E-Paper
Advertisement

22A భూములపై సర్కార్ ఫోకస్.. సమస్యకు ఎండ్ కార్డ్ పడుతుందా!

22A భూములపై సర్కార్ ఫోకస్.. సమస్యకు ఎండ్ కార్డ్ పడుతుందా!
Advertisement

22A Land: సొంత ఇల్లు, సొంత భూమి అనేది సామాన్యుడి జీవితంలో ఒక కల, ఒక ధైర్యం. కానీ ఆ ధైర్యాన్ని లాగేసుకుంది 22A నిషిద్ధ జాబితా. భూమి తమదే అని నిరూపించుకోవడానికి కాగితాలు చేతపట్టుకుని, ఏళ్లకు ఏళ్లుగా ప్రభుత్వ ఆఫీసుల చుట్టూ కాళ్లు అరిగేలా తిరిగారు బాధితులు. ఈ నరకయాతనకు చరమగీతం పాడుతూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. బై-నంబర్లు, వివాదాస్పద భూముల సమస్యలకు చెక్ పెడుతూ… బాధితుల దరఖాస్తులను కేవలం 3 రోజుల్లోనే తేల్చాలని ఆదేశించింది. ఈ నెల 14లోగా సంబంధిత దస్త్రాలన్నింటినీ ఆన్‌లైన్‌లోకి తీసుకురావాలని నిర్ణయించింది. ఇన్నాళ్లూ సబ్‌రిజిస్ట్రార్ల విచక్షణాధికారాల పేరుతో, అధికారుల కొర్రీల పేరుతో నలిగిపోయిన వేలాది మంది బాధితులకు ఇది కొండంత ఊరట. ప్రభుత్వం గడువు విధించింది సరే… కానీ కింది స్థాయి అధికారులు ఈ భావోద్వేగాన్ని, బాధితుల వేదనను అర్థం చేసుకుని పనిచేస్తారా? ఇన్నాళ్లూ ఆఫీసుల చుట్టూ తిప్పి ఏడిపించినట్లే మళ్లీ కాలయాపన చేస్తారా? ఏది ఏమైనా… తన సొంత నేలపై పూర్తి హక్కు కోసం దశాబ్దాలుగా కంటిమీద కునుకు లేకుండా ఎదురుచూస్తున్న సామాన్యుడి కళ్లలో, ఈ నిర్ణయం ఒక కొత్త నమ్మకాన్ని నింపింది.

Tags

Related News

BRICS మాస్టర్ ప్లాన్.. ట్రంప్‌కు బిగ్ షాక్..?

డేంజర్ స్థాయికి AI.. ఆంథ్రోపిక్ సంచలన రిపోర్ట్..

తెలంగాణలో అనలాగ్ పన్నీర్ బ్యాన్!

కులగణన వెనుక పొలిటికల్ గేమ్..!

పాలిటెక్నిక్.. పాలిటిక్స్!

హైదరాబాద్‌‌కు సమగ్ర పాలన.. క్యూర్‌తో ప్లస్సా..? మైనస్సా..?

ఎల్ నినో ఎఫెక్ట్.. పవర్ కష్టాలు వస్తాయ్..!

కాంగ్రెస్ లో బిగ్ చేంజెస్..!

Big Stories

Advertisement
×