Viral News: ఊట బావి నీళ్లు తాగితే కవల పిల్లలు పుడుతారట. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా, ఇది నిజం. పిల్లలు లేని వారికి పిల్లలు కూడా పుడుతున్నారట. ఈ విషయం తెలియడంతో సంతానం కోసం ఎదురు చూస్తున్న జంటలు ఆ ఊట బావి నీళ్ల కోసం క్యూ కడుతున్నారు. ఇంతకీ ఆ ఊట బావి ఎక్కడ ఉంది? ఆ నీళ్లు తాగడం వల్ల కవల పిల్లలు పుడుతున్నారా? వైద్యులు నీటి గురించి ఏం చెప్తున్నారు? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..
తూర్పు గోదావరి జిల్లాలో కవల పిల్లల బావి
ఏపీలోని తూర్పు గోదావరి జిల్లా రంగంపేట మండలంలో దొడ్డిగుంట గ్రామం ఉంది. ఈ ఊరిలో సుమారు 4,500 జనాభా ఉంది. ఈ ఊరి చివరలో ఓ ఊట బావి ఉంది. ఈ గ్రామ ప్రజలు ఇప్పటికీ ఆ ఊట బావి నీళ్లనే తాగుతుంటారు. ఈ బావిలో నీళ్లు తాగిన వారందరికీ కవల పిల్లలు పుడతారనే ప్రచారం జరగడంతో పిల్లలు లేని వాళ్లు ఎంతో మంది ఇక్కడికి వచ్చి నీళ్లు తీసుకెళ్తున్నారు. నిజానికి ఈ ఊరిలో 110 మంది కలవలలు ఉన్నారు. ఇక్కడ కవల పిల్లలు పుట్టడానికి కారణం ఈ ఊట బావిలో నీళ్లు తాగడమేనని చాలా మంది నమ్ముతారు. ఈ ఊరిలో ఏడాది వయసున్న చిన్నారుల నుంచి 65 ఏండ్ల వృద్ధుల వరకు కవలలు ఉన్నారు.
కలల పిల్లల బావి ఎలా వెలుగులోకి వచ్చింది?
మూడు దశాబ్దాల క్రితం ఈ ఊరిలో ప్రాథమిక పాఠశాల ఏర్పాటు అయ్యింది. ఇందులో పాఠాలు చెప్పేందుకు ఓ ఉపాధ్యాయుడు వచ్చారు. ఆయనే ఈ ఊళ్లో ఎక్కువ మంది కవల పిల్లలు ఉన్నారనే విషయాన్ని గుర్తించారు. అప్పటి వరకు ఈ ఊరి వాళ్లు ఈ విషయాన్ని పెద్దగా పట్టించుకోలేదు. జనాభా లెక్కల కోసం ఆయన ఇంటింటికీ తిరుగుతుండగా ఈ విషయాన్ని గుర్తించారు. అంతేకాదు, ఈ మాస్టారు దంపతులకు కూడా చాలా కాలం పిల్లలు పుట్టలేదు. ఆయన ఈ ఊళ్లోనే ఉంటూ ఆ ఊట బావి నీళ్లు తాగడంతో ఆయన భార్య కూడా కవలలకు జన్మనిచ్చింది. అప్పటి నుంచి ఈ ఊరి ఊట బావిలో నీళ్లు తాగితే కవల పిల్లలు పుడతారనే ప్రచారం బలంగా జరిగింది.
నీళ్ల కోసం ఇతర ప్రాంతాల నుంచి వస్తున్న ప్రజలు
ఈ బావిలో నీళ్లు తాగితే కవలలు పుడతారని తెలియడంతో ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల నుంచి ఇక్కడికి ప్రజలు వస్తున్నారు. హైదరాబాద్ నుంచి కూడా ఇక్కడికి వచ్చి క్యాన్లలో నీళ్లను నింపుకుని వెళ్తున్నారు. పిల్లలు లేని వాళ్లు పిల్లలు పుడతారానే ఆశతో ఇక్కడికి వస్తున్నారు.
నిపుణులు ఏం చెప్తున్నారంటే?
ఈ ఊట బావి నీళ్లు తాగితే పిల్లలు పుడతారనే ప్రచారంపై వైద్య నిపుణులు స్పందించారు. నీళ్ల ద్వారా పిల్లలు పుడతారనేది శాస్త్రీయంగా నిజం కాదంటున్నారు. కానీ, ఆ నీళ్లలో ఆరోగ్యాన్ని కలిగించే మినరల్స్ ఉన్న మాట వాస్తవం అంటున్నారు. కాల్షియం కార్భోనేట్, ఐరన్, కాల్షియం లాంటి లవణాలు నిర్ణీత మోతాదులో ఉన్నాయంటున్నారు.
Read Also: కోపంతో ఊగిపోతున్నారా? రెండు నిమిషాల్లో మీ శరీరంలో ఏర్పడే ప్రమాదకర చర్యలివే!