TV Anchor Swetcha: మీడియా రంగంలో తీవ్ర విషాదం నెలకొంది. ప్రముఖ లేడీ న్యూస్ రిపోర్టర్ ఆత్మహత్య చేసుకున్నారు. తెలుగు టీవీ యాంకర్ స్వేచ్ఛ వొటార్కర్ ఆత్మహత్య చేసుకుని అందరికీ షాక్ ఇచ్చారు. హైదరాబాద్ జవహర్ నగర్ లోని తన ఇంట్లో స్వేచ్ఛ బలవన్మరణానికి పాల్పడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని ఆమె మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించారు.
స్వేచ్ఛ గత 18 సంవత్సరాలుగా పలు తెలుగు టీవీ ఛానళ్లలో జర్నలిస్టుగా మరియు యాంకర్ గా పనిచేస్తూ తన కంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. టీవీ9 ఛానల్ లో పాపులర్ అయిన స్వేచ్ఛ ప్రస్తుతం TNEWS లో తన సేవలు కొనసాగిస్తున్నారు. TUWJ స్టేట్ జాయింట్ సెక్రటరీగా ఉన్నారు. కాగా, స్వేచ్ఛ ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. స్వేచ్ఛ ఆత్మహత్యకు గల కారణమేంటో తెలుసుకునే ప్రయత్నంలో పోలీసులు ఉన్నారు.