BigTV English

Mumbai Auto Driver: వైరల్ అయ్యాడు.. మొత్తం పోగొట్టుకున్నాడు.. ముంబై ఆటో డ్రైవర్ దుకాణం బంద్!

Mumbai Auto Driver: వైరల్ అయ్యాడు.. మొత్తం పోగొట్టుకున్నాడు.. ముంబై ఆటో డ్రైవర్ దుకాణం బంద్!

Viral News: కొంతమంది ఆలోచన క్రేజీగా ఉంటుంది. పైసా పెట్టుబడి లేకుండా డబ్బులు సంపాదిస్తారు. అలాంటి వారిలో ఒకడు ముంబై ఆటో డ్రైవర్. ఆయన ఆలోచనే పెట్టుబడిగా నెలకు రూ. 5 నుంచి రూ. 8 లక్షలు సంపాదించాడు. ఈ విషయం కాస్తా సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీసులు బ్రేక్ వేశారు. ఇంతకీ ఆయన ఏంశాడు? పోలీసులు ఆయన చేస్తున్న పనికి ఎందుకు చెక్ పెట్టారు? అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..


ఆటో డ్రైవర్ ఏం చేసేవాడంటే?

ముంబైలోని అమెరికా కాన్సులేట్‌ కు వచ్చే విజిటర్స్‌ కు లాకర్ సర్వీసు అందించే వాడు ఈ ఆటో డ్రైవర్. కాన్సులేట్ కార్యాలయానికి వచ్చే వారి లగేజీని లోపలికి అనుమతించరు. ఈ నేపథ్యంలో విజిటర్స్ ఇబ్బంది పడాల్సి వచ్చేది. ఈ విషయాన్ని గమనించిన స్థానిక ఆటో డ్రైవర్.. లాకర్ సర్వీసు ప్రారంభించాడు. విజిటర్స్ లగేజీని భద్రపరిచేవాడు. ఒక్కో విజిటర్ నుంచి రూ. 1000 ఛార్జీ తీసుకునేవాడు. అలా నెలకు సుమారు రూ. 5 నుంచి రూ.8 లక్షల వరకూ సంపాదించేవాడు. ఆయనకు సాయం చేసేందుకు కొంత మంది సహాయకులు కూడా ఉండేవారు.


సోషల్ మీడియాలో వీడియో వైరల్

ఆటో డ్రైవర్ లాకర్ వ్యవస్థ గురించి ఓ స్టార్టప్ కంపెనీ అధినేత సోషల్ మీడియాలో ఓ పోస్టు పెట్టాడు. ఆటో డ్రైవర్ ఉపాయాన్ని మెచ్చుకున్నాడు. తెలివిని పెట్టుబడిగా పెట్టి, డబ్బులు సంపాదిస్తున్న విషయాన్ని సోషల్ మీడియా వేదికగా ప్రశంసించాడు. పెద్దగా చదువుకోకపోయినా, ఆటో డ్రైవర్ ఇతరుల అవసరాలను తీర్చుతూ డబ్బులు సంపాదిస్తున్నాడని చెప్పుకొచ్చాడు. ఈ పోస్టు కాస్తా సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యింది. చివరకు పోలీసుల దృష్టికి చేరింది.

Read Also: నో పోలీస్ వెరిఫికేషన్, 3 రోజుల్లో ఇంటికే పాస్ పోర్ట్, ఎలా అంటే?

లాకర్ సర్వీసును మూసివేసిన పోలీసులు

సదరు ఆటో డ్రైవర్ ఎలాంటి అనుమతులు లేకుండా లాకర్ సర్వీసును నిర్వహిస్తున్నాడని పోలీసులు గుర్తించారు. ఆ లాకర్ సర్వీసును మూసేశారు. అతడికి సహకరిస్తున్న మరో 12 మందిని పిలిచి మాట్లాడారు. అక్కడి నుంచి లాకర్ సర్వీసును తొలగించాలని చెప్పారు. కాన్సులేట్ ప్రాంతంలో భద్రతా కారణాల దృష్ట్యా పార్కింగ్ కు అనుమతి లేదన్నారు. ప్యాసింజర్లను దింపేందుకు మాత్రమే ఆటో డ్రైవర్లకు అనుమతి ఉందన్నారు. లాకర్ సర్వీసును నిర్వహించేందుకు సదరు ఆటో డ్రైవర్ ఎలాంటి అనుమతి తీసుకోలేదని పోలీసులు తెలిపారు. ఏవైనా వస్తువులు పోతే, భద్రతా పరమైన సమస్యలు తలెత్తే అవకాశం ఉందన్నారు. ఆటో డ్రైవర్ కు ప్రయాణీకులను అక్కడ దించేందుకు అనుమతి ఉంది తప్ప, లాకర్ సర్వీసు నిర్వహించేకు అనుమతి లేదన్నారు. ఈ అంశానికి సంబంధించి పోలీసుల విచారణ తర్వాత, సదరు ఆటో డ్రైవర్ లాకర్ సర్వీసును నిలిపివేసినట్లు తెలిపారు. సోషల్ మీడియాలో వైరల్ కాకపోయి ఉంటే, అతడి వ్యాపారం చక్కగా కొనసాగేదంటున్నారు నెటిజన్లు.

Read Also:  లోకో పైలెట్స్ లేకుండానే మెట్రో రైళ్ల పరుగులు, రూ. 1500 కోట్లతో ప్లాన్!

Related News

Hyderabad News: మిడ్ నైట్ రోడ్లపై హంగామా.. ఓ చేతిలో బాటిల్.. మరో చేతిలో, కెమెరాకి చిక్కాడు

Viral CCTV Video: ఫ్యాక్టరీకి వచ్చిన సింహం.. ఎదురుగా మనిషి.. ట్విస్ట్ తెలిస్తే నవ్వులే.. వీడియో వైరల్!

Elephant video: ఈ పిల్ల ఏనుగు పడుకున్న వ్యక్తిని లేపీ మరీ..? నిజంగా ఇది అద్భుతం.. వీడియో వైరల్

Fight Viral Video: విద్యార్థుల ముష్టి యుద్ధం.. చొక్కాలు చినిగినా, వదల్లేదు.. వైరల్ వీడియో!

Jana Gana Mana: జాతీయ గీతాన్ని చిన్నారి ఎంత ముద్దుగా పాడిందో చూడండి.. వావ్ అనాల్సిందే..!

Burning pyre reel: స్మశానంలో కాలుతోన్న శవం పక్కన.. డ్యాన్స్ చేస్తూ రీల్స్ చేసిన అమ్మాయి, వీడియో వైరల్

Big Stories

×