Gundeninda GudiGantalu Today episode july 3rd: నిన్నటి ఎపిసోడ్ లో.. ఫంక్షన్ లోబాలుని ఎంత రెచ్చగొట్టినా సరే నువ్వు వెళ్ళు అని చెప్పగానే వెళ్ళిపోతాడు. ఇక శోభన మీరు ఏం చేస్తున్నారో మీకు అర్థం కావట్లేదు అని రెచ్చిపోతుంది. ఆ ఫ్యామిలీని మా ఫ్యామిలీ నుండి దూరం చేయడానికి నాకు ఒక్క నిమిషం చాలు వెళ్లి ఇంకా గట్టిగా ప్రయత్నించండి అని శోభన అంటుంది.. ఇక బాలు ఆ వ్యక్తి ఫోటోని కూడా పంపించి రాజేష్ కి చూపిస్తాడు.. ఎలాగైనా కొట్టాలి అని బాలు రాజేష్ తో చెప్పడం మీనా వింటుంది. అదేంటండి మీరు కామ్ గా ఉన్నారని అనుకున్నాను కానీ ఇలా ప్లాన్ చేస్తారని అస్సలు అనుకోలేదు అంటూ అంటుంది. అయితే బాలు లోపలికి వెళ్లి మౌనంగా ఉంటాడు. బాలు కాలును శృతి వాళ్ల అమ్మ ఏర్పాటు చేసిన మనుషులు ప్రాణం పోయేలా తొక్కుతారు.
అయితే బాలు అంత మౌనంగా ఉండడంతో వాళ్ళిద్దరు షాక్ అవుతారు. ఇక శృతి వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్లి బాలు అసలే కోపం తెచ్చుకోవడం లేదని చెబుతారు. అప్పటికే వాళ్ళు చేసిందంతా చూసిన శృతి వాళ్ళ అమ్మ కాలు తొక్కితే ఎందుకు కోపం వస్తుందని అడుగుతుంది. దాంతో బాలు కాలు తొక్కిన వ్యక్తి శృతి వాళ్ళ అమ్మ కాలును కూడా గట్టిగా తొక్కుతాడు. దాంతో ఆమె దగ్గరగా అరుస్తుంది. మిమ్మల్ని తొక్కిన దానికంటే పది రెట్లు ఎక్కువ బలంతో తొక్కానని అయినా బాలు కావాలనే కోపాన్ని అనుచుకుంటున్నాడని చెబుతాడు. ఇంట్లో వాళ్లకి గొడవకు వెళ్లకూడదని ఒట్టు వేసుకున్నట్టు కనిపిస్తుందని చెబుతాడు.. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. శోభన అనుకున్నట్లుగానే తన కూతురు ఫంక్షన్ ని చాలా గ్రాండ్ గా చేయాలని భారీగా ఏర్పాట్లు చేస్తుంది. పెద్ద కోడలైన రోహిణికి వాళ్ళ నాన్న రాకపోవడంతో ముందుగా శృతి ఫంక్షన్ ని చేయాలని అనుకుంటారు. తాళి మార్చే ఫంక్షన్ ముందు శృతికి చేస్తారు. శృతి తాళి మార్చిన తర్వాత కామాక్షి అత్తమామలు అమ్మానాన్నల కు నమస్కారం చేయాలి అమ్మ అనేసి అనగానే శృతి అక్కడే కూర్చొని నమస్కారం చేస్తుంది. అది చూసినా అక్కడ వాళ్ళందరూ నవ్వుతారు. కాదమ్మా లేచి కాళ్లకు దండం పెట్టుకోవాలి అని కామాక్షి చెప్తుంది.
ఇక శృతి రవి ఇద్దరు పెద్దల ఆశీర్వాదం తీసుకుంటారు. సత్యం పిల్లాపాపలతో సంతోషంగా ఉండాలని దీవిస్తాడు.. ప్రభావతి మాత్రం ఒంటినిండా బంగారంతో ఇలాంటివి మరిన్ని కొనాలని దీవిస్తుంది. సత్యంని చూసి మళ్లీ మాట మార్చి పిల్లాపాపలతో బంగారు భవిష్యత్తును గడపాలని కోరుకుంటున్నా అని అంటుంది. సురేందర్ నువ్వు నీ ఇంటిని వదిలి నా కూతురుతో నా ఇంట్లో ఇల్లరికానికి రావాలి అంటూ మనసులో అనుకొని దీవిస్తాడు.. అదేవిధంగా శోభన కూడా మీ ఇద్దరూ ఇక్కడే శాశ్వతంగా ఉండిపోవాలి అని దీవిస్తుంది..
