Viral Video: ఊహించని సంఘటనలు కొన్ని జరుగుతాయి. అవి ఎందుకు జరుగుతాయో ఎవరికీ తెలీదు. తాజాగా యువకుడికి అలాంటి వింత అనుభవం ఎదురైంది. తన ప్రియురాలికి లవ్ ప్రపోజ్ చేస్తున్న సమయంలో ఒక్కసారిగా అగ్నిపర్వతం బద్దలైంది. దీనికి సంబంధించిన వీడియో ఇంటర్నెట్‌లో వైరల్ అయ్యింది.
లొకేషన్.. ఎప్పుడు.. ఏంటి అనేది కాసేపు పక్కనబెడదాం. సందర్భం బట్టి అగ్నిపర్వతాలు బద్దలవుతాయి. ఆసమయంలో ఏమి చేసినా అదొక తీసిగుర్తుగా వారి జీవితంలో మిగిలిపోతుంది. అగ్నిపర్వతం బద్దలు కావడానికి కొన్ని క్షణాల ముందు ఓ వ్యక్తి తన మోకాళ్లపై ప్రియురాలికి లవ్ ప్రపోజ్ చేశాడు. అతగాడి మాటలు విని ఆమె ఆశ్చర్యపోయింది.
చివరకు సిగ్గుపడుతూ అవునని చెప్పింది. ఆ తతంగాన్ని సెల్ ఫోన్‌తో చిత్రీకరిస్తున్న సమయంలో ఒక్కసారి దూరంగా ఉండే ఓ కొండపై అగ్నిపర్వతం బద్దలైంది. ఆ సన్నివేశాన్ని బంధించాడు మరో వ్యక్తి. అగ్నిపర్వతం బద్దలయ్యే ముందు ఆ జంట సన్నివేశం వైరల్ అయ్యింది. ఇంటర్నెట్‌లో తుపాను క్రియేట్ చేస్తోంది.
చాలా కాలం వేచి ఉన్నామని అనుకున్నారు. మనకు ప్రకృతి ముఖ్యమైన పాత్ర పోషిస్తుందని, ఆ క్షణాన్ని అందంగా మారుస్తుందని ఆ జంట అనుకుంది. వీడియో అప్ లోడ్ చేసిన గంటల వ్యవధిలో 7 మిలియన్ల మంది ఆ వీడియో తిలకించారు.
ALSO READ: ట్రంప్ ను కలిసింది పుతిన్ కాదా? ఆయన డూపా? ఆ డౌట్ ఎందుకు?
సోషల్‌మీడియాలో ఈ జంటపై ప్రశంసలు ముంచెత్తుతున్నాయి. మీరు చాలా అదృష్టవంతులని కొందరంటే.. మీ జీవితంలో మరుపురాని క్షణాలకు ప్రకృతి తోడైందని అంటున్నారు. అగ్నిసాక్షిగా పెళ్లి ఏమోగానీ, బద్దలైన అగ్నిపర్వతం సాక్షిగా ఒక్కటయ్యారనే కామెంట్స్ పడిపోతున్నాయి.
An unforgettable moment.
A volcano erupted just as a man was proposing to his girlfriend. pic.twitter.com/HxDWJRZaPK
— The Figen (@TheFigen_) August 18, 2025