Auto Rickshaw Viral Video: మనం ఏ పని చేస్తున్నాం అనేది ముఖ్యం కాదు. ఎంత చక్కగా చేస్తున్నాం అనేదే ముఖ్యం. అచ్చంగా ఇలాగే ఆలోచించాడు ఓ ఆటోవాలా. తన ఆటోలో ప్రయాణించే వారు ఎలాంటి విసుగు చెందకూడదనుకున్నాడు. అందుకే, లగ్జరీ ఏర్పాట్లు చేశాడు. ఫ్రీ వైఫై మొదలుకొని, టీవీ, మ్యాగజైన్ల వరకు అన్ని ఏర్పాట్లు చేశాడు. ఈ సెటప్ చూస్తే, ఒక్కసారైనా ఆటో ఎక్కాలని భావిస్తారు.
వైఫై నుంచి.. వాటర్ గ్లాస్ వరకు
ఆటోలోకి ఎక్కగానే మొదట ఫ్రీ వైఫై కనిపిస్తుంది. యూజర్ నేమ్ తో పాటు పాస్ వర్డ్ రాసిపెట్టి ఉంచాడు. అంటే, ప్రయాణీకులు ఆటో ఎక్కినప్పటి నుంచి దిగేంత వరకు ఫ్రీగా నెట్ ఉపయోగించుకోవచ్చు. ఒక డ్రైవర్ తల మీద టీవీ ఏర్పాటు చేశాడు. వెనుక వైపు ఇద్దరు ప్యాసింజర్లు ఉపయోగించుకునేలా ట్యాబ్లెట్లు ఏర్పాటు చేశారు. పక్క వైపును కూడా మరో రెండు ట్యాబ్లెట్లు ఉంచాడు. అన్నింటికీ నెట్ సౌకర్యం కూడా ఉంటుంది. ఇక ఆటో లోపల ఎడమవైపు పలు రకాల మ్యాగజైన్లు ఉంచాడు. స్పోర్ట్స్ మ్యాగజైన్ నుంచి సైన్స్ మ్యాగజైన్ వరకు ఉంటాయి. ఎవరికి నచ్చిన మ్యాగజైన్ వారు చదువుకోవచ్చు. ఎవరైనా ఏమైనా రాసుకోవాలి అనుకుంటే, ప్యాడ్, పెన్ను, పేపర్ లు కూడా అందుబాటులో ఉంచాడు. మరోవైపు వాటర్, కూల్ డ్రింక్స్ తాగాలి అనుకునే వాళ్ల కోసం పేపర్ తో తయారు చేసిన గ్లాసులు కూడా అందుబాటులో ఉంచాడు. మొత్తంగా తన ఆటోను చాలా లగ్జరీగా తయారు చేశాడు. ఒక్కసారి ఈ ఆటోలోకి ఎక్కితే మళ్లీ మళ్లీ ఎక్కాలి అనిపించేలా ఉంటుంది.
Read Also: సమ్మర్ లో ఫారిన్ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? తక్కువ ఖర్చులో వెళ్లొచ్చే దేశం ఇదే!
సోషల్ మీడియాలో వైరల్
ఇక ఈ ఆటోవాలా వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నెటిజన్లు ఆయన క్రియేటివిటీకి హ్యాట్సాఫ్ చెప్తున్నారు. ప్రయాణీకుల కోసం ఇంతలా ఆలోచించడం అంటే నిజంగా గ్రేట్ అంటున్నారు. “అడ్రస్ పెట్టండి ఒక రోజంతా బుక్ చేసుకుంటాను” అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. “ఇది ఆటో రిక్షా కాదు. నడిచే లైబ్రరీ” అని మరో నెటిజన్ కామెంట్ చేశాడు. “ఇది తమిళనాడుకు చెందిన ఆటోరిక్షా” అని మరో వ్యక్తి చెప్పాడు. “ఇది ఆటో కాదు, లగ్జరీ ఆటో” అని మరో వ్యక్తి రాసుకొచ్చాడు. “ఇలాంటి సౌకర్యాలు మా సొంత ఇంట్లో కూడా లేవు. నిజంగా ఈ ఆటోవాలా గ్రేట్” అని ఇంకో వ్యక్తి కామెంట్ పెట్టాడు. “నాకు ఫ్రీ వైఫై కావాలంటే ఈ ఆటో వెనుక వెళ్తే సరిపోతుంది” అని మరో వ్యక్తి ఫన్నీగా కామెంట్ చేశాడు. మొత్తంగా ఈ ఆటో వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఆటో డ్రైవర్ ఆలోచనను అందరినీ మెచ్చుకుంటున్నారు. ప్రయాణీకులకు చక్కటి ప్రయాణ అనుభవాన్ని అందించేందుకు అతడు చేసిన క్రియేటివ్ ఆలోచన అద్భుతం అంటున్నారు.
Read Also: మీ కళ్ల జోడు కారును పేల్చేస్తుంది.. ఈ 5 వస్తువులు అస్సలు ఉంచకండి!