Nindu Noorella Saavasam Serial Today Episode : అమ్ము చిరాగ్గా ఏం చేయాలో అర్థం కాలేదురా.. అంటుంది. జరిగింది ఎలా మర్చిపోతామని ఆనంద్ ఆకాష్ అంటారు. అంజు మాత్రం మీ బాధ నాకు అర్థం అవుతుంది. ఇంత ప్రేమ నేను తట్టుకోలేను అంటుంది. దీంతో ఆకాష్, ఆనంద్, అమ్ము ప్రేమనా..? ఎవరి మీద అని అడుగుతారు. దీంతో నాకు ఏమీ అర్థం కాలేదు అంటుంది. ఇంతలో మిస్సమ్మ వచ్చి నాక్కూడా అర్థం కాలేదు అంటుంది. దీంతో మీరు ఎవరి కిడ్రాప్ గురించే కదా బాధపడుతున్నారు అంటుంది అంజు. కాదని టూర్ గురించి మా బాధంతా అంటారు అమ్ము, ఆనంద్, ఆకాష్. దీంతో అంజు షాక్ అవుతుంది. మిస్సమ్మ ఆశ్చర్యంగా చూస్తుంది.
రాత్రి పూట అమర్ ఇంటి దగ్గరకు వచ్చిన టెర్రరిస్టులు సెక్యూరిటీ చాలా ఎక్కువ ఉంది అనుకుంటారు. మరోవైపు అమర్, రాథోడ్ ఏదో ప్లాన్ చేస్తుంటారు. అరవింద్, వినోద్‌కు ఫోన్ చేస్తాడు. అక్కడ సిచ్చుయేషన్ ఎలా ఉందని అడుగుతాడు. సెక్యూరిటీ చాలా టైట్‌గా ఉందని చెప్తాడు వినోద్. లోపలికి వెళ్తావా..? వెళ్లగలవా..? అని అడుగుతాడు అరవింద్. ఎలా ఉన్నా వెళ్తానని కానీ అమరేంద్ర ఉన్నాడు కదా అంటాడు వినోద్. ఇంకొద్ది సేపట్లో అమర్ బయటకు వెళ్తాడు. అని చెప్పి ఫోన్ కట్ చేసి అమర్‌కు ఫోన్ చేస్తాడు. అమర్ అనౌన్ నెంబర్ నుంచి కాల్ వస్తుందని ట్రేస్ చేయమని రాథోడ్ కు చెప్తాడు. సరేనని బయటకు వెళ్తాడు రాథోడ్. మళ్లీ వచ్చి రహమత్ నగర్ నుంచి కాల్ వస్తుంది సార్ అని చెప్పగానే అమర్ కాల్ లిఫ్ట్ చేస్తాడు.
హలో సార్ ఎలా ఉన్నారు కూతురు ఇంటికి వచ్చిందన్న ఆనందంలో ఉన్నట్లు ఉన్నారు అంటాడు అరవింద్. రేయ్ ఇంకోసారి నా పిల్లల జోలికి వస్తే చంపేస్తాను. నీకు కావాల్సింది నేనే కదా..? రా నేరుగా తేల్చుకుందాం.. అది వదిలేసి నా ఫ్యామిలీని ఎందుకు టచ్ చేస్తున్నావు అంటాడు అమర్. నాకు కావాల్సింది మీ చావే సార్. కానీ నేరుగా ఎదుర్కోలేను కదా..? కానీ గుర్తు పెట్టుకోండి సార్ నీ చావు నేనే.. అని అరవింద్ వార్నింగ్ ఇవ్వడంతో గుర్తు పెట్టుకో నీ ఓటమి పేరు లెఫ్టినెంట్ అమరేంద్ర అంటాడు అమర్. మీరు రాత్రంతా కాపలా కాసినా మీ కుటుంబాన్ని కాపాడుకోలేరు సార్. మీరు చేస్తుంది ఓడిపోయే యుద్దం సార్ అంటాడు అరవింద్. దీంతో అమర్ కోపంగా ఎముకలు గడ్డకట్టే చలిలో ప్రాణాలు లెక్క చేయకుండా దేశ రక్షణ చేసే ఇండియన్ ఆర్మీతో మాట్లాడుతున్నావని మర్చిపోవద్దు.