రోహిణి మాత్రం ఇంకా ఆ బాలు తాగలేదా బాలు రచ్చ చేస్తేనే మా అత్తయ్య నన్ను వదిలేస్తుంది అని టెన్షన్ పడుతూ ఉంటుంది. అటు రోహిణి విద్య సెట్ చేసిన మనిషి బ్రతిమలాడుతూ తాగుదాం పద బారు అంటూ అడుగుతాడు. మొత్తానికైతే బాలుని బలవంతంగా ఆ వ్యక్తి బయటకు తీసుకొని వస్తాడు. కారులో వారు సెటప్ చూసి షాక్ అవుతాడు. కానీ తెలివిగా బాలు తాగకుండా అతని చేతే తాగిచ్చి వాటిల్ని పూర్తి చేస్తాడు..
లోపల ఫంక్షన్ అవుతుంటే రోహిణి బాలు రచ్చ చేస్తే తప్ప మా అత్త మా నాన్న గురించి మర్చిపోదు అని టెన్షన్ పడుతూ ఉంటుంది.. ఇక రోహిణి వాళ్ళ నాన్న ఇప్పట్లో వచ్చేలా లేడు అని నల్లపూసలు గుచ్చే కార్యక్రమాన్ని ప్రభావతి మొదలు పెడుతుంది. ముందుగా అనుకున్నట్లుగానే ప్రభావతి మీ నాన్న వస్తాడు బంగారు తెస్తాడు అని అందరూ అనుకున్నారు కానీ ఇప్పటికి రాలేదు ఎక్కడ అని రోహిణి కి స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తుంది.. మీ నాన్న వస్తాడని శృతి వాళ్ళ అమ్మతో బంధువులు అందరితో చెప్పాను కానీ ఇప్పుడు రాకపోతే మాత్రం నీకు ఉంటుంది అని ప్రభావతి దారుణంగా మాట్లాడుతుంది.
ఇక తర్వాత సురేంద్ర తన బంధువులతో ఫంక్షన్ చాలా బాగా చేశాము అని చెప్పుకుంటూ ఉంటాడు.. ఆయన ఫ్రెండ్ ఒకరు ఫంక్షన్ చాలా బాగా చేశావు కానీ నువ్వు చాలా గొప్పోడివి తెలుసా అని అంటాడు.. మీ వియ్యపురాల వాళ్ళ పరిస్థితి తెలిసి వాళ్ళ పెద్ద కోడలు ఫంక్షన్ కూడా ఇందులోనే ఏర్పాటు చేశారు అంటే.. చాలా బాగా చేశారు మంచి ఆలోచన అని మెచ్చుకుంటాడు.. పలు తిండికి గతి లేనివాళ్లు కదా మనం అడుక్కునే వాళ్ళకి ఒక పూట పెడతాం కదా అలానే అనుకొని చేస్తున్నాను అని సత్యం ఫ్యామిలీని తన ఫ్రెండ్ దగ్గర దారుణంగా అవమానిస్తాడు..
Also Read: పార్వతి పరిస్థితిపై బాధపడ్డ అవని..భార్యలకు షాకిచ్చిన కమల్, శ్రీకర్..ప్రేమలో పడ్డ అక్షయ్..
బాలుని వెతుక్కుంటూ మీనా బయటకు వెళ్తుంది. రోహిణి సెట్ చేసిన అతనితో బాలు పూర్తిగా తాగించేస్తాడు. నువ్వేంటి ఇంకా తాగట్లేదు అని అడుగుతాడు. నేను నా భార్యకి ఇచ్చిన మాట కోసమే తాగట్లేదు నువ్వు కాని చెయ్ నువ్వు హ్యాపీ కదా అని అతను అంటాడు. ఆ మాట విన్న మీనా బాలు దగ్గరకొచ్చి హగ్ చేసుకుంటుంది. నా మాట కోసం మీరు తాగలేదు చూడు అది నాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది అని బాలుతో అంటుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్ లో మలేషియా మామ ఇంకా రాలేదా అని సత్యంతో బాలు అంటాడు. ఆ పార్లరమ్మ పెద్ద ఫ్రాడ్ నాన్న మలేషియా లేదు మావిడాకులు లేదు అని బాలు అంటాడు. ఆ తర్వాత రోహిణి బండారం బయటపడుతుందేమో రేపటి ఎపిసోడ్ లో చూడాలి..