Kiran Abbavaram: టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ క (KA). గత ఏడాది అక్టోబర్ 31న దీపావళి కానుకగా రిలీజ్ అయింది. మిస్టరీ థ్రిల్లర్ మూవీ గా ఈ చిత్రాన్ని సుజిత్, సందీప్ దర్శకత్వం వహించారు. తాజాగా 15వ దాదా సాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ లో ఈ సినిమా అవార్డు ను సొంతం చేసుకుంది. ఆ వివరాలు చూద్దాం..
ఆ కేటగిరీలో…
సస్పెన్స్ థ్రిల్లర్ గా ఈ మూవీ హిట్ టాక్ ని సొంతం చేసుకుంది. రిలీజ్ అయిన తర్వాత ఎంతోమంది ప్రశంసలను అందుకుంది. తాజాగా ఈ చిత్రం 15 వ దాదాసాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ అవార్డు 2025లో ఉత్తమ చిత్రంగా నిలిచింది. క చిత్రం ఉత్తమ చిత్రం కేటగిరీలో నామినేషన్ అయినట్లు ఏప్రిల్ 25వ సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. ఈ అవార్డు అందుకోనున్న కిరణ్ అబ్బవరం, చిత్ర యూనిట్ కు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు వస్తుంది. ఈ విషయం తెలుసుకున్న పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు, అభిమానులు అభినందనలు తెలుపుతున్నారు.
మిస్టరీ థ్రిల్లర్ మూవీ గా
కిరణ్ అబ్బవరం మిస్టరీ థ్రిల్లర్ మూవీ గా 2024లో అక్టోబర్ 31న ఈ సినిమా విడుదల అయింది. బాక్స్ ఆఫీస్ వద్ద గణనీయమైన విజయాన్ని సాధించింది. క్రిష్ణగిరి అనే గ్రామంలో మహిళల అదృశ్యం చుట్టూ తిరిగే కథగా రూపొందింది. చింతలపూడి శ్రీనివాస్ ,కేవీ రామ్మోహన్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతం సమీర్ రెడ్డి అందించారు. ఈ చిత్రాన్ని 20 కోట్ల బడ్జెట్ తో నిర్మించారు. కిరణ్ అబ్బవరం అభినయ వాసుదేవ్ పాత్రలో నటించారు. కోట శ్రీనివాసరావు, అజయ్, వెన్నెల కిషోర్, ప్రధాన పాత్రలో నటించారు. సినిమా కథ అంతా 1980 నేపథ్యంలో జరుగుతుంది. హీరో అనాధ, తను పోస్ట్ మ్యాన్ గా పని చేస్తుంటాడు. ఆ గ్రామంలోని మహిళలు ఒక్కొక్కరిగా అదృశ్యమవుతున్న రహస్యాన్ని హీరో ఛేదించే ప్రయత్నం చేస్తాడు. అతని జీవితంలో ముగ్గురు మహిళలు చుట్టూ తిరుగుతుంది ఈ కథ. ఫాంటసీ, థ్రిల్లర్ డ్రామాగా ఊహించని ట్విస్టులతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. చిత్రం క్లైమాక్స్లో ఓ షాకింగ్ రీవిల్ తో ముగుస్తుంది. ఈ చిత్రంలో హీరోయిన్లుగా నయన్ సారిక, తన్విరామ్ నటించారు. కిరణ్ జయాపజయాలు సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తూ దూసుకెళ్తున్నాడు. ఈ సినిమాకి అవార్డు రావడం ప్రేక్షకులు , సెలబ్రిటీలు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
కెరియర్ లో భారీ కలెక్షన్ మూవీ ..
ఈ సినిమా ఎన్నో అవార్డులతో పాటు ప్రశంసలను అందుకుంది. ‘క’చిత్రం తక్కువ బడ్జెట్ తో రూపొందించినప్పటికీ ఫ్రీ -సేల్స్ లో సుమారు 30 కోట్ల వసూల్ ని సాధించింది. విడుదలైన తొమ్మిది రోజుల్లో 20 కోట్ల రూపాయలను వసూలు చేసింది.ఈ చిత్రం 50 కోట్లకు పైగా గ్రాస్ వసూలు సాధించి కిరణ్ అబ్బవరం కెరియర్ లోనే మైలురాయిగా నిలిచిందనలో ఆశ్చర్యం లేదు. దాదా సాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ లో కిరణ్ అబ్బవరం’క’ చిత్రం అవార్డు, సొంతం చేసుకోవడం ఆయన నటన సామర్థ్యానికి నిదర్శనం.