Jabardast Venky : బుల్లితెర పై టాప్ రేటింగ్ తో దూసుకుపోతున్న ఏకైక షో జబర్దస్త్.. ఈ కామెడీ షో ద్వారా ఎంతో మంది ఇండస్ట్రీలో వరుసగా సినిమాలు ఆఫర్స్ ను అందుకుంటున్నారు.. కొందరు హీరోలు, సహాయక నటులుగా, కమెడియన్లుగా రాణిస్తుంటే మరికొందరు నిర్మాతలుగా, డైరెక్టర్లుగా సత్తా చాటుతున్నారు. అలా జబర్దస్త్ కామెడీ షోతో మంచి గుర్తింపు తెచ్చుకున్న వారిలో వెంకీ మంకీ ఒకరు. దాదాపు గా 11 ఏళ్లుగా జబర్దస్త్ లోనే కమెడియన్ గా కొనసాగుతున్నాడు. తన యాసతో కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తున్నాడు. వెంకీ ఇటీవల ఓ యూట్యూబ్ ఛానెల్ ఇంటర్వ్యూ లో పాల్గొన్నారు. ఆ ఇంటర్వ్యూలు జబర్దస్త్ గురించి, అందులో కమెడియన్ల గురించి సంచలన విషయాలను బయట పెట్టాడు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది..
జబర్దస్త్ పై షాకింగ్ కామెంట్స్..
జబర్దస్త్ షో ఎంతోమందికి లైఫ్ ను ఇచ్చింది.. ఎన్నో కుటుంబాలకు అండగా నిలిచింది. నేను చెప్తున్న మాట కాదు.. ఇప్పటివరకు ఎంతోమంది కమెడియన్లు ఈ మాటను అన్నారు. తాజాగా వెంకీ కూడా ఇదే మాటను అంటున్నాడు. నటనను నమ్ముకొని ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన కమెడియన్లకు జబర్దస్త్ షో అమ్మ లాగా మారింది. ఇంటర్వ్యూలో మాట్లాడిన వెంకీ జబర్దస్త్ కమెడీయన్స్ గురించి ఎన్నో విషయాలను షేర్ చేశారు.. ఒక్కొక్కరు ఒక్కొక్కలా మాట్లాడుకుంటారు కానీ నిజం చెప్పాలంటే అందరిని ఇప్పుడు ఈ స్థాయిలోకి తీసుకొచ్చింది జబర్దస్త్ షో మాత్రమే అంటూ ఆయన జబర్దస్త్ పై తనకున్న అభిమానాన్ని బయటపెట్టాడు..
Also Read :చిరంజీవి నాకు గంట క్లాస్ పీకాడు.. ఇండస్ట్రీని వదిలేద్దామనుకున్నా.. కానీ..
పేమెంట్స్ ఎప్పుడిస్తారు..?
జబర్దస్త్ షోలో కమెడియన్లకు గా కొనసాగుతున్న కొందరు బాగా క్రేజ్ వచ్చిన తర్వాత బయటకు వచ్చి జబర్దస్త్ పై సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇప్పటికే చాలామంది జబర్దస్త్ గురించి తప్పుగా ప్రచారం చేశారన్న వార్తలు ఆ మధ్య ఎక్కువగా వినిపించాయి. ముఖ్యంగా పేమెంట్స్ గురించి రకరకాల వార్తలు వినిపించాయి.. ఈ వార్తలను వెంకి కొట్టి పడేసాడు. పేమెంట్ విషయంలో మల్లెమాల ఎప్పుడు వెనకడుగు వేయదు. కరుణా లాంటి పిక్స్ టైంలో కూడా అందరికీ శాలరీలు ముందుగానే ఇచ్చేసింది. ఈరోజు షో చేస్తే ఎల్లుండికి కచ్చితంగా పేమెంట్ క్రెడిట్ అవుతుంది. పేమెంట్ లేకుండా అంటే పదేళ్ల నుంచి నేనెందుకు అక్కడ చేస్తానంటూ వెంకీ ప్రశ్నిస్తున్నాడు. నాకు ఎంతగా సినిమా ఆఫర్లు వచ్చినా కూడా జబర్దస్త్ లో చేస్తూనే ఉన్నానని వెంకీ అంటున్నాడు. ఇక వెంకీ జబర్దస్త్ తో పాటుగా పలు సినిమాల్లో కూడా నటిస్తున్నాడు.
ఇక జబర్దస్త్ నుంచి ఎంతో మంది కమెడీయన్లువెళ్లిపోయారు.. కొందరు సినిమాలతో బిజీగా ఉంటే మరికొందరు మాత్రం ఈవెంట్స్ చేస్తున్నారు. అయితే కొందరు మళ్లీ జబర్దస్త్ కే వస్తున్నారు. తమ మార్క్ కామెడితో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు.