BigTV English

Girl Crying and Serving Vada Pav: వడపావ్ అమ్ముతూ ఏడుస్తున్న చంద్రికా గేర్ దీక్షిత్‌.. అసలు కథ తెలిస్తే షాకే!

Girl Crying and Serving Vada Pav: వడపావ్ అమ్ముతూ ఏడుస్తున్న చంద్రికా గేర్ దీక్షిత్‌.. అసలు కథ తెలిస్తే షాకే!
Viral
Chandrika Vada pav

Vada Pav Girl Viral Video : ఢిల్లీలో వడపావ్ చాలా ఫేమస్ అయిన స్ట్రీట్ ఫుడ్. ఢిల్లీలో గల్లికో వడపావ్ బండి ఉంటుంది. అక్కడికి వెళితే ఈ స్ట్రీట్‌ఫుడ్ కచ్చితంగా తినాల్సిందే. అయితే ఢిల్లీ రోడ్లలో వడపావ్ గర్ల్‌‌గా చంద్రికా గేరా దీక్షిత్ ఎంతో ఫేమస్. ఆమె తయారు చేసే వడపావ్ చాలా మంచి పేరు ఉంది. అక్కడ దొరికే వడపావ్ తినకుండా స్థానిక ప్రజలు ఉండలేరు. చంద్రికా ఫుడ్‌స్టాల్ దగ్గర మీరు కూడా వడపావ్ తినాలంటే గంటల సేపు వెయిట్ చేయాలి. ఎందుకంటే జనాలు పెద్ద సంఖ్యలో క్యూ కడతారు. సోషల్ మీడియాలో ఇందుకు సంబంధించిన చాలానే వీడియోలు ఉన్నాయి.


చంద్రికా గతంలో హల్దీ రామ్‌లో ఉద్యోగం చేసేది. సొంతంగా బిజినెస్ చేయాలనే ఆసక్తితో ఆమె వడపావ్ ఫుడ్ బిజినెస్ ప్రారంభించారు. ఢిల్లీలోని సైనిక్ విహార్‌లో తన వడపావ్ స్టాల్‌ను ప్రారంభించారు. బీటెక్ పానీపూరి వాలీ తర్వాత ఢీల్లీలో చంద్రికా చాలా ఫేమస్. ఫుడ్‌ బిజినెస్ పెంచే ఆలోచనలో కూడా ఆమె ఉన్నారు. అయితే తాజాగా ఆమెకు సంబంధించిన వీడియో ఒకటి వైరల్ అవుతోంది. బ్రెడ్ కట్ చేస్తూ.. ఏడుస్తూ కనిపించారు చంద్రికా గేర్ దీక్షిత్‌.

Also Read: స్టేజ్ పై కొడుకు యాక్టింగ్.. కన్నీళ్లు పెట్టుకున్న తండ్రి! వీడియో వైరల్


వీడియో చూసినట్లయితే చంద్రికా వడపావ్ చేసేందుకు బ్రెడ్ కట్ చేస్తున్నారు. ఆమెకు మరో ఇద్దరు హెల్ప్ చేస్తున్నారు. ఇదంతా పక్కనబెటితే.. ఆమె ఏడుస్తూ ఉంది. ఓ పక్క పోన్ మాట్లాడుతూ ఉంది. మరో పక్క కస్ట‌మర్లకు సర్వ్ చేస్తుంది. ఈ వీడియోను ఓ కస్టమర్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.

సోషల్ మీడియాలో లభించిన సమాచారం ప్రకారం.. ఆమె బిజినెస్‌లో ఏదో సమస్య ఎదుర్కొంటుంది. ఢిల్లో మున్సిపల్ కార్పిరేషన్ అధికారులు ఫుడ్‌స్టాల్ మూసి వేయాలని ఆమెపై ఒత్తడి తెస్తున్నట్లు చంద్రికా తెలిపారు. గతంలో పర్మిషన్ కోసం రూ.30 వేలు చెల్లించాలని, అధికారులు ఇంకా డబ్బు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. లేదంటే బిజినెస్ క్లోజ్ చేయాలని బెదిరిస్తున్నారని చెప్పారు. ఆమెను బెదిరించిన వారి వివరాలను తెలుపలేదు చంద్రికా.

Also Read: అక్కో నీకో దండం.. ప్రెషర్ కుక్కర్‌ని ఇలా కూడా వాడొచ్చాని ఇంతవరకు తెలిదే!

వైరల్ వీడియోస్ అనే అకౌంట్ ‌నుంచి ఈ వీడియో అప్లోడ్ అయింది. దీన్ని చూసిన నెటిజన్లు స్పందిస్తున్నారు. రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు. మీరు మున్సిపల్ అధికారుల అనుమతి తీసుకోవాలని ఓ నెటిజెన్ కామెంట్ చేశాడు. మీరు బిజినెస్ నడపాలంటే మున్సిపాలిటీ నిబంధనలు పాటించాలని మరోకరు సూచించారు. ఫుడ్ స్టాల్స్ వల్ల ప్రభుత్వం నష్టపోతుందని కామెంట్ చేశాడు మరో యూజర్. బిజినెస్ చేయాలంటే సొంత స్థలం ఉండాలని హితవు పలుకుతున్నారు. లైసెన్స్ లేకుండా స్టాల్ ఎలా నడుపుతారని మరొకరు ప్రశ్నించారు. లైసెన్స్ ఉంటే మిమ్మల్ని ఎవరూ ఇబ్బంది పెట్టరని మరొ నెటిజన్ తెలిపాడు.

Tags

Related News

Viral CCTV Video: ఫ్యాక్టరీకి వచ్చిన సింహం.. ఎదురుగా మనిషి.. ట్విస్ట్ తెలిస్తే నవ్వులే.. వీడియో వైరల్!

Elephant video: ఈ పిల్ల ఏనుగు పడుకున్న వ్యక్తిని లేపీ మరీ..? నిజంగా ఇది అద్భుతం.. వీడియో వైరల్

Fight Viral Video: విద్యార్థుల ముష్టి యుద్ధం.. చొక్కాలు చినిగినా, వదల్లేదు.. వైరల్ వీడియో!

Jana Gana Mana: జాతీయ గీతాన్ని చిన్నారి ఎంత ముద్దుగా పాడిందో చూడండి.. వావ్ అనాల్సిందే..!

Burning pyre reel: స్మశానంలో కాలుతోన్న శవం పక్కన.. డ్యాన్స్ చేస్తూ రీల్స్ చేసిన అమ్మాయి, వీడియో వైరల్

Viral wedding: అందుకే ఒకే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాం.. వింత వివాహంపై స్పందించిన అన్నదమ్ములు

Big Stories

×