Viral Video : కొందరికి తొందరపాటు ఎక్కువ. ఏదో కొంపలు మునిగిపోయినట్టు రోడ్డు దాటుతుంటారు చాలామంది. ఎదురుగా వచ్చే వాహనాలను పట్టించుకోరు. హీరోల్లా ఫోజులు కొడుతూ కార్లకు అడ్డంగా రోడ్డు దాటుతుంటారు. సిగ్నల్ పడిందా లేదా అని కూడా చూసుకోరు. మా రోడ్డు మా ఇష్టం.. మేం ఇలానే దాటుతాం అనేలా ప్రవర్తిస్తుంటారు. స్పీడ్‌గా వచ్చే బండి వాడే బ్రేకులు వేసి ఆగాలి కానీ.. వాళ్లు మాత్రం తమ కాళ్లకు బ్రేకులు వేయరు. అదో గొప్ప అన్నట్టు బిల్డప్ కూడా ఇస్తుంటారు. కార్లు నడిపే వాళ్లు సైతం ఓవరాక్షన్ చేస్తుంటారు. సిగ్నల్స్ చూసుకోరు. జీబ్రా లైన్స్ పట్టించుకోరు. రోడ్డు దాటుతున్న వాళ్లను చూసి కూడా బండి స్లో చేయరు. బ్రేకులేస్తే వాళ్ల సొమ్మేమైనా పోయినట్టు చేస్తుంటారు.
అయితే, ఇలాంటి సాహసాలు అన్నివేళలా వర్కవుట్ కావు. గుద్దితే.. ఎగిరి పడాల్సిందే. కాళ్లు చేతులు విరగాల్సిందే. టైమ్ బాగా లేకపోతే.. ప్రాణం పోయినా పోతుంది. ఇలాంటి ఘటలను అనేకం చూస్తుంటాం. మరికొందరు మాత్రం జస్ట్ మిస్ అవుతుంటారు. యముడు ఇలా టచ్ చేసి, హలో చెప్పేసి.. అలా వెళ్లిపోతుంటాడు. అలాంటి వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. లేటెస్ట్‌గా ముంబైలో జరిగిన ఓ సీన్ ఇలానే వైరల్ అవుతోంది.
ఒక్క సెకన్‌లో.. కారు గుద్దేసి..
రోడ్డు మీద కార్లు రయ్ మంటూ దూసుకొస్తున్నాయి. ఒకచోట రైట్ టర్న్ ఉంది. కొన్ని వాహనాలు స్ట్రైట్‌గా దూసుకుపోతున్నాయి. మరికొన్ని కుడి వైపుకు వెళుతున్నాయి. సరిగ్గా అదే చోట పాదచారులు రోడ్డు దాటేందుకు జీబ్రా లైన్స్ కూడా ఉన్నాయి. ఇదీ అక్కడి పరిస్థితి. అలాంటి చోట ఓ యువకుడు జీబ్రా లైన్స్ మీదుగా రోడ్డు క్రాస్ చేస్తున్నాడు. అతన్ని చూసి మొదటి వరుసలో ఉన్న కారు అతను స్లో చేశాడు. ఆ రోడ్డు దాటే వ్యక్తి ఫస్ట్ కారును దాటేసి ఇంకోవైపు వేగంగా వెళ్లాలని అనుకున్నాడు. కానీ… అతను రోడ్ క్రాస్ చేసే లోగా.. సెకండ్ లైన్ నుంచి మరో కారు వేగంగా దూసుకొచ్చింది. ఆ కారు డ్రైవర్ ఆ యువకుడిని చూడలేదు. ఇతనూ ఆ కారును గమనించలేదు. రోడ్డు దాటుతున్న వ్యక్తిపైకి కారు అదే వేగంతో వచ్చేసింది. మనోడు ఒక్క జంప్‌లో కారు మీద చేయేసి.. అదే స్పీడ్‌తో వెనక్కి పడిపోయాడు. స్పైడర్ మేన్‌లా మెరుపు వేగంతో స్పందించాడు. ఒక్క క్షణంలో బతికిపోయాడు. కారు అంతే వేగంతో ఆగకుండా దూసుకెళ్లిపోయింది. ఆ యువకుడి అదృష్టం బాగుంది. చిన్న దెబ్బ కూడా తగలకుండా బయటపడ్డాడు. లేదంటే, ఆ ఒక్క సెకన్‌లో కారు కింద పడి నలిగిపోయేవాడు.
వెనకాలే వస్తున్న కారులో ఉన్న కెమెరా ఆ అడ్వెంచర్‌ను రికార్డ్ చేసింది. వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అందుకే, రోడ్డు దాటే సమయంలో జర జాగ్రత్త. కారు నడిపే టప్పుడు ఇంకా జాగ్రత్త. ఎవరు అలర్ట్‌గా లేకున్నా.. పెను ప్రమాదం తప్పకపోవచ్చు. ప్రాణాలు కూడా పోవచ్చు.
Location: Mumbai
When a vehicle slows down or stops, take a moment to consider why.
They might have noticed something that we haven’t seen yet.This is also a worry for me when I am a pedestrian as someone else might not stop.
See and Be seen !! pic.twitter.com/CbhhQIh4nB
— DriveSmart🛡️ (@DriveSmart_IN) June 3, 2025