Maha Kumbh Train: ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగరాజ్ లో జరుగుతున్న మహా కుంభమేళాకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నారు. రోడ్డు మార్గంలో వెళ్లే వారికి తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కిలో మీటర్ల మేర ట్రాఫిక్ జామ్ కావడంతో వాహనదారులు, ప్రయాణీకులు అవస్థలు పడుతున్నారు. చాలా మంది రైళ్ల ద్వారా ప్రయాగరాజ్ కు వెళ్లేందుకు మొగ్గు చూపుతున్నారు. ఈ నేపథ్యంలో కుంభమేళాకు రైళ్లన్నీ ప్రయాణీకులతో కక్కిరిసిపోతున్నారు. కనీసం కాలు పెట్టేందుకు జాగ దొరకడం లేదు.
రైలు టాయిలెట్ లో నిలబడి యువతుల ప్రయాణం
తాజాగా రైళ్లో వెళ్లేందుకు ప్లేస్ లేకపోవడంతో కొంత మంది యువతులు ఏకంగా రైలు వాష్ రూమ్ లో నిలబడి ప్రయాణించారు. ఓ యువతితో పాటు ఆమె స్నేహితులు రైలు టాయిలెట్ లోకి వెళ్లి డోర్ క్లోజ్ చేసుకున్నారు. అందులోనే నిలబడి కుంభమేళా వరకు వెళ్లినట్లు తెలుస్తున్నది. ఈ వీడియోలో కొంత మంది యువతులు కింద నిలబడగా, మరికొంత మంది టాయిలెట్ సీటు మీద నిలబడి ఉన్నది. ఇక ఈ వీడియోలో ఓ యువతి “గాయ్స్.. మేము రైలు టాయిలెట్ లో ఉన్నాం. కుంభమేళాకు వెళ్తున్నాం” అని చెప్పింది. ఇక వాష్ రూమ్ లో ఎంత ఇబ్బందిగా వెళ్తున్నారో చూపించే ప్రయత్నం చేసింది. ఆ సమయంలో ఓ అమ్మాయి వాష్ రూమ్ డోర్ ఓపెన్ చేయకూడదని చెప్పడం వినిపిస్తున్నది.
Read Also: రైల్ ఇంజిన్‌లోనూ కిక్కిరిసిన ప్రయాణీకులు.. మరి ఆ రైలు ఎవరు నడుపుతారు రా బాబు!
ఆగ్రహం వ్యక్తం చేస్తున్న నెటిజన్లు
ఈ వీడియో చూడ్డానికి కాస్త ఫన్నీగా అనిపించినా, కుంభమేళాకు వెళ్లే భక్తులు పడే ఇబ్బందును కళ్లకు కట్టినట్లు చూపించింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాతో తెగ వైరల్ అవుతోంది. సుమారు 10 లక్షల మంది ఈ వీడియోను చూశారు. ఈ వీడియోపై కొంత మంది ఆగ్రహం వ్యక్తం చేస్తుంటే.. మరికొంత మంది జనాలు ఎక్కువ మంది ఉన్నప్పుడు ఇలాంటి ఇబ్బందులు తప్పవు అంటున్నారు. ప్రయాణీకుల ఎమర్జెన్సీ కోసం వాడే టాయిలెట్స్ ను బ్లాక్ చేయడం ఏంటని మరికొంత మంది ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ ఎవరికైనా వాష్ రూమ్ కు వెళ్లాల్సి వస్తే పరిస్థితి ఏంటని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రైల్వే అధికారులు సదరు అమ్మాయిలపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఈ వీడియోను రైల్వేశాఖకు ట్యాగ్ చేస్తూ పోస్టులు పెడుతున్నారు. “ఇలా వాష్ రూమ్స్ ను బ్లాక్ చేయడం వల్ల చాలా ఇబ్బందులు పడే అవకాశం ఉంది. ఇలాంటి వారిపై సరైన చర్యలు తీసుకోవాలి” అని కామెంట్స్ పెడుతున్నారు. మరోవైపు ఈ వైరల్ వీడియోపై రైల్వేశాఖ నుంచి ఎలాంటి స్పందన రాలేదు. ఇలాంటి పరిస్థితులలో అలాంటి ఘటనలు కామన్ అని లైట్ తీసుకున్నట్లు ఉన్నారని మరికొంత మంది నెటిజన్స్ కామెంట్స్ పెడుతున్నారు.
Read Also: కుంభమేళాకు రైళ్లలో వసతుల కరువు.. అసలు విషయం చెప్పిన సౌత్ సెంట్రల్ రైల్వే!
?utm_source=ig_embed&utm_campaign=loading" data-instgrm-version="14">
Read Also: కుంభమేళా భక్తులకు షాక్, ప్రయాగరాజ్‌లోని సంగం రైల్వే స్టేషన్ మూసివేత!