Karnataka Pakistan Zindabad| గత అదివారం కర్ణాటకలోని మంగళూరు నగరంలో ఓ షాకింగ్ ఘటన జరిగింది. ఒక క్రికెట్ అభిమాని పాకిస్తాన్ జిందాబాద్ అని కేకలు వేయడంతో అతడిపై కొంతమంది యువకులు దాడి చేశారు. ఆ దాడిలో తీవ్రంగా గాయపడిన ఆ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. దాడి చేసిన వారిలో పోలీసులు ఇప్పటివరకు 10 మందిని అరెస్ట్ చేశారు.
కర్ణాలక హోం మంత్రి జి పరమేశ్వర ఈ ఘటన గురించి ధృవీకరించారు. అయితే దాడికి గురైన బాధితుడు వెంటనే చనిపోలేదని.. దాడి జరిగిన కాసేపటికే మరణించారడని హోం మంత్రి పరమేశ్వర వెల్లడించారు. ఈ ఘటనపై విచారణ పూర్తి చేసి పూర్తి నివేదిక బహిర్గతం చేస్తామని అన్నారు. ఈ కేసులో ఇప్పటివరకు పది అరెస్ట్ చేయడం జరిగిందని ఆయన తెలిపారు.
“మంగళూరు ఒక మూక దాడి జరిగింది. ఒక గుర్తు తెలియని వ్యక్తిని కొందరు సామూహికంగా వెళ్లి చితకబాదారని పోలీసుల ద్వారా తెలిసింది. ఒక లోకల్ క్రికెట్ మ్యాచ్ చూడడానికి వెళ్లిన ఓ అభిమాని పాకిస్తాన్ జిందాబాద్ అంటూ నినాదాలు చేశాడు. దీంతో అక్కడున్న కొందరు అతడిని చితకబాదారు. అతను ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డాడు. ఆ తరువాత కాసేపటికే మృతి చెందాడు. పూర్తి నివేదిక ఇంకా రావాల్సి ఉంది. ఇప్పటివరకు కనీసం 10 మందిని అరెస్టు చేయడం జరిగింది. విచారణ ఇంకా కొనసాగుతోంది.” అని మంత్రి పరమేశ్వర అన్నారు.
వివరాల్లోకి వెళితే.. ఆదివారం మంగళూరులో ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు మంగళూరు నగరం పరిసరాల్లోని కుడుపు గ్రామం భట్రా కల్లూర్తి దేవాలయం ఒక లోకల్ క్రికెట్ టోర్నమెంట్ లో భాగంగా ఒక మ్యాచ్ జరిగింది. ఇక్కడ ఒక టోర్నమెంట్ జరిగింది. మొత్తం 10 జట్లు, 100 ఆటగాళ్లు ఈ టోర్నమెంట్ లో పాల్గొన్నారు.
క్రికెట్ చూడడానికి వచ్చిన ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం.. మృతుడు, సచిన్ అనే మరో యువకుడు మధ్య వాగ్వాదం జరిగింది. ఆ తరువాత ఇద్దరి మధ్య గొడవ తీవ్రమైంది. ఇంతలోనే సచిన్ తరపున వచ్చిన మరి కొందరు కర్రలతో మృతుడిపై దాడి చేశారు. కింద పడేసి తన్నారు. అక్కడ ఉన్న కొందరు ఆపడానికి ప్రయత్నించినా దాడి చేసిన గుంపులో ఎవరూ ఆగలేదు. సాయంత్రం 5.30 గంటలకు ఆ యువకుడి మృతదేహం దేవాలయం సమీపంలో లభించింది.
Also Read: ఇండియా పాక్ ఉద్రిక్తత .. వివాహాలు రద్దు.. కుటుంబాలు విలవిల
పోలీసులు శవాన్ని పోస్ట్ మార్టం కోసం తరలించారు. పోస్ట్ మార్టం రిపోర్ట్ ప్రకారం.. తీవ్ర గాయాల వల్ల, సమయానికి చికిత్స లభించని కారణంగా అతను చనిపోయాడు. పోలీసులు లోతుగా విచారణ చేసేసరికి.. క్రికెట్ మ్యాచ్ లో మూక దాడి జరిగిన ఘటన వెలుగులోకి వచ్చింది. చనిపోయిన వ్యక్తి కీలక అవయాలు, ప్రైవేట్ పార్ట్స్ పై కర్రలతో దాడి చేశారు. కుడుపు గ్రామానికి చెందిన సచిన్ అనే యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు
సిసిటివి వీడియో ఆధారంగా మొత్తం 19 మంది మూక దాడి చేసినట్లు పోలీసులు గుర్తించారు. నిందితులకు చట్టప్రకారం.. జీవిత ఖైదు పడే అవకాశం ఉన్నట్లు పోలీసులు తెలిపారు.