Viral video: తాగిన మైకంలో మందుబాబులు ఏం చేస్తున్నారో.. వాళ్లకే తెలియడం లేదు. పీకల దాకా తాగాక.. నానా హంగామా సృష్టిస్తున్నారు. పక్కన పోయే జనాలను ఇబ్బందులకు గురిచేస్తున్నారు. కొందరు తప్పతాగాక.. ప్రాణాలను సైతం లెక్కచేయడం లేదు.
తాజాగా ఇవాళ హైదరాబాద్ లంగర్ హౌస్ పీఎస్ పరిధిలో ఓ తాగుబోతు చేసిన పనికి అందరూ షాక్ అయ్యారు. మద్యం మత్తులో ఉన్న ఆ వ్యక్తం పీవీ నర్సింహా రావు ఎక్స్ ప్రెస్ హైవే నుంచి కిందకు దూకేశాడు. పిల్లర్ నం.100 పై నుంచి తాగినమత్తులో మందుబాబు కిందకు జంప్ చేయగా.. అయితే అదృష్టం కొద్ది అక్కడ మధ్యలో వైరు తట్టుకోవడంతో కాసేపు అక్కడ వేలాడుతూ ఉండిపోయాడు. కాసేపు వైరును పట్టుకుని హంగామా సృష్టించాడు.
ఇదిగో వీడియో..
A Drunk man narrowly escaped death after falling from the PVNR Expressway at Attapur @TheSiasatDaily #Hyderabad pic.twitter.com/ruiDXkRe3v
— Mohammed Baleegh (@MohammedBaleeg2) April 21, 2025
Also Read: CSIR-NAL Recruitment: సువర్ణవకాశం.. ఇంటర్ అర్హతతో ఉద్యోగాలు.. జీతం అక్షరాల రూ.81,000
వైరును పట్టుకొని వేలాడుతున్న తాగుబోతును చూసి ప్రయాణికులు, అక్కడ స్థానికులు గుమిగూడారు. ఆ వ్యక్తం కాపాడేందుకు ప్రయత్నించారు. చివరకు కారులో నుంచి ఓ కవర్ ను తీసుకుని నలువైపులా తెరిచి పట్టుకున్నారు. బాధిత వ్యక్తి ఆ కవర్ పై పడడంతో ప్రాణాలతో బయట పడ్డాడు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తాగుబోతును పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ వ్యక్తి ఎందుకు ప్లై ఓవర్ నుంచి దూకేందుకు ప్రయత్నించాడు..? అనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు.
Also Read: UCSL Recruitment: ఐటీఐ, డీగ్రీ అర్హతలతో ఉద్యోగాలు.. ప్రారంభ వేతనం రూ. 40,650.. ఇంకెందుకు ఆలస్యం