BigTV English

Trinayani Serial Today October 7th: ‘త్రినయని’ సీరియల్‌: తిలొత్తమ్మను కొట్టిన గాయత్రిదేవి – విక్రాంత్‌ ప్రయోగం విఫలం

Trinayani Serial Today October 7th: ‘త్రినయని’ సీరియల్‌: తిలొత్తమ్మను కొట్టిన గాయత్రిదేవి – విక్రాంత్‌ ప్రయోగం విఫలం

trinayani serial today Episode:  పాపను నిద్రపుచ్చేందుకు విక్రాంత్‌ ప్రయత్నిస్తాడు. హిప్నటైజ్‌ చేస్తుంటాడు. విక్రాంత్‌ ప్రయత్నం ఫలించి గాయత్రి పాప నిద్రపోతుంది. విశాల్‌ షాక్ అవుతాడు. అరె మా ఆయన మ్యాజిక్‌ చేశాడు. గాయత్రి పాప నిద్రపోయింది అంటుంది సుమన. పాపం చిన్న పిల్ల నేను చెప్పింది గుర్తు ఉన్నా సరే నిద్ర వచ్చి ఉంటుంది కదా? అనుకుంటాడు. ఇంతలో ఇంట్లో కర్టెన్లు ఊగుతుంటాయి. వల్లభ పెద్దమ్మ వచ్చిందేమో అంటాడు. బయట గాలి కూడా పెద్దగానే ఉంది. నయనో.. అత్తయ్యనో చెబితేనే తెలస్తుంది కదా అంటుంది సుమన.


గాయత్రిదేవి వచ్చి తిలొత్తమ్మ వెనక నిలబడి చెప్పొద్దని నయనికి సైగ చేస్తుంది. నయని రాలేదని చెప్తుంది. ఇంతలో తిలొత్తమ్మ తిరిగి తన వెనక ఉన్న గాయత్రి దేవిని చూసి ఉలిక్కిపడుతుంది. ప్రయోగాలతో నన్ను చూడాలనుకుంటున్నావా? తిలొత్తమ్మ ఇవాళ నా చేతిలో చచ్చావు నువ్వు అంటూ గొంతు నులుముతుంది. ఇంతలో తప్పించుకున్న తిలొత్తమ్మ గాయత్రి అక్క వచ్చిందని చెప్తుంది. నిజమా  మమ్మీ అని వల్లభ అడుగుతాడు.  అబద్దం బావగారు అంటూ  అమ్మగారు  వస్తే నాకెందుకు కనిపించరు అని నయని చెప్తుంది. నీకు కనిపంచకపోవడం ఏంటి? అని తిలొత్తమ్మ అడుగుతుంది.

నీ కన్నకొడుకు ప్రయోగం చేసినా ఫలితం రాలేదని తెలిసే సరికి పరువు పోయినట్టు ఫీలయి ఇలా అబద్దం చెప్పకండి అత్తయ్యా.. అంటుంది నయని. అయ్యో ఇందులో పరువు పోయే పరిస్థితి ఏం లేదు అమ్మా అంటాడు విక్రాంత్‌. ఇంతలో గాయత్రి దేవి నా వైపే వస్తుంది. వద్దు అక్కా నన్ను ఏమీ చేయోద్దు అంటుంది. నా ప్రాణం తీసి వికృతంగా నవ్విన నిన్ను ఏం చేసినా పాపం లేదు తిలొత్తమ్మ అంటుంది గాయత్రి దేవి. భయంతో తిలొత్తమ్మ విశాల్‌ పక్కకు వెళ్లి మీ అమ్మ నన్ను కొడుతుంది.  నిన్ను పెంచి పెద్దగా చేసింది నేనే కదా.. ఆ విశ్వాసంతోనైనా నన్ను కొట్టొద్దని చెప్పు విశాల్‌ అంటుంది. ఇంతలో గాయత్రి దేవి వచ్చి తిలొత్తమ్మను కొట్టగానే కిందపడిపోతుంది.


నయని, నువ్వు కానీ విశాల్‌ కానీ చెప్తే కొట్టడం ఆపేస్తుంది  మీరు చెప్పండి అంటూ ప్రాధేయపడుతుంది. విశాల్‌ వెళ్లి తిలొత్తమ్మను పైకి లేపగానే దయచేసి అలా చెప్పకండి అత్తయ్యగారు.. అమ్మగారు రాలేదు అని చెప్తుంది నయని. ఇటు రావే రాక్షసి అంటూ తిలొత్తమ్మను చేయి పట్టి పక్కకు లాగుతుంది గాయత్రి దేవి. దీంతో చూశారా? నన్ను ఎలా లాగేసిందో.. మీ అమ్మగారు ఇక్కడే ఉన్నారు నయని చూడు ఎలా చూస్తుందో చూడు అంటూ భయంగా చెప్తుంది. అత్తగారిని గదిలోకి తీసుకెళ్లండి విక్రాంత్‌ బాబు అని నయని చెప్తుంది.

అమ్మా వెళ్దాం పద గదిలోకి అంటాడు విక్రాంత్‌. ఎక్కడికి వెళ్లినా విడిచిపెట్టదురా మీ పెద్దమ్మ అంటుంది తిలొత్తమ్మ. గాయత్రి దేవి కొడుతూనే ఉంటుంది. ఇంతలో తిలొత్తమ్మ తూలిపడుతుంది. దీంతో అత్తయ్యకు పిచ్చి పట్టినట్టుంది ముందు ఇక్కడి నుంచి తీసుకెళ్లండి అని సుమన చెప్తుంది. దీంతో వల్లభ తిలొత్తమ్మను తీసుకుని అక్కడి నుంచి వెళ్తాడు. ఎక్కడికి వెళ్తున్నావు తిలొత్తమ్మ ఆగు అంటూ వారి వెనకాలే వెళ్తుంది  గాయత్రి దేవి. ఇంతలో పాపకు మెలకువ వస్తుంది. అది చూసిన విక్రాంత్‌ షాక్‌ అవుతాడు.

