Viral Video: ప్రజలు బెంబేలెత్తిస్తోంది అకస్మాత్తుగా వచ్చే గుండెపోటు. ఎవరు.. ఎప్పుడు.. ఎక్కడ చనిపోతున్నారో తెలియని పరిస్థితులు నెలకున్నాయి. దీనికి కారణాలు అనేకం కావచ్చు. తాజాగా ట్రావెలింగ్‌లో ఉన్న ఓ అడ్వకేట్, ఓ ప్రాంతంలో నిలబడ్డాడు. వెంటనే గుండెపోటు వచ్చింది. రెండు అడుగులు ముందుకేసి కుప్పకూలిపోయాడు. ఆసుపత్రికి తీసుకెళ్లేలోపు మృతి చెందాడు.
ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో ఆకస్మిక గుండెపోటు కేసు వెలుగులోకి వచ్చింది. 25 ఏళ్ల న్యాయవాది అభిషేక్ కేవాల్ అలియాస్ పవన్ సింగ్ సరోజినీనగర్ ప్రాంతంలోని తహసీల్ కార్యాలయంలో ఉండగా ఆకస్మిక గుండెపోటు వచ్చింది. క్షణాల్లో ఆయన మృతి చెందారు. అభిషేక్ సింగ్.. తోటి న్యాయవాదులతో కలిసి నడుచుకుంటూ వెళ్లాడు.
కాసేపు ఆఫీసు సమీపంలో నిలబడి కొన్ని క్షణాలు సెల్‌ఫోన్ చూశాడు. అకస్మాత్తుగా ఒక గేటు వైపు కదిలి జోగుతూ నేలపై కుప్పకూలిపోయాడు. చుట్టుపక్కల వారు చూసేలోపు అతడు చనిపోయాడు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీ కెమెరాలో రికార్డైంది. దానికి సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో వైరల్ అవుతోంది.
అడ్వకేట్ అభిషేక్ సింగ్ కాన్పూర్ రోడ్డులోని హనుమాన్ ఆలయం సమీపంలో ఉంటున్నాడు. లక్నో తహసీల్‌లో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తున్నాడు. ప్రతి రోజు మాదిరిగా సోమవారం తహసీల్‌కు చేరుకున్నాడు అభిషేక్. తన తోటి న్యాయవాదులతో కలిసి తహసీల్ ప్రాంగణం నుండి బయలుదేరాడు. వెళ్లే దారిలో కాసేపు ఆగాడు.
ALSO READ: జెర్రిపోతును మింగిన నాగుపాము.. స్నేక్ ఫైటింగ్ వీడియో వైరల్
అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో అక్కడికక్కడే పడిపోయాడు. తోటి న్యాయవాదులు అతన్ని ఆసుపత్రికి తీసుకెళ్లారు. అప్పటికే చనిపోయినట్టు వైద్యులు తెలిపారు. అభిషేక్ మరణం అతడి కుటుంబానికి తీరని దుఃఖాన్ని మిగిల్చింది. అభిషేక్ మృతి వార్త తెలియగానే పేరెంట్స్ వచ్చారు. ఎదిగిన కొడుకుని చూసి కన్నీరు మున్నీరు అయ్యారు.
ఈ మధ్యకాలంలో గుండెపోటు బారినపడి చాలామంది ఈలోకాన్ని విడిచిపెడుతున్నారు. చిన్నారుల నుంచి పెద్దల వరకు దీనిబారిన పడి చనిపోతున్నారు.. పోయారు కూడా. ఆటలు ఆడుతున్నప్పుడు, జిమ్‌లో ఉన్నప్పుడు గుండెపోటు రావడం ఇటీవల కాలంలో మరింత ఎక్కువైంది.
నిలబడి ఉండగానే అకస్మాత్తుగా చనిపోయాడు!
ఉత్తరప్రదేశ్-లక్నోలో చోటు చేసుకున్న ఘటన
25 ఏళ్ల న్యాయవాది అభిషేక్ సింగ్ నిలబడి ఉండగానే అకస్మాత్తుగా కుప్పకూలి చనిపోయిన వైనం
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సీసీటీవీ ఫుటేజ్ pic.twitter.com/pbkqMsjkiB
— BIG TV Breaking News (@bigtvtelugu) June 11, 2025