Tv Serial: తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటూ మంచి వినోదాన్ని పంచుతున్న వాటిలో సినిమాలతో పాటు సీరియల్స్ కూడా ఉన్నాయి.. తెలుగులో ఎక్కువగా సీరియల్స్ జనాలని బాగా అలరిస్తున్నాయని చెప్పడంలో సందేహం లేదు. ఇటీవల తెలుగులో వస్తున్న సీరియల్స్ కంటెంట్ తో పాటు కాస్త కామెడీతో పాటుగా జనాలకు క్యూరియాసిటి పెంచేందుకు సినిమాలను మించిన గ్రాఫిక్స్ తో వస్తున్నాయి. అందుకే జనాలు సీరియల్స్ వైపు మొగ్గు చూపిస్తున్నారు. బుల్లితెర పై ప్రసారమవుతున్న ప్రతి సీరియల్ ప్రస్తుతం టాప్ రేటింగ్ తో దూసుకుపోతున్నాయి. స్టార్ మా తో పాటు.. తెలుగులో ప్రసారమవుతున్న పలు సీరియల్స్ ప్రేక్షకులను అలరిస్తున్నాయి. అయితే ఈమధ్య టీఆర్పి రేటింగ్ కోసం ఒక్కో సీరియల్లో ఒక్కొక్క కాన్సెప్ట్ ని తీసుకొస్తున్నారు దర్శకులు. తాజాగా ఓ సీరియల్ లో గ్రాఫిక్స్ఎక్కువగా పెట్టడంతో ప్రస్తుతం ఆ సీరియల్ కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.. ఆ వీడియోలో ఏముందో ఒకసారి మనం ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
Also Read : జెడీ చక్రవర్తి తెలుగు సినిమాలకు ఎందుకు దూరం అయ్యాడు..?
గ్రాఫిక్స్ ఫీక్స్.. సీరియల్ సీన్ కేక..
బుల్లితెరపై ప్రసారమవుతున్న సీరియల్స్లలో కొత్తదనం కోరుకుంటున్నారు జనాలు. ఇక దాంతో మేకర్స్ విచిత్ర ప్రయోగాలు కూడా చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఈమధ్య జీ తెలుగు లో ప్రసారమవుతున్న సీరియల్స్ సినిమాలకు మించిన స్టోరీల తో వస్తున్నాయి. మొన్నేమో ఓ సీరియల్ లో రొమాన్స్కు సంబంధించిన వీడియో క్లిప్ వైరల్ అవ్వగా.. తాజాగా మరో సీరియల్ లోని గ్రాఫిక్స్ సీన్ వీడియో తెగ వైరల్ అవుతుంది.. ఇంతకీ ఆ వీడియోలు ఏముందంటే.. ఒక పొట్టేలు వేగంగా హీరోయిన్ వైపు దూసుకొస్తుంది. పక్కనే ఉన్న ఒక అమ్మాయి ఒంటి చేత్తో ఆ పొట్టేలు తల మీద కొట్టగానే అది గిర్రులు తిరిగి కింద పడిపోతుంది. ఈ సీన్ చూడ్డానికి కాస్త కామెడీ గున్న సీరియల్ లో ఆ సీన్ టైంలో మాత్రం హైలెట్ అయింది అని చెప్పాలి. ప్రస్తుతం ఈ వీడియో మాత్రం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది..
నెటిజన్స్ రియాక్షన్ ఏంటంటే..?
ఈ సీన్ చూసిన నెటిజన్లు ఒక్కొక్కరు ఒక్కోలా కామెంట్స్ చేస్తున్నారు.. చూసే జనాలను పిచ్చోళ్లను చేస్తున్నారు కదరా.. వీళ్ళు చేసే ఓవరాక్షన్ చూడలేకపోతున్నాం. ఈ సీరియల్ పై కొందరు పాజిటివ్గా కామెంట్ చేస్తే.. ఈ సీన్ చూసిన తర్వాత నెగిటివ్గా కామెంట్లు వస్తున్నాయి.. చూడ్డానికి భారీగా ఉన్న ఒక పొట్టేలు చిన్న దెబ్బతో ఎలా కుదేలు అయిపోయిందని చాలామంది నెటిజన్లు ఆలోచిస్తున్నారు. గ్రాఫిక్స్ లో మేనేజ్ చేసినా కూడా ఈ సీన్పై ఒకవైపు ప్రశంసలు కురిపిస్తుంటే, మరోవైపు విమర్శను కూడా వినిపిస్తున్నాయి. మొత్తానికి ఈ వీడియో క్లిప్ అయితే సోషల్ మీడియా లో నిమిషాల్లోనే ట్రెండింగ్ లోకి వచ్చేస్తుంది.. ఆ సీన్ ఏంటో మీరు కూడా ఇటు లుక్ వేసుకోండి..
?igsh=czA4YWplcGJ5bTZ4