BigTV English

Viral News: ఆగ్రహంతో ఊగిపోయారు.. ఆ తర్వాత చెఫ్‌ను ఉతికేసిన ఎమ్మెల్యే, కారణమేంటి?

Viral News: ఆగ్రహంతో ఊగిపోయారు.. ఆ తర్వాత  చెఫ్‌ను ఉతికేసిన ఎమ్మెల్యే, కారణమేంటి?

Viral News:  దేనికైనా ఒక హద్దు ఉంటుంది. అది దాటితే కోపం తన్నుకొస్తుంది. ఆ ఎమ్మెల్యే విషయంలో అదే జరిగింది. ఏకంగా హోటల్ చెఫ్‌ని ఉతికేశాడు. ఈ తతంగాన్ని ఓ వ్యక్తి వీడియో తీసి సోషల్‌మీడియాలో పెట్టాడు. దీనిపై మహారాష్ట్ర విపక్ష నేతలు తమదైనశైలిలో రియాక్ట్ అయ్యారు.


శివసేన ఎమ్మెల్యే సంజయ్ గైక్వాడ్ మరోసారి వివాదానికి కేంద్రబిందువుగా మారారు. ఆహారం సరిగా లేదని చెఫ్‌‌ను చితగ్గొట్టారు. ఈ ఘటన ముంబై సిటీలో వెలుగుచూసింది.  బుల్దానాకు చెందిన షిండే (డిప్యూటీ సీఎం) వర్గానికి చెందిన శివసేన ఎమ్మెల్యే సంజయ్ గైక్వాడ్ ఆకాశవాణి ఎమ్మెల్యే రెసిడెన్స్‌లో ఉంటున్నారు. అక్కడి క్యాంటీన్‌లో భోజనానికి ఆయన వెళ్లారు.

చపాతీతో పాటు రైస్, పప్పు కావాలని ఆర్డర్ చేశారు ఎమ్మెల్యే. పప్పు నుంచి లైటుగా దుర్వాసన రావడం మొదలైంది. దీంతో ఆయన తట్టుకోలేక పోయారు. వెంటనే క్యాంటీన్‌లోకి వెళ్లిన ఎమ్మెల్యే సంజయ్ గైక్వాడ్, ఈ పప్పు ఎవరు వండారంటూ అక్కడి స్టాఫ్‌ను నిలదీశారు. చేతిలో పప్పు ప్యాకెట్ పట్టుకున్న సదరు ఎమ్మెల్యే వాసన చూడాలంటూ స్టాఫ్‌‌కి చూపించాడు.


ఆ తర్వాత కోపం తారాస్థాయికి చేరడంతో వారిపై సీరియస్ అయ్యారు. కొంత తినేసరికి నొప్పి మొదలై వికారంగా ఉందన్నారు. ఎమ్మెల్యేకు ఇలాగే వడ్డిస్తారా? తనకే ఇలాంటి వంట పెడితే మిగతావారి పరిస్థితి ఏంటంటూ ఆగ్రహంతో ఊగిపోయారు. వెంటనే క్యాంటీన్ ఆపరేటర్ రావడంతో కోపం పట్టలేక అతడిపై దాడికి దిగారు ఎమ్మెల్యే.

ALSO READ: భార్యకు ఖరీదైన గిఫ్ట్ ఇచ్చిన లాయర్, ఓపెన్ చేయగానే పోలీసులు వచ్చి

చెంపదెబ్బ కొట్టిన సంజయ్ గైక్వాడ్, ఆ తర్వాత అతడి ముఖం మీద పంచ్‌లు విసిరారు. దీంతో క్యాంటీన్ ఆపరేటర్ కింద పడిపోయాడు. మహారాష్ట్ర శాసనసభ వర్షాకాల సమావేశాలు జరుగుతున్న సమయంలో మంగళవారం రాత్రి ఈ సంఘటన జరిగింది. ఏదో విషయంలో గతేడాది రాహుల్ గాంధీ నాలుక కోసిన వారికి 11 లక్షల రూపాయల బహుమతి ఇస్తానని ప్రకటన చేశారు సంజయ్ గైక్వాడ్.

ఇప్పుడు క్యాంటీన్ వ్యక్తిని కొట్టి వార్తల్లోకి వచ్చేశారు. వైరల్ అవుతున్న ఈ వీడియో ఎంపీ ప్రియాంక చతుర్వేది షేర్ చేశారు. తన చర్యలను సమర్థించుకున్న ఎమ్మెల్యే సంజయ్, ఆహారం నాణ్యత తక్కువగా ఉందని తాను ఫిర్యాదు చేశానన్నారు. ఆహారం సరిగా లేదని, ఈ అంశాన్ని సభలో లేవనెత్తుతానని అన్నారు.

అంతకుముందు గత ఫిబ్రవరిలో శివ జయంతి వేడుకల సందర్భంగా మహిళలను బెదిరించారని ఆరోపిస్తూ వ్యక్తుల గుంపు సమూహాన్ని కొట్టడానికి ఆయన పోలీసు లాఠీని ఉపయోగించిన విషయం తెల్సిందే.

 

Related News

Gurgaon man: మోడల్ ను చూసి ఆపుకోలేక.. రోడ్డు మీదే ఆ పాడు పని.. మరీ ఇలా తయారయ్యారేంట్రా?

Liquor party: కోడలు మందు పార్టీ.. మామ రివేంజ్.. పోలీసుల ఎంట్రీ!

Beggar Viral News: ఆ బిచ్చగాడికి ఇద్దరు భార్యలు.. కలెక్టర్ కు.. వింత రిక్వెస్ట్, నవ్వకండి సీరియస్ మేటర్!

Gujarat Bridge: భలే ఐడియా.. గుజరాత్ వంతెనపై చిక్కుకున్న లారీ.. ఎయిర్ బెలూన్స్‌ తో ఇలా సేవ్ చేశారు!

Rules In Village: ఇదేం దిక్కుమాలిన నియమాలు.. వ్యక్తిని తాకితే రూ.5000 జరిమానా! ఎక్కడో తెలుసా?

Street Food: నూనె ప్యాకెట్ కట్ చేయకుండా నేరుగా.. ఇక్కడ బజ్జీలు తింటే పాడెక్కడం ఖాయం!

Big Stories

×