Indian Railway: రన్నింగ్ ట్రైన్స్ మీద ప్రమాదకర విన్యాసాలు చేస్తూ పలువురు ప్రాణాలు కోల్పోయారు. ఈ నేపథ్యంలో రైల్వే అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. రైళ్లలో, రైల్వే స్టేషన్లలో, రైల్వే ట్రాక్స్ మీద ఫోటోలు, రీల్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అయినప్పటికీ యువత తీరు మారడం లేదు. ప్రాణాలకే ప్రమాదం అని తెలిసినప్పటికీ, పెడ చెవిన పెడుతున్నారు. తాజాగా చెన్నై స్టూడెంట్స్ రన్నింగ్ ట్రైన్ లో డేంజర్ స్టంట్స్ చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఘటనపై రైల్వే పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
వేగంగా దూసుకెళ్తున్న రైలుపై విన్యాసాలు
తాజాగా వెలుగులోకి వచ్చిన వీడియోలో చెన్నైలో వేగంగా దూసుకుపోతున్న రైలులో కాలేజీ విద్యార్థులు ఫుట్ బోర్డ్ మీద నిలబడి ప్రమాదకర విన్యాసాలు చేశారు. రెండు వేర్వేరు కాలేజీలకు చెందిన ఐదుగురు విద్యార్థులు వేగంగా దూసుకుపోతున్న సబర్బన్ రైలు లో ప్రమాదకర రీతిలో నిలబడి ప్రయాణం చేశారు. వారిలో వారిలో ఇద్దరు రైలు మీద నిలబడ్డారు. వారిలో ఒకరు కాలేజీ ఐడీ కార్డును వేసుకుని ఉన్నాడు. అత్యంత శక్తివంతమైన రైల్వే విద్యుత సరఫరా వైర్లను ఎక్కడ తగులుతారోనని ఈ వీడియోను చూసిన నెటిజన్లు టెన్షన్ తో భయపడ్డారు. ఈ డేంజర్ స్టంట్స్ ను తోటి విద్యార్థులు షూట్ చేసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. కొద్ది సేపట్లోనే ఈ వీడియో వైరల్ అయ్యింది.
దర్యాప్తు మొదలు పెట్టిన అధికారులు
ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో రైల్వే పోలీసులు దృష్టికి వచ్చింది. ఈ వీడియో ఎక్కడ జరిగింది? ఎప్పుడు జరిగింది? ఈ విద్యార్థులు ఏ కాలేజీకి చెందిన వాళ్లు అనే విషయాలను ఆరా తీస్తున్నారు. అంతేకాదు, ఈ ఘటనపై రైల్వే గవర్నమెంట్ పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రమాదకర విన్యాసాలు చేసిన విద్యార్థులను పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇందుకోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. త్వరలోనే వారిని పట్టుకుని జైలుకు పంపించనున్నట్లు తెలిపారు.
चेन्नई में छात्रों का इलेक्ट्रिक ट्रेन की छत पर खतरनाक स्टंट, वीडियो वायरल
चेन्नई में कॉलेज छात्रों का तेज़ रफ्तार इलेक्ट्रिक ट्रेन की छत पर सफर करते हुए खतरनाक स्टंट करते वीडियो वायरल हुआ है. ‘Route thala’ नामक इस खतरनाक ट्रेंड में कुछ छात्र खुद को इलाके का दबदबा दिखाने के लिए… pic.twitter.com/wUuK1s6wY8
— AajTak (@aajtak) April 9, 2025
Read Also: జపాన్ 6 గంటల్లో 3D-ప్రింటెడ్ రైల్వే స్టేషన్ ను ఎలా నిర్మించింది!
గతంలోనూ వెలుగులోకి వచ్చిన పలు డేజరస్ వీడియోలు
తాజాగా వెలుగులోకి వచ్చిన చెన్నై లాంటి ఘటనలు ఇప్పటికే పలు సోషల్ మీడియా ద్వారా బయటకు వచ్చాయి. వారిపై రైల్వే పోలీసులు కేసులు నమోదు చేసి జైలుకు తరలించారు. రీసెంట్ గా యూపీలోని ఉన్నావ్ లో ఓ యువకుడు ఏకంగా ట్రాక్ మీద పడుకుని తన మీదుగా వెళ్తున్న రైలును షూట్ చేశాడు. అతడిని పోలీసులు అరెస్ట్ చేశారు. రైల్వే చట్టాల ప్రకారం కేసులు నమోదు అయితే, జీవితంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంటుందని రైల్వే పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రాణాల మీదకు తెచ్చుకునే పనులు చేయకూడదంటున్నారు. ముఖ్యంగా రైళ్లలో డేంజరస్ స్టంట్లు చేసే వారిని ఏమాత్రం ఉపేక్షించబోమని హెచ్చరించారు.
Read Also: రీల్ కోసం యువకుడి డేంజర్ స్టంట్.. పట్టుకొని వీపు విమానం మోత మోగించిన పోలీసులు!