E-Paper
Advertisement

Viral Video: నడి రోడ్డుపై వంట.. ఇంకెక్కడా ప్లేసు దొరకలేదా? ఈ వీడియో చూస్తే షాకే!

Viral Video: నడి రోడ్డుపై వంట.. ఇంకెక్కడా ప్లేసు దొరకలేదా? ఈ వీడియో చూస్తే షాకే!
Advertisement

వీకెండ్స్, సెలవు దినాల్లో చాలా మంది లాంగ్ జర్నీకి వెళ్తారు. మరికొంత మంది పర్యాటక ప్రాంతాలను చూసేందుకు వెళ్తారు. వెళ్లే సమయంలో కొంత మంది ఇంట్లో నుంచే తినుబండారాలను తీసుకెళ్తారు. మరికొంత మంది వంట సామాన్లను తీసుకెళ్లి ఎక్కడో ఓ చోట ఆపి హ్యాపీగా వంట చేసుకుని తింటారు. తాజాగా లాంగ్ టూర్ కు వెళ్లిన ఓ ఫ్యామిలీ ఎక్కడో మైదాన ప్రాంతంలో కాకుండా ఏకంగా నడి రోడ్డునే కిచెన్ గా మార్చేశారు. తారు రోడ్డు మీదే వంట చేస్తూ కనిపించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిని చూసిన నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

నడి రోడ్డు మీదే వంట చేసిన మహిళ

తాజాగా ‘ది నలంద ఇండెక్స్’ ఎక్స్ ఖాతా నుంచి షేర్ చేసిన వీడియోలో.. ఒక ఓ ఫ్యామిలీ రోడ్డు మీదే తమ కారును పార్క్ చేశారు. వెనుక డిక్కీ ఓపెన్ చేసి, కారులోని వంట సామాగ్రి అంతా రోడ్డు మీదే పరిచారు. కూరగాయలు కట్ చేసి చెత్తనంతా రోడ్డు మీదే వేశారు. రోటీలు చేసి కార్చుతున్నట్లు కనిపించింది. మొత్తంగా రోడ్డు మీదే వంటను కానిచ్చేశారు. “దేశంలో కొంత మందికి సివిక్ సెన్స్ అనేది లేకుండా పోతుంది. అందుకు బెస్ట్ ఎగ్జాంపుల్ ఈ వీడియో. ఒక ఫ్యామిలీ ఏకంగా రోడ్డు మధ్యలో కూర్చోని వంట చేస్తుంది. ఆ ప్రాంతాన్ని అంతా గందరగోళంగా మార్చేశారు. ఏదైనా వాహనం వేగంగా దూసుకొస్తే పరిస్థితి ఏంటి?” అని ఆ వీడియోకి క్యాప్షన్ పెట్టారు.

Advertisement

ఇక ఆ వీడియోలో ఉన్న మహిళ తాము చేస్తున్న పనిని సమర్థించుకుంది. చపాతీలు చేస్తూ మాట్లాడిన సదరు మహిళ.. “రోడ్డు మీద వంటలు చేయకూడదని మాకు తెలుసు. కానీ, రోడ్డు అంతా దూరంగానే ఉంది. ఇది వాహనాలు ఆపేందుకు కేటాయించిన స్థలం. అవసరం అయితే, వాహనాలు పక్కన ఆపుకుని విశ్రాంతి తీసుకునేందుకు ఉద్దేశించబడింది” అని చెప్పుకొచ్చింది.

Advertisement

Read Also:  ఉల్లి పెట్టిన లొల్లి.. భార్యకు విడాకులిచ్చిన భర్త, ఇంత చిన్న కారణానికే?

నెటిజన్లు ఏమంటున్నారంటే?

ఈ వీడియో కాసేపట్లోనే సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యింది. “వాహనాలను ఆపుకునేందుకు అవకాశం కల్పించిన ప్రదేశంలో వంట చేయడం కచ్చితంగా నిబంధనల ఉల్లంఘనే అవుతుంది. ఇలాంటి చర్యలు వాహనదారులకు పెద్ద ప్రమాదాన్ని కలిగిస్తాయి” అని నెటిజన్లు చెప్పుకొచ్చారు. “రోడ్ల మీద ఇలాంటి పనులు చెయ్యొచ్చనే ఆలోచన ఎలా వస్తుందో అర్థం కావడం లేదు. ఇలా చేయడం వారితో పాటు ఇతరులకు ప్రమాదకరం” అని ఇంకో వ్యక్తి కామెంట్ చేశాడు.  “పబ్లిక్ ప్లేస్ ను మిస్ యూజ్ చేసిన సదరు వ్యక్తుల మీద కచ్చితంగా చర్యలు తీసుకోవాల్సిందే” అని మరో నెటిజన్ రాసుకొచ్చాడు. మొత్తంగా ఈ వీడియోలోని ఫ్యామిలీపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Read Also: భార్యతో గొడవ.. జేబులో చేతులు పెట్టుకుని 450 కి.మీలు నడుస్తూ వెళ్లిపోయిన భర్త!

Related News

ఒకరిది ‘మర్డర్ ప్లాన్’.. మరొకరిది ‘బొందపెట్టే ప్లాన్’.. మెట్రోలో ‘కౌంటర్’ అదిరిందిగా!

వారేవ్వా బామ్మా! నేటి యువతకే ఛాలెంజ్ విసురుతూ.. 116 ఏళ్ల వృద్ధురాలు తిరుమల మెట్లు ఎలా ఎక్కారంటే?

నడిరోడ్డుపై దారుణం.. 8 బైక్‌లపై వచ్చి.. పోలీస్‌ను చితకబాదారు!

నేటి కాలంలోనూ ఇలాంటి గురుభక్తా? రిటైర్ అవుతున్న టీచర్‌కు ఊహించని సర్ప్రైజ్!

రాజపుత్‌ల వీరత్వానికి ప్రతీకలు.. కొండలపై రాజస్థాన్ కోటలు.. జీవితంలో ఒక్కసారైనా చూడాల్సిందే

అయ్య బాబోయ్.. 1454 అడుగుల ఎత్తులో టవర్‌పై లవ్‌ ప్రపోజ్‌.. ఆ సమయంలో జంట మధ్య ఏం జరిగిందంటే

సిరిసిల్లలో ఘోరం.. బూందీ మిక్చర్‌లో బల్లి కళేబరం.. ప్రశ్నిస్తే యజమాని ఏం చేశాడో తెలుసా?

వియత్నాంలోని ఓ రెస్టారెంట్‌లో ఇండియన్ ఫ్యామిలీ వీరంగం, ఇన్‌ఫ్లుయెన్సర్స్ అంటూ బెదిరింపులు, ఏం జరిగింది?

Big Stories

Advertisement
×