గార్డెన్‌ లో కూర్చుని సీరియస్‌ గా ఆలోచిస్తున్న తిలొత్తమ్మ దగ్గరకు వచ్చిన వల్లభ అమ్మా భోజనం చేయాలట రా అని పిలుస్తాడు. ఈ పరిస్థితుల్లో నేను ఎలా భోజనం చేయగలను వల్లభా అంటూ ప్రశ్నిస్తుంది తిలొత్తమ్మ. పెద్దమ్మ కొట్టిందని ఫీలవుతున్నావు కదా? కానీ అది నీ భ్రమ, నువ్వు నాటకం ఆడావని అందరూ ఫీలవుతున్నారు మమ్మీ. ఏమంటావు అని వల్లభ అడగ్గానే నొప్పిని అనుభవిస్తున్న నాకు తెలుసురా? అంటుంది తిలొత్తమ్మ. ఇంతలో నయని వచ్చి భోజనం చేద్దురు కానీ రండి అని పిలుస్తుంది. అయితే తిలొత్తమ్మ, నయనిని ఇటు రా అని పిలుస్తుంది.

నయని దగ్గరకు రాగానే  మీ ఆయన మీద గాయత్రి, గానవి ల మీద ఒట్టు వేసి నిజంగా గాయత్రి అక్క రాలేదు. నన్ను కొట్టలేదని చెప్తాలి అని అడుగుతుంది. దీంతో ఈ మాత్రం దానికి ప్రమాణాలు ఎందుకు అత్తయ్య అంటూ అమ్మగారు వచ్చారు అని చెప్పగానే వల్లభ షాక్ అవుతాడు. పెద్దమ్మ వచ్చిందా? అని అడుగుతాడు. వచ్చి మీ అమ్మను చితకబాదడం కూడా నిజమే బావగారు అంటుంది నయని. చెప్పానా వల్లభ అప్పుడు నయని అబద్దం చెప్పి నా ఒళ్లు ఇంకాస్త హూనం అవ్వాలని చూసింది. నన్ను కాదు కొట్టింది ఒక పశువును అనుకుని లైట్‌ తీసుకో మమ్మీ అంతా మర్చిపోతావు అంటాడు వల్లభ. దీంతో తిలొత్తమ్మ, వల్లభను తిడుతుంది.

హిప్నటైజ్‌ చేసి పాపను మీరు బలే పడుకోబెట్టారే అని విక్రాంత్‌ను అడుగుతుంది సుమన. పేపర్‌ లో జంతికలు చేసినంత ఈజీగా గీలు గీశారు కదా? నాకు ఇస్తారా అవి అని అడుగుతుంది సుమన. ఎందుకు అవి చూస్తూ నిద్రపోవడానికా? అని విక్రాంత్‌ అడుగుతాడు. లేదు మా అక్కను నిద్రపుచ్చడానికి అంటుంది సుమన.

దీంతో ఇన్ని రోజులకు వదిన  మనస్థత్వం చిన్న పిల్లలాంటిది అని అర్థం చేసుకున్నావా? అంటాడు విక్రాంత్‌. అదేం కాదు నయనిని నిద్రపుచ్చి భుజంగమణి ఎక్కడ  పెట్టిందో తెలుసుకుందామని చెప్తుంది. దీంతో ప్రయోగాలు మంచికే ఉపయోగించాలి అని విక్రాంత్‌ చెప్పగానే మరి చేసింది మంచి ప్రయోగమా? అని ప్రశ్నిస్తుంది. ఇంతటితో ఇవాళ్టీ త్రినయని సీరియల్‌ ఏపిసోడ్‌ కు ఎండ్‌ కార్డు పడుతుంది.

Related News

Nindu Noorella Saavasam Serial Today September 23rd: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌:  ఆరు ఫోటో చూసిన మిస్సమ్మ

Brahmamudi Serial Today September 23rd: ‘బ్రహ్మముడి’ సీరియల్‌:  రాజ్‌ను కన్వీన్స్‌ చేసిన కళ్యాణ్‌ – కావ్యకు దొరికిపోయిన రాజ్‌  

Nindu Noorella Saavasam Serial Today September 22nd: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: అమర్‌,  మిస్సమ్మను చాటుగా చూసిన మను

Brahmamudi Serial Today September 22nd: ‘బ్రహ్మముడి’ సీరియల్‌: సుభాష్‌తో రాజ్‌ గొడవ – నిజం తెలుసుకున్న కావ్య  

Today Movies in TV : సోమవారం సూపర్ సినిమాలు.. వీటిని మిస్ చెయ్యకండి..

Big tv Kissik Talks: అమర్ దీప్ పై రాశి షాకింగ్ కామెంట్స్.. దేవుడు ఇచ్చిన కొడుకు అంటూ!

Big tv Kissik Talks: రంగమ్మత్త పాత్ర పై రాశి కామెంట్స్..అందుకే వద్దనుకున్నా అంటూ!

Big tv Kissik Talks: కళ్ళను డొనేట్ చేసిన నటి రాశి…ఆ సినిమా ప్రభావమేనా?

Big Stories

×