కళ్ల ముందు శవాలు ఉన్నా… చుట్టూ శత్రువులు ఉన్నా.. భయం లేకుండా ముందుకు సాగే ఆర్మీతో మాట్లాడుతున్నావు ఇప్పుడు యుద్దం ఎలా చేస్తానో నీ ఊహకే వదిలేస్తున్నా అంటాడు అమర్. అరవింద్ ఫోన్ కట్ చేస్తాడు. ఇంతలో రాథోడ్‌కు ఫోన్ చేసి ఆ టెర్రరిస్టు లోకేషన్ షేర్ చేశామని చెప్తారు. ఆ లోకేషన్‌కు అమర్ వెళ్లబోతుంటే మిస్సమ్మ వద్దని చెప్తుంది. వినకుండా అమర్, రాథోడ్ వెళ్లిపోతారు. గార్డెన్ లో నుంచి చూస్తున్న ఆరు ఈ టైంలో ఈయన ఎక్కడికి వెళ్తున్నారు అని కారు వెనకాలే వెళ్తుంది. బయట పొంచి ఉన్న తీవ్రవాదులు అమరేంద్ర బయటకు వచ్చాడని అరవింద్ కు ఫోన్ చేసి చెప్తాడు వినోద్. సరేనని అమరేంద్ర లేకుండా చేశాను పది నిమిషాల తర్వాత లోపలికి వెళ్లు అని చెప్తాడు అరవింద్.
రాథోడ్ స్పీడుగా వెళ్లు అంటాడు అమర్. వాడు కేర్‌లెస్‌గా లేదా.. కావాలని ట్రాప్ చేసి ఉండొచ్చు కానీ వాడిని ఎక్కువ సేపు బయట తిరగనివ్వకూడదు అంటాడు. మరోవైపు టెన్షన్ పడుతున్న ఆరు గుప్త దగ్గరకు వెళ్లి గుప్త గారు ఏం జరుగుతుంది. ఆయన ఈ టైంలో బయటకు వెళ్లారేంటి అని అడుగుతుంది. గుప్త పలకదు. ఇంతలో తీవ్రవాదులు స్మోక్ బాంబు అమర్ ఇంట్లోకి వేస్తారు. అందులోంచి వచ్చిన పొగ వల్ల సెక్యూరిటీ వాళ్లు స్పృహ కోల్పోతారు. అది చూసిన ఆరు టెన్షన్ పడుతుంది. గుప్త గారు మీరే మా వాళ్లను కాపాడాలి ఫ్లీజ్ అంటూ బతిమాలుతుంది. దీంతో గుప్త నువ్వు అడిగింది నేను చేయాలన్నా.. నువ్వు మా లోకానికి వస్తానని మాట ఇవ్వాలని అడుగుతాడు.
ఇప్పుడు నిర్ణయం తీసుకోవాల్సింది నువ్వు.. సమయం మించి పోతుంది బాలిక మీ వాళ్ల ప్రాణాలు నీ నిర్ణయం మీద ఆధారపడి ఉన్నవి ఆలోచించుకుని చెప్పుము బాలిక అంటాడు గుప్త. నాకు ఈ ఒక్కసారి నాకు సాయం చేయండి ఫ్లీజ్.. అంటూ బతిమాలుతుంది ఆరు. అన్ని నువ్వు అనుకున్నట్లు జరగవు బాలిక. ఆలోచించుకో.. నీ కుటుంబ క్షేమమా..? నీ భూలోక వాసమా..? అంటాడు గుప్త. మరోవైపు అరవింద్ ను వెతుక్కుంటూ వెళ్లిన అమర్‌కు ట్రాప్ లో పడినట్టు అర్థమై రిటర్న్ అవుతాడు. మరోవైపు గేటు దాటుకుని లోపలికి వెళ్లిన తీవ్రవాదులు డోర్ కొడుతుంటారు. ఆరు భయంతో గుప్త గారు ప్లీజ్ ఏదైనా చేయండి అని అడుగుతుంది.
అమర్ ఇంటికి ఫోన్ చేస్తాడు. శివరాం ఫోన్ లిఫ్ట్ చేసి ఎవరో తెలియదు అమర్ డోర్ కొడుతున్నారు అని శివరాం చెప్తాడు. నేను వస్తున్నాను.. నేను వచ్చే వరకు ఎవ్వరూ భయపడకండి అని చెప్తాడు. ఓకే అమర్ అంటూ శివరాం చెప్తాడు. ఇంతలో మనోహరి వచ్చి భయపడుతుంది. నువ్వు లోపలికి వెళ్లు అంటూ నిర్మలను కూడా లోపలికి పంపిస్తాడు శివరాం. ఇంతటితో నేటి నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ఎపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: ఫస్ట్ టైం అరుణాచలం వెళ్తున్నారా..? అయితే ఈ విషయాలు తప్పక తెలుసుకోవాల్సిందే..?