Viral News: సోషల్ మీడియాలో ఒక యువతి చేసిన పోస్ట్ పెద్ద చర్చకు దారి తీసింది. తాజాగా, గురుగ్రామ్‌లో నివసిస్తున్న రష్యన్ యువతి విక్టోరియా కోవాన్ తన వీడియో ద్వారా సంచలనం సృష్టించింది. భారత్‌లో జీవించాలంటే తక్కువ ఖర్చుతో సాధ్యమని భావించే వారికి, ఆమె పూర్తిగా సవాలు చేస్తూ, తన నెలవారీ ఖర్చులను వెల్లడించింది. దీంతో విక్టోరియా చేసిన పోస్ట్ విమర్శలకు దారితీసింది.
విక్టోరియా తెలిపిన వివరాలు
విక్టోరియా ఆమె ఒక బీహెచ్‌కే ఇంటి అద్దాకు లక్ష ఇరవై వేల రూపాయలు, ఒక్కో ఉబెర్ బ్లాక్ రైడ్‌కు వెయ్యి రూపాయలు, విద్యుత్ బిల్లు కోసం పదిహేనువేల రూపాయలు, షాపింగ్‌కు ముప్పై వేల రూపాయలు, మందులకు ఇరవై వేల రూపాయలు, కిరాణాకు నలభై వేల రూపాయలు ఖర్చు చేస్తున్నట్లు తెలిపింది. ఈ లిస్టు చూపిన తరువాత, భారత్‌లో మంచి జీవనశైలి నిలుపుకోవాలంటే ఖర్చు ఎక్కువగా ఉండాలని ఆమె వీడియోకు క్యాప్షన్‌లో పేర్కొన్నారు.
Also Read: Flipkart Offer: ఎంత షాపింగ్ చేసినా సేవింగ్స్ గ్యారెంటీ.. ఫ్లిప్‌కార్ట్ స్పెషల్ డీల్
వీడియోకు నెటిజన్లు కామెంట్లు
ఈ ఖర్చులు విన్న వారిలో చాలామంది ఆశ్చర్యపోయి “ఒక ఫ్లాట్‌కి అంత అద్దెనా? మీరు స్వర్గంలో ఉంటున్నారా?” అంటూ కామెంట్లు చేశారు. దానికి విక్టోరియా మాత్రం సీరియస్‌గా స్పందిస్తూ “ఇది నిజమే, నేను ఒక్క బీహెచ్‌కేలోనే ఉంటున్నా” అని చెప్పుకొచ్చింది. ఆమెపై వచ్చిన విమర్శలకు కూడా సున్నితంగా సమాధానం ఇచ్చింది. “నేను ఫిర్యాదు చేయడం లేదు, నిజాలు చెబుతున్నా. మంచి లైఫ్‌స్టైల్ కొనసాగించాలంటే ఈ ఖర్చులు తప్పవు” అంటూ తెలిపింది. కానీ నెటిజన్లలో చాలా మంది మాత్రం ఆమె ఖర్చులు అవసరమై చేసినవి కాకుండా లగ్జరీ ఎంపికలే అని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
“ఉబెర్ బ్లాక్ బదులు సాధారణ ఉబెర్ వాడొచ్చు కదా, తక్కువ అద్దె ఉన్న ఫ్లాట్‌లో ఉండొచ్చు కదా” అంటూ కామెంట్లు చేశారు. అయినా విక్టోరియా తన అభిప్రాయాన్ని మార్చుకోలేదు. “నాకు ఖర్చులు తగ్గించుకోవాలనే ఉద్దేశ్యం లేదు. నా అనుభవం ఎలా ఉందో నేను చెబుతున్నా” అని చెప్పింది. మందులపై ఇంత ఖర్చు ఎందుకు అవుతుందో అడిగిన వారికి “ఎయిర్ పొల్యూషన్ కారణంగా” అని సమాధానం చెప్పింది. దీంతో ఈ మొత్తం సంఘటన ఒక పెద్ద చర్చను తెరపైకి తెచ్చింది. ఇండియాలో జీవితం నిజంగా చవకేనా లేక ఎవరి లైఫ్‌స్టైల్, ఎవరి అంచనాలు ఎలా ఉన్నాయో దానిపైనే ఆధారపడి ఉంటుందా అన్న ప్రశ్న ఇప్పుడు సోషల్ మీడియాలో ఓ రైంజ్‌లో చర్చకు దారితీస్తోంది.