కొన్ని కేసుల విషయంలో న్యాయస్థానాలు ఇచ్చే తీర్పులను చూస్తే ఆసక్తికరంగా, ఆశ్చర్యకరంగా ఉంటాయి. తరచుగా ఇలాంటి కేసుల గురించి వింటూనే ఉంటాం. అలాంటి కొన్ని కేసు గురించి ఇప్పుడు తెలుసుకుందాం.. ఓ వ్యక్తి స్కూల్లో దొంగతనానికి వెళ్లాడు. దొంగతనం చేసే క్రమంలో బిల్డింగ్ మీది నుంచి జారిపడి తీవ్రంగా గాయపడ్డాడు. సదరు దొంగ కోర్టులో స్కూల్ మీద కేసు వేశాడు. న్యాయస్థానం అతడికి అనుకూలంగా తీర్పు ఇచ్చింది. స్కూల్ యాజమాన్యం అతడికి పరిహారం చెల్లించాలని ఆదేశించింది. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఈ ఘటన నిజంగా జరిగింది. ఇదొక్కటే కాదు, ఇలాంటి కేసులు పలు దేశాల్లో నమోదయ్యాయి.
దొంగలు దావా వేసిన కేసులు
⦿ కాలిఫోర్నియా స్కూల్ కేసు (1982)
1982లో రిక్ బోడిన్ అనే 18 ఏళ్ల రిక్ అనే యువకుడు కాలిఫోర్నియాలోని ఓ స్కూల్లోకి చొరబడి సీలింగ్ కు ఉన్న కొన్ని లైట్లను దొంగిలించాడు. భవనం పైకి ఎక్కే క్రమంలో చేసిన మిస్టేక్ వల్ల జారి సుమారు 27 అడుగుల కింద పడ్డాడు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డాడు. పెయింట్ చేయబడిన స్కై లైట్ కారణంగానే తాను కిందపడిపోయినట్లు కోర్టుకు వెళ్లాడు. స్కూల్ యాజమాన్యం స్కైలైట్ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిందని వాదించాడు. అమెరికాలో మరో స్కూల్ లో స్కైలైట్ నుంచి పడి అప్పటికే వ్యక్తి మరణించిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. కోర్టు బాధితుడి వాదనను సమర్థిస్తూ రిక్ కు స్కూల్ యాజమాన్యం ప్రతి నెలా లక్షన్నర జీతం చెల్లించాలని ఆదేశించింది.
⦿ UK స్కూల్ కేసు (2010)
2010లో, థామస్ బకెట్ అనే 16 ఏళ్ల వ్యక్తి తన స్నేహితులతో కలిసి UKలోని ఒక పాఠశాలలోకి దొంగతనానికి వెళ్లాడు. వారంతా స్కూల్ పైకప్పుపైకి ఎక్కారు. థామస్ స్కై లైట్ మీది నుంచి నడుస్తూ జారి పడ్డాడు. అతడి తలకు తీవ్ర గాయాలు అయ్యాయి. డాక్టర్లు అతడిని కాపాడేందుకు పలు ఆపరేషన్లు చేయాల్సి వచ్చింది. ఫుట్ బాల్ తీసుకోవడానికి స్కూల్ కు వెళ్లాడని కుటుంబ సభ్యులు చెప్పినా, స్కూల్ యాజమాన్యం మాత్రం స్నాక్స్ దొంగిలించడానికి వచ్చాడని ఆధారాలు చూపించారు. కానీ, బాధితుడు స్కూల్ మీద వేసిన దావాపై కోర్టు కీలక తీర్పు వెల్లడించింది. పాఠశాల యాజమాన్యం స్కైలైట్ విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోలేదని అభిప్రాయపడింది. బాధితుడికి స్కూల్ మేనేజ్ మెంట్ £150,000(రూ.1,77,05,175) చెల్లించాలని ఆదేశించింది.
Read Also: వీధి కుక్కలే పెళ్లి అతిథులు, నెట్టింట వీడియో వైరల్!
దొంగలు దావా వేయవచ్చా?
నిజానికి దొంగతనానికి వెళ్ల గాయపడి దావా వేయడం అనేది అన్యాయంగా అనిపించవచ్చు, కానీ, పాఠశాలల యజమాన్యాలు తమ భవనాలను సురక్షితంగా ఉంచుకోవాలంటున్నాయి న్యాయస్థానాలు. కోర్టులు కొన్నిసార్లు దొంగ చర్యలపైనే కాకుండా యజమాని నిర్లక్ష్యంగా ఉన్నాడా? లేదా? అనే దానిపై దృష్టి పెట్టి తీర్పులు ఇస్తున్నాయి.
Read Also: ఓరి నీ దుంపతెగా.. పాముకే నాగిని డ్యాన్స్ నేర్పిస్తున్నావు కదరా!