దేశంలో చాలా మంది కొత్త జంటలు హనీమూన్ ఎంజాయ్ చేసేందుకు హిమాచల్ ప్రదేశ్ లోని మనాలికి వెళ్తుంటారు. అక్కడి చల్లటి వాతావరణంలో వెచ్చగా ఒక్కటవుతూ మర్చిపోలేను అనుభూతి పొందుతారు. మనాలికి వచ్చే పర్యాటకులలో ఎక్కువ మంది కొత్తగా పెళ్లైన వారే ఉంటారు. అయితే, ఈ మధ్య హనీమూన్ కోసం అక్కడికి వెళ్లే జంటలకు వింత అనుభవం ఎదురవుతోంది. దీంతో ఎంజాయ్ చేయకుండానే అక్కడి నుంచి వెనక్కి వచ్చేస్తున్నారు. ఇంతకీ అసలు ఏం జరుగుతుందంటే..?
ముట్టుకుంటే కరెంట్ షాక్!
‘మగధీర’ సినిమాలో రామ్ చరణ్ చేతి వేళ్లు కాజల్ చేతిని తగలగానే షాక్ తగిలినట్లు, మనాలిలో కొత్త పెళ్లి జంటలు ఒకరికొకరు టచ్ కాగానే షాక్ కొడుతోందట. ఒకరు ఇద్దరు కాదు.. ఈ మధ్య చాలా మందికి ఇదే అనుభవం ఎదురయ్యిందట. తాజాగా ఓ కొత్త జంట ఈ విషయాన్ని వెలుగులోకి తీసుకొచ్చింది. కంటెంట్ క్రియేటర్ స్మితా ఆచార్య ఈ కొత్త జంట అనుభవాన్ని సోషల్ మీడియా వేదికగా షేర్ చేసింది. ఈ వీడియో సుమారు 3 మిలియన్ల వ్యూస్ సాధించింది. బెడ్ గులాబీ రేకులతో ఆలంకరించబడి ఉంది. కొత్త జంట గదిలోకి అడుగు పెడతారు. ఆ తర్వాత సదరు లేడీ బెడ్ మీద ఉన్న గులాబీ రేకులను తీసివేసి “ఎండ్” అంటుంది. ఆమె భర్త “ఎండ్, టాటా, బై బై” అని చెప్తాడు. ఈ వీడియోకు “మనం ప్రేమ కోసం మనాలికి వచ్చాం. కానీ, చేతుల పట్టుకున్నా షాక్ కొడుతోంది” అని క్యాప్షన్ పెట్టారు.
తమకూ ఇలాంటి అనుభవమే ఎదురైంది అంటున్న నెటిజన్లు
ఈ వీడియో కొద్ది గంటల్లోనే బాగా వైరల్ అయ్యింది. చాలా మంది తన అనుభవాలను కూడా పంచుకున్నారు. “నా హనీమూన్ లో కూడా ఇలాగే జరిగింది. సిమ్లా రిసార్ట్ లో ఇలాంటి పరిస్థితే ఎదురయ్యింది. ఎందుకు ఇలా జరుగుతుందో ఎవరైనా చెప్పగలరా?” అని ఓ నెటిజన్ రాసుకొచ్చాడు.
?utm_source=ig_embed&utm_campaign=loading" data-instgrm-version="14">
ఎందుకు ఇలా జరుగుతుందంటే?
ఈ పరిస్థితికి కారణాలను వివరించే ప్రయత్నం చేశారు కొంతమంది నిపుణులు. చల్లని వాతావరణాలలో ఉపరితలంపై విద్యుత్ పేరుకుపోయి స్టాటిక్ విద్యుత్ అనేది ఏర్పడుతుంది. ఇది ఒక మాధ్యమం నుంచి మరొక మాధ్యమానికి ప్రసారం అవుతుంది. ఉన్ని లేదంటే సింథటిక్ దుస్తులలో నడవడం వల్ల వస్తువుల మధ్య ఘర్షణ ఏర్పడి ఎలక్ట్రాన్ల బదిలీని సులభతరం అవుతుంది. ఫలితంగా పవర్ ఉత్పత్తి అవుతుంది. తక్కువ తేమతో కూడిన చల్లని, పొడి వాతావరణం, స్టాటిక్ విద్యుత్ ప్రసారానికి అనువుగా ఉంటుంది. ఈ నేపథ్యంలో కొత్త జంట ఒకరినొకరు లేదా ఇత లోహ వస్తువులను తాకినప్పుడు, ఆయా వస్తువులలో పేరుకుపోయిన ఛార్జ్ విడుదల అవుతుంది. ఫలితంగా స్పార్క్ లేదంటే షాక్ కొట్టిన ఫీలింగ్ కలుగుతుంది. శీతాకాలంలో చాలా మందికి ఈ అనుభవం ఎదురయ్యే ఉంటుంది అంటున్నారు నిపుణులు.
Read Also: మసాలా నూరి, గరిటె తిప్పి.. ఘుమ ఘుమలాడే వంటలు చేస్తున్న ఏనుగు!