Man Stuck In Wine Shop: మందు బాబుబు వేసే వేషాల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది. కడుపులో చుక్క పడిందా? ఒకడు.. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కాదు, తానే అంటాడు. మరొకడు మోడీని ప్రధానిని చేసింది నేనే అంటూ గప్పాలు కొడతాడు. ఇంకొక్కడు పీకల దాకా తాగి వైన్ షాప్ ముందున్న మురికి మోరిలో తిరిగి పడుతాడు. తాగిన మైకంలో బైక్ ఎక్కిన మందుబాబులు ఎలాంటి విన్యాసాలు చేస్తారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇవన్నీ మందు తాగిన తర్వాత ముచ్చట్లు. కానీ, ఓ వ్యక్తి మందు కొనేందుకు వెళ్లి చేసిన పని చూస్తే అందరూ షాకవ్వాల్సిందే. ఇంకా చెప్పాలంటే పడీ పడీ నవ్వాల్సిందే!
మందు కొనేందుకు వెళ్లి చువ్వల్లో ఇరుక్కున్న వ్యక్తి
సాధారణంగా మందు తాగిన తర్వాత చాలా మందికి ఏం చేస్తున్నారో అర్థం కాదు. అన్నీ తింగరి పనులు చేస్తారు. కానీ, ఓ వ్యక్తి మందు కొనేందుకు వెళ్లి అనుకోని చిక్కుల్లో పడిపోయాడు. మందు త్వరగా కొని తాగాలనే ఉద్దేశంతో హడావిడి చేశాడు. కడుపులో ఎప్పుడు ఇంత పోయాలా? అనే ఆత్రంలో వేగంగా వెళ్లి తల చువ్వల లోపలికి పెట్టేశాడు. మెడ వరకు వెళ్లి ఆగింది. వైన్ షాప్ లో ఉన్న వాళ్లు డబ్బులు తీసుకుని అతడికి కావాల్సిన మందు బుడ్డీ ఇచ్చారు. బయటకు వద్దామనే సమయంలోనే అసలు కథ మొదలయ్యింది.
Read Also: ఇలాంటి భార్య మీకు కావాలా? ఆ సర్ ప్రైజ్ లు భరించలేక పారిపోతారేమో!
తల గ్రిల్ లో ఇరుక్కుని బయటకు రావడం లేదు. ఒక్కసారి సదరు మందుబాబు షాకయ్యాడు. ఎటు గించుకున్నా తల బయటకు రావడం లేదు. ఇది గమనించిన తోటి కస్టమర్లు అటువైపు, ఇటువైపు చువ్వలను పట్టుకుని వెడల్పుగా లాగే ప్రయత్నం చేశారు. కొద్ది సేపు కష్టపడిన తర్వాత అతడి తల నెమ్మదిగా బయటకు వచ్చింది. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ తతంగాన్ని మొత్తం వైన్ షాప్ యజమాని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది.
India's not for beginners 💀😂 pic.twitter.com/qqR86Sk2yY
— Yash Tiwari (@DrYashTiwari) July 8, 2025
నెటిజన్లు ఏం అంటున్నారంటే?
ఈ వీడియోను చూసి నెటిజన్లు ఫుల్ ఫన్నీగా రియాక్ట్ అవుతున్నారు. తల ఇరుక్కుపోయినా, చేతిలో సీసా మాత్రం వదలట్లేడు కాకా అంటూ కామెంట్స్ పెడుతున్నారు. మందు తాగాలనే ఆత్రంలో మనిషి మర్చిపోయి గ్రిల్ లోకి వెళ్లిపోయాడు అని మరికొంత మంది రియాక్ట్ అయ్యారు. నిజానికి ఈ వీడియోను చూసి చాలా మంది కచ్చితంగా గ్రిల్ కట్టర్ తో కట్ చేయాలి అనుకున్నారు. కానీ, ఈజీగానే బయటపడ్డాడు అని మరికొంత మంది రాసుకొచ్చారు. మొత్తంగా ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట హల్ చల్ చేస్తుంది. నెటిజన్లకు మంచి వినోదాన్ని పంచుతుంది.
Read Also: ఈ వైరల్ ఫొటోలో ఉన్న పిల్లాడు.. ఇప్పుడు ఎలా ఉన్నాడో తెలుసా? చూస్తే షాకవుతారు!