BigTV English

Trump Modi Tariffs : మోదీ ముందే ఇండియాకు వార్నింగ్ ఇచ్చిన ట్రంప్.. మేము కూడా అదే చేస్తామంటూ…

Trump Modi Tariffs : మోదీ ముందే ఇండియాకు వార్నింగ్ ఇచ్చిన ట్రంప్.. మేము కూడా అదే చేస్తామంటూ…

Trump Modi Tariffs | అమెరికా కొత్త అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రెసిడెంట్ గా రెండోసారి పదవి చేపట్టాక భారతదేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తొలిసారి అగ్రరాజ్యం పర్యటనకు వెళ్లారు. ఈ క్రమంలో ప్రెసిడెంట్ ట్రంప్‌తో ప్రధాని మోదీ కీలక సమావేశంలో పాల్గొన్నారు. అయితే ఈ సమావేశంలో ట్రంప్ ఇరు దేశాల మధ్య మంచి సంబంధాలు కోరుకుంటున్నట్లు చెబుతూనే సుంకాల వార్నింగ్ ఇచ్చారు. ప్రపంచంలో చాలా దేశాలు దిగుమతులపై అధిక టారిఫ్ లు (సుంకాలు) విధిస్తున్నాయని.. వాటిలో అత్యధిక సుంకాలు విధించే దేశం ఇండియానే అని ట్రంప్ ఆగ్రహంగా అన్నారు.


ట్రంప్‌తో భేటీ అయిన ప్రధాని నరేంద్ర మోదీ అనేక అంశాలపై చర్చించారు. సమావేశం తర్వాత ఈ ఇద్దరు నేతలు మీడియాతో మాట్లాడారు. ఆ సమయంలో ఒకరి పట్ల మరొకరికి ఉన్న స్నేహాన్ని ప్రదర్శించారు. ఈ సందర్భంగా వారికి ఒక ఆసక్తికరమైన ప్రశ్న ఎదురైంది. దానికి ట్రంప్ సరదాగా సమాధానం ఇచ్చారు.

ట్రంప్‌, మోదీ.. ఈ ఇద్దరిలో మెరుగ్గా బేరమాడేది ఎవరు..? అని మీడియా ప్రశ్నించింది. ‘‘ ఆ విషయంలో మోదీనే నాకంటే చాలా మెరుగ్గా బేరసారాలు చేయగలరు. అందులో ఎలాంటి అనుమానం లేదు’’ అని ట్రంప్‌ టక్కున బదులిచ్చారు. అలాగే పరస్పర సుంకాల గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. ‘‘సుంకాలు, పన్నులు పరస్పరం ఉంటేనే న్యాయంగా ఉంటుంది. ఇండియాలో టారిఫ్‌లు చాలా ఎక్కువ. మేమూ ఆ విధంగానే స్పందిస్తాం. ఇండియా ఎంత సంకాలు విధిస్తుందో మేమూ అంతే విధిస్తాం. భారత్ లో సుంకాలు ఎక్కువగా ఉండడం వల్ల అమెరికా ఉత్పత్తులు ఎగుమతి కావడం లేదు. దాని వల్ల అమెరికాకు నష్టం జరుగుతోంది. అందుకే ఇకపై సుంకాలు విధిస్తాం. నాకు గుర్తుంది ఒకసారి అమెరికా మోటార్ సైకిల్ హార్లె డేవిడ్‌సన్ ఇండియాకు ఎగుమతులు చేయాలంటే అత్యధిక సుంకాల వల్ల అది కుదరలేదు. ఆ తరువాత ఇండియాలోనే హార్లె డేవిడ్‌సన్ ఫ్యాక్టరీ స్థాపించి అక్కడే తయారీ చేస్తున్నారు. ఇది చాలా మంచిది. చైనా అన్ని దేశాల కంటే ముందు ఇది చేసి చూపించింది. మేమూ అలాగే కోరుకుంటున్నాం.


అమెరికాలోనే అన్ని కంపెనీలు తమ ఫ్యాక్టరీలు పెట్టాలి. సెమీకండ్టర్లు, కార్ల కంపెనీలు.. అన్నీ అమెరికాకు తరలి రవాలి ఇక్కడే తయారీ చేయాలి. సుంకాలు విధించడం వల్ల తాత్కాలికంగా ప్రజలకు ధరలు ఎక్కువగా అనిపించవచ్చు. కానీ ఇక్కడే ఫ్యాక్టరీలు పెట్టడం లోకల్ గా అన్నీ తయారు చేయడం వల్ల ఇక్కడి రైతులు కూడా లాభపడతారు. అమెరికాలో ప్రతి ఒక్కరికీ ఉద్యోగాలు లభిస్తాయి. ఆ తరువాత ధరలు తగ్గిపోతాయి. ఇది ఎప్పుడో జరగాల్సింది. కానీ ఇంతకుముందు ఉన్న ప్రభుత్వం వల్ల అది జరగలేదు. ఇప్పుడు సుంకాలు విధించాల్సిందే.’’ అని స్పష్టంచేశారు.

