Viral Video: ఇటీవల యువత ప్రమాదకరమైన స్టంట్స్ చేస్తూ ప్రాణాలను సైతం లెక్కచేయడం లేదు. సోషల్ మీడియాలో వ్యూస్, వైరల్ అయ్యేందుకు ప్రమాదకరమైన స్టంట్స్ చేస్తూ.. ఏకంగా ప్రాణాలే కోల్పోతున్నారు. గతంలో కూడా కొంత డేంజర్ స్టంట్స్, రీల్స్ చేస్తూ ప్రాణాలను కోల్పోయినవారు ఉన్నారు. అయితే కొంత మందికి ఏమాత్రం బుద్ది రావడం లేదు. తాజాగా ఒడిశాలోని బౌధ్ జిల్లాలో రైల్వే ట్రాక్ పై ఓ యువకుడు ప్రమాదకరమైన స్టంట్ చేసిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది. దీనిపై నెటిజన్లు, పోలీసులు ఓ రేంజ్ లో విరుచుకపడుతున్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
ఒడిశాలోని, బౌధ్ జిల్లాలో రైల్వే ట్రాక్ పై డేంజర్ స్టంట్ చేస్తూ సోషల్ మీడియా కోసం రీల్ చిత్రీకరించిన ముగ్గురు మైనర్ బాలురను బాలంగీర్ గవర్నమెంట్ రైల్వే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన గత ఆదివారం సాయంత్రం 5 గంటల సమయంలో తలుపాలి గ్రామం సమీపంలో జరిగింది. సోషల్ మీడియాలో లైక్స్, వ్యూస్, అలాగే ఫేమస్ అయ్యేందుకు ఒక బాలుడు రైలు ట్రాక్‌పై పడుకోగా, రైలు వేగంగా దానిపై నుంచి వెళ్లే సమయంలో మిగిలిన ఇద్దరు మైనర్ బాలురు వీడియో తీశారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది. బాలంగీర్ పోలీసులు ఈ ముగ్గురు మైనర్ బాలురను అరెస్ట్ చేసి విచారిస్తున్నారు.
ALSO READ: NRSC: డిగ్రీతో హైదరాబాద్‌లో జాబ్స్, లక్షకు పైగా వేతనం, ఇంకా 4 రోజులే!
అయితే.. ఘటనపై నెజిజన్లు ఓ రేంజ్ లో ఫైరవుతున్నారు. రీల్స్ కోసం ఎంతకు తెగించార్రా.. ఏకంగా ప్రాణాలను లెక్క చేయడం లేదు అని నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఇటువంటి స్టంట్లు ప్రాణాంతక పరిణామాలకు దారితీయవచ్చని మండిపడుతున్నారు. ఈ సంఘటన తర్వాత, ఈస్ట్ కోస్ట్ రైల్వే (ECoR) రైల్వే ట్రాక్‌లపై ఇటువంటి ప్రమాదకర స్టంట్లు చేయవద్దని, భద్రతా నిబంధనలను పాటించాలని ప్రజలను, ముఖ్యంగా యువతను హెచ్చరించింది. అలాగే, ఈ ప్రాంతంలో రైల్వే భద్రతపై ఇలాంటి స్టంట్ల వల్ల కలిగే ప్రమాదాల గురించి అవగాహన కల్పించే కార్యక్రమాన్ని ప్రారంభించింది.
ALSO READ: Telangana Govt: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఇక వారికి రోజుకి 10 గంటల పని
ఈ ఘటన రైల్వే భద్రతా చట్టాల గురించి స్థానికులకు తెలియకపోవడం.. అలాగే ఇలాంటి చర్యల వల్ల కలిగే పరిణామాల గురించి అవగాహన లేకపోవడాన్ని బయటపెట్టింది. అధికారులు ఇటువంటి స్టంట్లను నిరోధించేందుకు కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. యువత ఇలాంటి డేంజర్ స్టంట్స్ చేస్తూ.. జీవితాలను ఆగం చేసుకోవద్దని రైల్వే అధికారులు సూచిస్తున్నారు.