IND VS AUS 2nd Test: ఆస్ట్రేలియా ( Australia ) vs టీమిండియా ( Team India) మధ్య మరో టెస్ట్ మ్యాచ్ కు రంగం సిద్ధం అయింది. ఇవాళ్టి నుంచే ఆస్ట్రేలియా ( Australia ) vs టీమిండియా ( Team India) మధ్య మరో టెస్ట్ మ్యాచ్ జరుగనుంది. ఈ టెస్ట్ మ్యాచ్ పింక్ బాల్ తో నిర్వహించనున్నారు. అంతేకాదు.. ఈ పింక్ బాల్ టెస్ట్ మ్యాచ్ ను డై అండ్ నైట్ అంటే వన్డే తరహాలో నిర్వహించనున్నారు. మొదటి టెస్ట్ ప్రారంభం కంటే.. కాస్త లేట్ గానే ప్రారంభం కానుంది పింక్ బాల్ టెస్ట్ మ్యాచ్.
Also Read: IND VS AUS 2nd Test: పింక్ బాల్ టెస్ట్ టైమింగ్స్ లో మార్పులు.. ఫ్రీగా ఎక్కడ చూడాలంటే..?
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగానే…. జస్ప్రీత్ బుమ్రా కెప్టెన్సీలో మొదటి టెస్ట్ మ్యాచ్ గెలిచింది టీమిండియా. ఈ మ్యాచ్ లో భారత్ 295 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఆస్ట్రేలియా గడ్డపై టెస్టుల్లో తమ అతిపెద్ద విజయాన్ని నమోదు చేసుకుంది టీమిండియా. ఇక నవంబర్‌లో రెండోసారి తండ్రైన భారత కెప్టెన్ రోహిత్… రెండో టెస్ట్ నేపథ్యంలో జట్టులోకి తిరిగి వస్తున్నాడు. అదే సమయంలో, బొటనవేలు గాయం నుంచి కోలుకున్న శుభ్‌మాన్ గిల్ కూడా ప్లేయింగ్ XIలో ఉంటున్నాడు. ఇదే వేదికపై గతంలో 36 పరుగులకే టీమిండియా ఆలౌట్ అయింది. అయితే.. ఈ విషయంలో ఆసీస్ ను కూడా అలౌట్ చేసి…ప్రతీకారం తీర్చుకునేందుకు రంగం సిద్ధం చేస్తోంది టీమిండియా.
ALSO READ: Sachin – Vinod Kambli: ఒకప్పుడు దోస్తులు..మిత్రుడినే గుర్తుపట్టలేకపోయిన కాంబ్లీ..!
ఇక ఆస్ట్రేలియా vs ఇండియా పింక్-బాల్ టెస్ట్ మ్యాచ్ ఇవాళ ఉదయం 9 గంటలకు (IST) టాస్ ఉంటుంది. ఇక పింక్ బాల్ టెస్ట్ మ్యాచ్ మాత్రం 09:30 AM (IST)కి ప్రారంభమవుతుంది. ఆస్ట్రేలియా వర్సెస్ ఇండియా పింక్-బాల్ టెస్ట్ మ్యాచ్ స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్ ఛానెల్‌లో ప్రసారం కానుంది. ఆస్ట్రేలియా వర్సెస్ ఇండియా పింక్-బాల్ టెస్ట్ మ్యాచ్ డిస్నీ+హాట్‌స్టార్ యాప్, వెబ్‌సైట్‌లో ప్రత్యక్ష ప్రసారం చేయబడుతుంది. ముఖ్యంగా డీడీ స్పోర్ట్స్ లో కూడా వస్తుందని అంటున్నారు. కేంద్ర సర్కార్ ఆదేశాల మేరకు డీడీ స్పోర్ట్స్ లో కూడా ఉచితంగా చూడొచ్చన్న మాట.
అయితే.. మొన్నటి మ్యాచ్ లో కేఎల్ రాహుల్, యశస్వి జైస్వాల్‌లు అద్భుతంగా ఓపెనింగ్ చేశారు. రికార్డు భాగస్వామ్యాన్ని నెలకొల్పారు కేఎల్ రాహుల్, యశస్వి జైస్వాల్‌లు. పెర్త్‌లో భారత్ విజయానికి కారణమైన కేఎల్ రాహుల్, యశస్వి జైస్వాల్ జోడి, రెండో ఇన్నింగ్స్‌లో 201 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పింది. దీంతో కేఎల్ రాహుల్, యశస్వి జైస్వాల్ ల జంటను విడగొట్టకూడదని… కెప్టెన్ రోహిత్ శర్మ కీలక నిర్ణయం తీసుకున్నారట. మిడిల్ ఆర్డర్‌లో బ్యాటింగ్ చేస్తానని డిసైడ్ అయ్యారట కెప్టెన్ రోహిత్ శర్మ. రోహిత్ శర్మ .. మిడిల్ ఆర్డర్ లో ఎలా రాణిస్తాడో చూడాలి. ఇక అటు పడిక్కల్ పైనే ఈ మ్యాచ్ లో వేటు పడే ఛాన్స్ ఉందని సమాచారం.