BigTV English

Viral Video : మట్టి తవ్వుతుండగా బయటపడ్డ విచిత్ర ఆకారం..!

Viral Video : మట్టి తవ్వుతుండగా బయటపడ్డ విచిత్ర ఆకారం..!
Tortoise Videos
Tortoise Videos

Viral Video : సాధారణంగా పురాతన ప్రదేశాలు, గుప్తనిధుల కోసం తవ్వకాలు జరిగినప్పుడు లేదా పురావస్తు శాఖ తవ్వకాలు జరిపినప్పుడు కొన్ని సందర్భాల్లో విచిత్ర వస్తువులు బయటపడుతుంటాయి. ఇటువంటి సంఘటనలు మనం చలానే చూశాం. గూగుల్‌లో వెతికినా అటువంటి ఘటనలు దర్శనమిస్తాయి. ఇలాంటి ఘటనలే సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తుంటాయి.


ప్రస్తుతానికి అటువంటి ఘటనకు సంబంధింతచిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఓ మహిళ మట్టిని తవ్వుతూ ఉండగా ఏదో అడ్డుతగిలింది. ఏంటా అని కాస్త లోతుగా తవ్వగా ఓ వింత ఆకారం బయటపడింది. అదేంటా అని చూడగా మతిపోయింది. చూడటానికి ఆ ఆకారం భయంకరంగా ఉంది. అదేంటే మీరు చూసేయండి ధైర్యంగా..!

READ MORE : ర్యాపిడో బుక్ చేసుకొని.. బైక్ నెట్టించాడు.. ఐడియా బలే ఉందే!


వైరల్ అవుతున్న వీడియో చూసినట్లయితే.. ఓ మహిళ మట్టి తవ్వుతూ ఉంది. కొందరు ఆమెకు హెల్ప్ చేస్తున్నారు. ఆ మహిళ గుంతను చాలా లోతుగా తీసింది. ఈ క్రమంలో ఆమె గుంతను తవ్వుతూ ఉండగా ఓ వింత ఆకారం కనిపించింది. దీంతో వారంతా ఒక్కసారిగా భయబ్రాంతులకు గురయ్యారు.

కానీ వారు కంగారుపడకుండా.. అదేంటోనని తెలుసుకునేందుకు ప్రయత్నించారు. ఆ ఆకారం చుట్టూ ఉన్న మట్టిని జాగ్రత్తగా తొలగించారు. గుంతను మొత్తం తీయగా ఆ ఆకారంలో ఉంది ఏవో జీవులని తేలింది. చివరికి తీక్షణంగా వాటిని పరిశీలించగా.. చాలా తాబేళ్లులా అనిపించాయి.

తాబేళ్లు ఓ రాయి మాదిరిగా ఒకదానిపై మరొకటి పేర్చినట్టుగా ఉన్నాయి. అందులోనూ అవి ప్రాణాలతో ఉండటం గమనార్హం. చెరువుల సమీపాన, తేమ ఉన్నచోట తాబేళ్లు ఇలా మట్టిలో నిద్రావస్థలో ఉంటాయని అంటున్నారు నిపుణులు.

మన ప్రాంతాల్లో ఇటువంటి తాబేళ్లు కనపడవు. వాటి రంగు చాలా వింతగా,కాస్త డిఫరెంట్‌గా ఉంది. సాధారణంగా తాబేళ్లు ముదురు పచ్చరంగులో ఉంటాయి. మనమందరం ఇవే చూసుంటాం. అవి తలను ఎప్పుడూ కూడా శరీరంలోపలకే ఉంచుతాయి. వేటాడేటప్పుడు, తిరిగేటప్పుడు మాత్రమే తలను బయటకు ఉంచుతాయి.

READ MORE : ఊడిపడిన టైరు.. గాల్లో 235 మంది ప్రాణాలు.. ఆ తర్వాత ఏం జరిగింది..?

ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వరుసపెట్టి కామెంట్లతో హోరెత్తిస్తున్నారు. ఇలాంటి తాబేళ్లు చూడటం ఇదే మొదటిసారి అని ఓ యూజర్ కామెంట్ చేశాడు. తాబేళ్లు అన్ని కూడా గోడకట్టినట్లుగా వరుసగా ఉన్నాయని మరొకరు కామెంట్ చేశారు. మీరేమనుకుంటున్నారో వీడియో చూసి ఓ కామెంట్ చేయండి.

Tags

Related News

Indonesian Elderly Couple: గూగుల్ స్ట్రీట్ వ్యూలో వృద్థ జంట.. పదేళ్ల జీవితం కళ్ల ముందు.. గుండె బరువెక్కడం ఖాయం!

Viral Video: పిల్లలా? నా వల్ల కాదు.. ఆడ సింహన్ని చూసి మృగరాజు పరుగోపరుగు!

Marriage: శోభనం రాత్రి.. బాల్కనీ నుంచి దూకిన వధువు.. కట్ చేస్తే, పెద్ద స్కామ్!

Monkey video viral: కోతి తలకు పగడి ధరించి.. ఓ మోడల్ లాగా..? వీడియో మస్త్ వైరల్

Hyderabad News: మిడ్ నైట్ రోడ్లపై హంగామా.. ఓ చేతిలో బాటిల్.. మరో చేతిలో, కెమెరాకి చిక్కాడు

Viral CCTV Video: ఫ్యాక్టరీకి వచ్చిన సింహం.. ఎదురుగా మనిషి.. ట్విస్ట్ తెలిస్తే నవ్వులే.. వీడియో వైరల్!

Big Stories

×