Tanveer Ahmed On Pakistan player In IPL: ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ పై ఇన్నిరోజులు విషం కక్కిన పాకిస్తాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ తన్వీర్ అహ్మద్ మాట మార్చాడు. ఐపీఎల్ ది గ్రేట్ లీగ్ అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు. అక్కడితో ఆగకుండా, తమ పాకిస్తాన్ క్రికెటర్లను కూడా ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ లోకి తీసుకోవాలని ప్రాధేయ పడుతున్నారు. ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య ఉన్న రాజకీయ వివాదాలను పక్కకు పెట్టి, దయచేసి పాకిస్తాన్ ప్లేయర్లను ఐపీఎల్‌లోకి తీసుకోండి అంటూ తన్వీర్ అహ్మద్ రిక్వెస్ట్ చేసినట్టు ఓ పోస్ట్ వైరల్ గా మారాయి. పాక్ ప్లేయర్ల కోసం బీసీసీఐ పెద్దల కాళ్లు పట్టుకోవడానికైనా తాను సిద్ధంగా ఉన్నట్టు ప్రకటించారు. ఐపీఎల్ లోకి పాక్ ప్లేయర్లను తీసుకుని, రెండు దేశాల మధ్య సంబంధాలు పెంచాలని కోరారు. బీసీసీఐ గ్రీన్ సిగ్నల్ ఇస్తే, ఐపీఎల్ ఇరగదీసేందుకు పాక్ ఆటగాళ్లు రేస్ గుర్రాళ్లలాగా భారత్ కు దూసుకు వస్తారని వెల్లడించారు. దీంతో తన్వీర్ అహ్మద్ చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.
ఐపీఎల్ లో ఆడేందుకు పాకిస్తాన్ ప్లేయర్లు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారని తన్వీర్ అహ్మద్ (Tanveer Ahmed) వ్యాఖ్యానించారు. ఐపీఎల్ ఆడేందుకు పర్మిషన్ ఇస్తే, క్రికెట్ పరంగా రెండు దేశాల మధ్య రిలేషన్ పెరుగుతుందన్నారు. ఐపీఎల్ ఒక్కటే కాదు, ఇండియాలో సిరీస్ నిర్వహించినా, పాక్ ప్లేయర్లు వస్తారని ప్రకటించారు. విదేశీ లీగ్స్ లలో పాకిస్తాన్ ప్లేయర్లను ఇండియాకు చెందిన ఫ్రాంచైజీలు కొనుగోలు చేస్తున్నాయని గుర్తు చేశారు. అబ్రార్ అహ్మద్ ను కావ్య పాప కొనుగోలు చేసినట్టు వెల్లడించారు తన్వీర్ అహ్మద్. ఇంటర్నేషనల్ లీగ్ టీ20 లోనూ బాబర్ ఆజం లాంటి ప్లేయర్లను ఇండియాకు సంబంధించిన ఫ్రాంచైజీలు కొనుగోలు చేసేందుకు సిద్ధంగా ఉన్నాయని వ్యాఖ్యానించారు. పనిలోపనిగా ఐపీఎల్ లో ఆడేలా పర్మిషన్ ఇవ్వాలని కోరారు.
ఐపీఎల్ ప్రారంభమైన సమయంలో పాకిస్తాన్ ప్లేయర్లు ఆడేవారు. కానీ 2008లో ముంబై ఉగ్రదాడులు జరిగాయి. పాకిస్తాన్ ఉగ్రవాదులే ఈ దారుణానికి తెగపడినట్టు తేలింది. దీంతో ఐపీఎల్ ఆడకుండా పాకిస్తాన్ ప్లేయర్లపై బ్యాన్ విధించారు.టీమిండియా వర్సెస్ పాక్ మధ్య ధ్వైపాక్షిక సిరీస్ లు కూడా రద్దు చేశారు. ఐసీసీ టోర్నమెంట్స్ లలో మాత్రమే టీమిండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ లు నిర్వహిస్తున్నారు. తటస్థ వేదికలలో మ్యాచ్ లు ఆడిస్తున్నారు.