BigTV English

Brahmamudi Serial Today January 15th: ‘బ్రహ్మముడి’ సీరియల్: కనకాన్ని అవమానించిన రుద్రాణి – కావ్య నగల గురించి అడిగిన రుద్రాణి

Brahmamudi Serial Today January 15th: ‘బ్రహ్మముడి’ సీరియల్: కనకాన్ని అవమానించిన రుద్రాణి – కావ్య నగల గురించి అడిగిన రుద్రాణి

Brahmamudi serial today Episode:  దుగ్గిరాల ఫ్యామిలీ మొత్తం కనకం ఇంటికి  వస్తుంది. కారు దిగగానే అందూ చిన్నచూపుగా చూస్తుంటారు. ఇంతలో ఇందిరాదేవి కనకం ఏర్పాట్లు బాగానే చేయించినట్టు ఉంది అంటుంది. వాళ్ల స్థాయి కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది అంటుంది రుద్రాణి. దీంతో మనం అతిథులుగా వచ్చాం అతిగా మాట్లాడకుండా ఉంటే బాగుంటుంది అంటుంది ఇందిరాదేవి. మీ వీధి పోరు మర్చిపోతే మనం లోపలికి వెళ్దాం అంటుంది అపర్ణ.. ఇంతలో లోపలికి వెళ్తుంటే స్వప్న నా నెక్లెస్‌ ఒకటి ఇంటి దగ్గరే మర్చిపోయాను అంటుంది.


ఒక్క నెక్లెస్‌ లేకపోతే ఏం అమ్మా నువ్వు ఇప్పుడు కూడా మహాలక్ష్మీలా ఉన్నావు అంటాడు సుభాష్‌. అపర్ణ కూడా తెలుగింటి ఆడపిల్లలా ఉన్నావు అంటుంది. దీంతో రుద్రాణి నువ్వు మాత్రం దివాలా తీసిన దానిలా ఉన్నావు. ఒక్క నగ కూడా పెట్టుకోలేదేంటి అని అడుగుతుంది. ఇంటి దగ్గర హడావిడిలో పెట్టుకోలేదు అని కావ్య చెప్పగానే.. ఇంటి దగ్గర పెట్టుకోలేదా..? ఎక్కడైనా తాకట్టు పెట్టావా అంటుంది రుద్రాణి. దీంతో రుద్రాణిని కావ్య తిడుతుంది. అందరూ కలిసి లోపలికి వెళ్తారు.

సీమంతం శ్రీనుకు మన లోపాలు ఎక్కడా బయట పడకూడదని చెప్తుంది కనకం. నువ్వు వదిలేయ్‌ అక్కా అంతా నేను చూసుకుంటాను అంటాడు శ్రీను. ఇంతలో అందరూ ఇంట్లోకి రావడంతో హ్యాపీగా వెళ్లి అందరికీ స్వాగతం పలుకుతుంది కనకం. స్వప్నను చూసి అబ్బబ్బా మెరిసిపోతున్నావే.. దుగ్గిరాల ఇంటికి కోడలివి అనిపించుకున్నావు అంటుంది కనకం. మేం మా బాధ్యతలు బాగానే చేస్తున్నాం కానీ నువ్వే దుగ్గిరాల ఇంటి వియ్యంకురాలివి అనిపించుకోలేకపోతున్నావు.. అంటుంది రుద్రాణి. రుద్రాణి గారికి వెటకారం బాగా ఎక్కువ.. అంటుంది కనకం. నీకు కామన్‌ సెన్స్‌ తక్కువ అంటుంది రుద్రాణి.


అదేంటి అలా అన్నారు అని అడుగుతుంది కనకం. ఈ ఏర్పాట్లు చూస్తే ఎవరైనా అలానే అనుకుంటారు అంటుంది ధాన్యలక్ష్మీ.. అదేంటి బాగాలేదా..? అన్ని దగ్గరుండి నేనే చేయించాను అని చెప్తుంది కనకం. అనుకున్నాను అందుకే ఇంత చీఫ్‌గా ఉన్నాయి అంటుంది రుద్రాణి. వదిన గారు భలే కామెడీ చేస్తున్నారు.. అంటుంది కనకం. ఇలా మాటలతో మభ్యపెడుతూ తూతూ మంత్రంగా చేయిస్తావని నేను ముందే ఊహించాను అంటుంది రుద్రాణి. అందరూ నువ్వు ఊహించనట్టు ఉండరు రుద్రాణి.. పరిస్థితులను అర్థం చేసుకో అంటుంది అపర్ణ. అయినా ఆకావమంత పందిరి ముఖ్యం కాదు మా అక్కను దీవించే విశాల హృదయాలు ముఖ్యం.