Also Read:  ట్రంప్ క్రిమినల్ మైండ్.. నేరస్తులను భయంకరమైన జైలులో పెట్టాలని ప్లాన్

అమెరికాలో తన రెండు రోజుల పర్యటన ముగించుకొని ప్రధాని మోదీ స్వదేశానికి తిరిగి పయనమయ్యారు. వీరి భేటీలో సుంకాలు, వలసలు, ఇరుదేశాల వ్యూహాత్మక అంశాలపై ప్రధానంగా చర్చించినట్లు తెలుస్తోంది. అమెరికాలో అక్రమవలసదారులను తిరిగి తీసుకుంటామని మోదీ అన్నారు. అలాగే ట్రంప్ కూడా ఇరు దేశాల మధ్య ఐక్యత కొనసాగలని కోరుకున్నారు. ‘‘చాలా ఏళ్లుగా మోదీ నాకు స్నేహితుడు. మా స్నేహాన్ని రానున్న నాలుగేళ్లు కొనసాగిస్తాం. ప్రపంచంలోనే అత్యధిక ఆయిల్‌, గ్యాస్‌ వనరులు అమెరికాలో అందుబాటులో ఉన్నాయి. అవి భారత్‌కు కావాలి. మా ఇద్దరి మధ్య గొప్ప ఐక్యత, స్నేహం ఉన్నాయి. దేశాలుగా భారత్‌, అమెరికా కలిసి ఉండటం చాలా ముఖ్యం. మేం ఎవర్నీ ఓడించాలనుకోవట్లేదు. మంచి చేయాలని చూస్తున్నాం. అమెరికా ప్రజల కోసం అద్భుతంగా పని చేశాం. అమెరికాలో గత పాలన మాకు అంతరాయం కలిగించింది’’ అని ట్రంప్‌ అన్నారు.

ఇక ఈ భేటీకి కొన్ని గంటల ముందు అధ్యక్షుడు సుంకాల కొరడా ఝళిపించారు. అమెరికా ఉత్పత్తులపై దిగుమతి సుంకాలు విధించే అన్ని దేశాలపై ప్రతీకార సుంకాలు తప్పకుండా విధిస్తామని ప్రకటించారు. ట్రంప్‌ విధించిన ప్రతిసుంకాల ప్రభావం అభివృద్ధి చెందుతున్న దేశాలైన భారత్, బ్రెజిల్, వియత్నాంతోపాటు తూర్పు ఆసియా, ఆఫ్రికా దేశాలపై పడనుంది. ఈ మేరకు అమెరికా అధికారులకు ప్రతీకార సుంకాలు విధించేందుకు పూర్తి అధికారులు ఇస్తూ ట్రంప్ ఒక మెమోరాండంపై సంతకం చేశారు. ప్రస్తుతం భారత్‌ నుంచి దిగుమతి చేసుకునే వస్తువులపై అమెరికా సగటున 3శాతం సుంకాలను విధిస్తోంది. భారత్‌ 9.5శాతం సుంకాలను విధిస్తోంది. దీనిపైనే ట్రంప్‌ ఆగ్రహంగా వ్యక్తం చేశారు.

Related News

India-US P-8I Deal: అమెరికాకు భారత్ షాక్.. 3.6 బిలియన్ల డాలర్ల డీల్ సస్పెండ్

Donald Trump: ముందుంది ముసళ్ల పండగ.. ట్రంప్ హింటిచ్చింది అందుకేనా?

Modi VS Trump: మోదీ స్కెచ్.. రష్యా, చైనా అధ్యక్షులతో కీలక భేటీ.. ట్రంప్ మామకు దబిడి దిబిడే!

China Support: భారత్ కు చైనా ఊహించని మద్దతు.. డ్రాగన్ లెక్క వేరే ఉందా?

China New Virus: ఏనుగు దోమలు.. డ్రోన్లు.. ఫైన్లు.. చైనాతో మామూలుగా ఉండదు, ఆ వ్యాధిపై ఏకంగా యుద్ధం!

PM Modi: టారిఫ్ వార్.. ట్రంప్‌‌‌పై మోదీ ఎదురుదాడి, రాజీ పడేది లేదన్న ప్రధాని

Big Stories

×