BigTV English

Lion Eating Leaves : ఆకులు తింటున్న సింహం.. వైరల్ వీడియో!

Lion Eating Leaves : ఆకులు తింటున్న సింహం.. వైరల్ వీడియో!

Lion Eating Leaves


Lion Eating Leaves : సింహం.. అడవికి రాజు. దాని ఆకలేసినప్పుడు మాంసం దొరక్కపోతే.. పస్తులైనా ఉంటుంది. మనలో చాలా మంది ఇలానే అనుకుంటున్నారు. కానీ కొన్ని సందర్భాల్లో సింహాలు కూడా గడ్డి, చెట్ల ఆకులు తింటాయట. ఫారెస్టు ఆఫీసర్ సుశాంత నంద ఇటీవల ఇందుకు సంబంధించి ఓ వీడియో సోషల్ మీడియాలో షేర్ చేశాడు.

ఆ వీడియోలో ఓ సింహం చెట్ల ఆకులను తింటోంది. చాలా మంది ఈ వీడియోను చూసి షాకవుతున్నారు. ఇంతకీ సింహం ఎలాంటి సందర్భాల్లో గడ్డి తింటుంది? ఈ ప్రశ్నకు ఫారెస్టు ఆఫీసర్ సుశాంత నందానే సమాధానం చెప్పారు. అదేంటో చూద్దాం..


READ MORE : బిందెలో ఇరుక్కున్న చిరుత తల.. వీడియో వైరల్

సింహాలకు కొన్ని సందర్భాల్లో మాంసం జీర్ణం అవదు. కడుపులో ఇబ్బందిగా ఉంటుంది. అలాంటి సందర్భాల్లో సింహాలు గడ్డి తింటాన్నారు. కొన్ని రకాల గడ్డి వాటికి ఉపశమనం కలిగిస్తుంది. ఇంకొన్ని సార్లు సింహాలు చెట్ల ఆకులను కూడా తింటాయి. తిన్న మాంసం అరగక, పొట్టలో ఇబ్బందిగా ఉంటే అలా చేస్తాయి. దీనివల్ల వాంతి అయి కడుపు ఫ్రీగా ఉంటుంది.

అంతేకాకుండా సింహాలు ఎండలు అధికంగా ఉన్నప్పుడు శరీరం హైడ్రేషన్ బారిన పడకుండా పచ్చని చెట్ల ఆకులను తింటాయని తెలిపారు. ఇలా చేయడం వల్ల అధిక ఉష్ణోగ్రతల నుంచి ఉపశమనం పొందుతాయట. సింహాలే కాదు.. పులులు కూడా కొన్ని సందర్భాల్లో గడ్డి, చెట్ల ఆకులను తింటాయి.

మనమందరం.. సింహాలను మాంసాహారులు అనుకుంటారు. కానీ, అవి సర్వభక్షకాలు. అంటే.. మాంసంతో పాటు కూరగాయలను కూడా తింటాయి. అడవిలో ఉండే సింహాలు మాత్రం జంతువులను వేటాడి తినడంలోనే ఎక్కువ ఆనందాన్ని పొందుతాయట.

READ MORE : ధోనీ దాండియా ఆడితే ఆ కిక్కే వేరప్ప..!

ఐఎఫ్‌ఎస్ అధికారి సోషల్ మీడాయా ఫ్లాట్‌ఫామ్ ఎక్స్‌లో ఈ వీడియోను షేర్ చేశారు. దీన్ని చూసిన నెటిజన్లు స్పందిస్తున్నారు. కొంత మంది ఇలా అంటున్నారు.. ‘సింహం గురించి ఆశ్చర్యకరమైన సమాచారాన్ని తెలిపినందుకు ధన్యవాదాలు’ అని ఓ ఎక్స్ యూజర్ కామెంట్ చేశాడు. పిల్లులు, సింహాలు, పులులు వంటి జంతువులు జీర్ణవ్యవస్థను శుభ్రపరుచుకునేందుకు గడ్డిని తింటాయి’ అని కామెంట్ చేశారు.

కొన్ని జంతువులు గడ్డి, ఆకులు తినడం వల్ల సులభంగా జీర్ణం అవుతుందని మరొకరు కామెంట్ చేశారు.
మాంసం జీర్ణం కాకపోవడం వల్ల కడుపులో ఇబ్బందిపడుతూ ఉపశమనం కోసం అలా చేస్తాయని అన్నారు. కొన్ని ప్రాంతాల్లో పంది మాంసం తీసుకునే వాళ్లు.. ఆ మాంసాన్ని వండేందుకు మసాలాకి బదులుగా వివిధ రకాల ఆకుపచ్చ ఆకులను ఉపయోగిస్తారని ఓ యూజర్ రాసుకొచ్చాడు.

Tags

Related News

Indonesian Elderly Couple: గూగుల్ స్ట్రీట్ వ్యూలో వృద్థ జంట.. పదేళ్ల జీవితం కళ్ల ముందు.. గుండె బరువెక్కడం ఖాయం!

Viral Video: పిల్లలా? నా వల్ల కాదు.. ఆడ సింహన్ని చూసి మృగరాజు పరుగోపరుగు!

Marriage: శోభనం రాత్రి.. బాల్కనీ నుంచి దూకిన వధువు.. కట్ చేస్తే, పెద్ద స్కామ్!

Monkey video viral: కోతి తలకు పగడి ధరించి.. ఓ మోడల్ లాగా..? వీడియో మస్త్ వైరల్

Hyderabad News: మిడ్ నైట్ రోడ్లపై హంగామా.. ఓ చేతిలో బాటిల్.. మరో చేతిలో, కెమెరాకి చిక్కాడు

Viral CCTV Video: ఫ్యాక్టరీకి వచ్చిన సింహం.. ఎదురుగా మనిషి.. ట్విస్ట్ తెలిస్తే నవ్వులే.. వీడియో వైరల్!

Big Stories

×