చెప్తుంది సుమన. వల్లభ వెళ్లి దుప్పటి ఓపెన్ చేయగానే అందులో హాసిని ఉంటుంది. అందరూ షాక్ అవుతారు. ఇదేంటి నేను మోసుకొచ్చింది నయని వదిన బాడీ కదా..? అని విక్రాంత్ మనసులో అనుకుంటాడు. పెద్దబొట్టమ్మ కూడా అనుమానంగా నయని ఎక్కడ అని అడుగుతుంది నాకు తెలియదు అని చెప్తుంది నయని.
దుప్పట్లో నువ్వున్నావేంటి వదిన అని విశాల్ అడగ్గానే ఏమో నాకేం తెలుసు వీళ్లిద్దరూ ఎవరినో తీసుకెళ్లాలని మాట్లాడుకుంటుంటే నేను వెనక నుంచి వెళ్లి దుప్పట్లో పడుకున్నాను అంతే ఇప్పుడు ఇలా ఉన్నాను అని చెప్తుంది. అయితే మీరు ఎవరిని తీసుకెళ్లాలనుకున్నారు అని అనుమానంగా తిలొత్తమ్మ అడుగుతుంది. పావణమూర్తిని తీసుకెళ్లాలని అనుకున్నాం. ఎందుకంటే ఆయన ఈ మధ్యన ఎక్కువ తాగుతున్నారు ఆ తాగుడు మాన్పించడానికి గుడి దగ్గర నాటు మందు వేస్తారని పెద్దబొట్టమ్మ చెప్పగానే అక్కడికే తీసుకెళ్తున్నాం అంటారు. మీ మాటలు నాకు నమ్మబుద్ది కావడం లేదని తిలొత్తమ్మ చెప్తుంది. అవునని వల్లభ కోపంగా వెళ్లి రూంలో చెక్ చేద్దామని వెళ్తాడు. గాయత్రి పాప వచ్చి రూం లాక్ చేస్తుంది. ఇక మీ మామయ్య ఆరోగ్యం గురించి రేపు ఆలోచిద్దాం నేను వెళ్తాను అని చెప్పి పెద్దబొట్టమ్మ వెళ్లిపోతుంది.
తిలొత్తమ్మ సీరియస్ గా ఆలోచిస్తుంటే వల్లభ వచ్చి మమ్మీ నువ్వు రాత్రి పూట కూడా పడుకోకుండా మెలుకువగానే ఉండాలి. అని చెప్తాడు. ఎందుకని తిలొత్తమ్మ అడగ్గానే నువ్వు కూడా అప్పుడప్పుడు ఫారెన్ బ్రాండ్ తాగుతుంటావు కదా..? నీకు కూడా ఏదో ఒక గుడికి తీసుకెళ్లి నాటు మందు వేయిస్తే అని డౌటుగా చెప్పగానే నేను తాగేది నీకు తప్ప ఎవ్వరికీ తెలియదురా.. అంటూ తిడుతుంది తిలోత్తమ్మ. అసలు దురందర గదిలో పావణమూర్తి లేకుంటే అక్కడి నుంచి ఎవరిని తీసుకెళ్తారు. అని తిలొత్తమ్మ అనుమానిస్తుంది. దీంతో మామయ్య లేరు కాబట్టి హాసినిని తీసుకెళ్లాలనుకున్నారు అని వల్లభ అంటాడు. దీంతో రేయ్ నీకు బుర్ర ఉండే మాట్లాడుతున్నావా..? అంటూ తిలొత్తమ్మ తిడుతుంది.
నయని, విక్రాంత్ మాట్లాడుకుంటుంటే.. హాసిని, సుమన వస్తారు. సుమన ఇద్దరిని అనుమానిస్తుంది. దీంతో మేము ఆఫీసు పని గురించి మాట్లాడుతున్నాము అని చెప్తారు. అయినా సుమన నమ్మదు. ఎందుకొచ్చావు చెల్లి ఏదైనా పనుందా అని నయని అడగ్గానే డిస్టర్బ్ చేశామా అక్కా అంటుంది. అసలు ఎందుకు వచ్చావో చెప్పు అంటుంది. అసలు ఇంట్లోనే లేని పావణమూర్తి బాబాయ్‌ని ఎలా ఎత్తుకెళ్ళాలనుకున్నారు అని అడుగుతుంది. ఉన్నాడనుకుని ఎత్తుకెళ్లాలనుకున్నాం అంటాడు విక్రాంత్. మరుసటి రోజు వల్లభ దేవీపురం నుంచి రత్నాంబ, వైకుంఠం వాళ్లను తీసుకొస్తాడు. ఇంతటితో త్రినయని సీరియల్ ఈరోజు ఏపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: సకల బాధలను దూరం చేసే షణ్ముఖి రుద్రాక్ష ధారణ ఎవరు చేయాలి..?