ఇక్కడ అలాంటి వాళ్లు చాలా మంది ఉంటారు అని కావ్య చెప్పగానే.. అది మీకు గౌరవంగా ఉండొచ్చేమో కానీ మాకు పుట్టబోయే మనవడికి అవమానంగా ఉంటుంది. దరిద్రాన్ని తల్లి కడుపులో ఉన్నప్పుడే అనుభవించే కర్మ పట్టిందేమో అంటుంది రుద్రాణి. పోనీలే ఉన్నంతలో సర్దుకుపోదాం అంటుంది ధాన్యలక్ష్మీ.. అంతదూరం నుంచి అన్ని సర్దుకుని వచ్చింది ఇక్కడ సర్దుకుపోవడానికా..? అంటుంది రుద్రాణి. దీంతో ఇందిరాదేవి కోపంగా రుద్రాణిని తిడుతుంది. ఇక స్వప్న ఏడుస్తూ ఇక్కడ సీమంతం చేస్తా అన్నప్పుడే నాకు ఆశలు చచ్చిపోయాయి.. ఇక్కడికి వచ్చాక పూర్తిగా చచ్చిపోయాయి అంటూ ఏడుస్తూ లోపలికి వెళ్లిపోతుంది.

లోపలికి వెళ్లిన స్వప్నను కావ్య వెళ్లి కన్వీన్స్‌ చేస్తారు. అక్కడికి వచ్చే బంధువులు మన డబ్బును చూసి వస్తారు. ఇక్కడ వచ్చే వాళ్లంతా మనఃస్పూర్తిగా దీవించడానికే వస్తారు. మనం ఎంత ఖర్చు పెట్టినా చేసిందంతా ఒక్కమాటతో వేస్టే అంటూ తేల్చేస్తారు. అని చెప్తుంది. దీంతో స్వప్న నవ్వుతూ నువ్వు చెప్తుంటే నాకు ఎంతో హ్యాపీగా ఉంది కావ్య అంటూ ఇద్దరి చిన్నప్పటి జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటారు.

బాగా ఆకలిగా వేస్తుందని ఫంక్షన్‌ కదా ఇక్కడైనా నాలుగైదు టిఫిన్స్ పెడతారేమో అనుకుంటే.. ఇక్కడ కూడా బియ్యపు ఉప్మా పెట్టారు అసలు దాని ముఖమే చూడలేదు అంటూ రుద్రాణి, ధాన్యలక్ష్మీకి చెప్తుంది. సీమంతం కోసం పెట్టిన ఫ్రూట్స్ తినాలని రుద్రాణి వెళ్తుంది. సీమంతం శ్రీను అంతా చూసిఆపడానికి ప్రయత్నిస్తాడు. రుద్రాణి ఆగకుండా పండు తీసుకుని కొరుకుతుంది. రుద్రాణికి విషయం అర్థం అవుతుంది. చీచీ అంటూ అక్కడి నుంచి వెళ్లిపోతుంది.

రాజ్‌ గదిలోకి కావ్య వచ్చి ఏంటండి మీరు గదిలోకి పిలవడానికి మీకు వేళా పాళా లేదా..? అంటుంది. సొంత పెళ్లాన్ని గదిలోకి పిలవడానికి టైం చూసుకోవాలా అంటాడు రాజ్‌. ఇంతకీ ఎందుకు పిలిచారో చెప్పండి అనగానే.. ఈ గది చూస్తుంటే ఫస్ట్‌ రోజు నువ్వు నేను గొడవ పడింది గుర్తుకు వచ్చింది అంటాడు రాజ్‌. ఇంతలో కావ్యను దగ్గరకు లాక్కుని హగ్‌ చేసుకుంటాడు రాజ్‌. ఇంతటితో నేటి బ్రహ్మముడి సీరియల్‌ ఎపిసోడ్‌ అయిపోతుంది.

 

ALSO READ: సకల బాధలను దూరం చేసే షణ్ముఖి రుద్రాక్ష ధారణ ఎవరు చేయాలి..?

 

Tags

Related News

Big Tv Kissik Talks: వాడి కోసం ప్రాణాలైనా ఇస్తా… థాంక్స్ చెప్పి రుణం తీర్చుకోలేను!

Big Tv Kissik Talks: అందుకే పిల్లల్ని వద్దనుకున్నాం..  బాంబు పేల్చిన అమర్!

Big Tv Kissik Talks:  అమర్ దీప్ , తేజు మధ్య గొడవలు.. ఇన్నాళ్లకు బయటపెట్టిన అమర్!

Anasuya: రాఖీ స్పెషల్.. అనసూయలో ఎంత మార్పు… ఇలానే ఉండొచ్చు కదా

Illu Illalu Pillalu Today Episode: రామరాజు, వేదవతిని కలిపిన నర్మద.. రచ్చ చేసిన భద్ర.. పోలీసుల ఎంట్రీ.. శ్రీవల్లికి షాక్..

Intinti Ramayanam Today Episode: పల్లవి ప్లాన్ సక్సెస్.. భరత్ కోసం అవని కన్నీళ్లు.. పార్వతికి దిమ్మతిరిగే షాక్..

Big Stories

×