BigTV English

Tsunami Videos: సునామీ ఎలా విరుచుకుపడిందో చూడండి.. రష్యా నుంచి అమెరికా వరకు అల్లకల్లోలం!

Tsunami Videos: సునామీ ఎలా విరుచుకుపడిందో చూడండి.. రష్యా నుంచి అమెరికా వరకు అల్లకల్లోలం!

Earthquake in Russia: రష్యా కేంద్రంగా ఏర్పడిన భూకంపం.. పసిఫిక్ తీరంలోని దేశాలను భయాందోళనలకు గురిచేసింది. భూకంప తీవ్రత వల్ల ఆయా దేశాలపై సునామీ విరుచుకుపడింది. ఈ ప్రమాదాన్ని ముందు గుర్తించి స్థానికులను అప్రమత్తం చేసినా.. కొన్ని ప్రాంతాల్లో ప్రాణ నష్టం చోటుచేసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. సోషల్ మీడియాలో కూడా భూకంపం, సునామీలకు సంబంధించిన వీడియోలు చక్కర్లు కొడుతున్నాయి. వాటిని చూస్తే మీకు తప్పకుండా ముచ్చెమటలు పడతాయి.


భూకంపం కేంద్రం ఎక్కడ?

రష్యాలోని కామ్చట్కా పెనిన్సులా ప్రాంతంలో భూకంప కేంద్రాన్ని గుర్తించినట్లు యూఎస్ జియోలాజికల్ సర్వే (USGS) వెల్లడించింది. 8.8 తీవ్రతతో భూకంపం ఏర్పడినట్లు ప్రకటించారు. భూమికి 19.3 కిమీల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు వెల్లడించారు. ఆ వెంటనే పసిఫిక్ మహా సముద్రం తీర దేశాలకు సునామీ హెచ్చరికలు జారీ చేశారు. చెప్పినట్లే పలు తీర ప్రాంతాలను సునామీ ముంచెత్తింది.


సునామీ కెరటాలు ముందుగా హవాయి తీరాన్ని తాకింది. సుమారు నాలుగు అడుగుల ఎత్తులో సముద్రం ముందుకెళ్లినట్లు సమాచారం. సుమానీ సైరన్లతో ముందస్తు హెచ్చరికలు జారీ చేశారు. హవాయి, అమెరికా పశ్చిమ తీరం, జపాన్‌లలో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. సునామీ జపాన్ చేరడానికి సుమారు మూడు గంటల సమయం ఉందని చెప్పడంతో సుమారు 9 లక్షల మందిని తీర ప్రాంతాల నుంచి తరలించారు. అయితే, హవాయిలో కొంతమంది ట్రాఫిక్ జామ్‌లో చిక్కుకున్నారు. ఆ రహదారులు సముద్ర తీర ప్రాంతానికి సమీపంలోనే ఉంది. ప్రస్తుతం అక్కడి పరిస్థితి ఏమటనేది తెలియాల్సి ఉంది.

సముద్రం మధ్యలోకి వెళ్లిపోయిన జపాన్ ఓడలు, బోట్లు

సునామీ హెచ్చరికల నేపథ్యంలో జపాన్‌లోని భారీ ఓడలు, బోట్లు సముద్రం మధ్యలోకి వెళ్లిపోయాయి. ఎందుకంటే.. సునామీ ప్రభావం ఎక్కువగా తీర ప్రాంతాల్లోనే ఉంటుంది. వాటర్ ఫోర్స్‌గా తీరాన్ని తాకుతుంది. ఆ సమయంలో పోర్టులో ఉండే ఓడలు, పడవలు సైతం తీరానికి కొట్టుకెళ్తాయి. దీనివల్ల ప్రమాదం మరింత తీవ్రంగా ఉంటుంది. అటు ఓడలు, ఇటు తీరంలోని జనావాసాలకు కూడా తీవ్ర నష్టం వాటిల్లుతుంది. సముద్రం మధ్యలో కెరటాల ప్రభావం తక్కువగా ఉంటుంది.

తీరానికి కొట్టుకొచ్చి వేల్స్ చేపలు

వేల్స్ చేపలు ఎక్కువగా సముద్రం మధ్యలోనే ఉంటాయి. అయితే రష్యాలో భారీ భూకంపం తర్వాత వేల్స్ చేపలు కొన్ని జపాన్ తీరానికి కొట్టుకుని వచ్చాయి. భూకంపం తర్వాత సముద్రంలో ఏర్పడిన ప్రతికూల పరిస్థితుల వల్లే వేల్స్ గందరగోళానికి గురై తీరం వైపుకు వచ్చి ఉండవచ్చని భావిస్తున్నారు. అలాగే, భూకంపం వల్ల సముద్రం లోపల ఏర్పడే కరెంట్ ప్రభావం కూడా కావచ్చని నిపుణులు అంటున్నారు. ప్రస్తుతం ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అలాగే.. వైట్ షార్క్ చేపలు కూడా తీరానికి కొట్టుకొచ్చినట్లు కొన్ని వీడియోలు Xలో చక్కర్లు కొడుతున్నాయి. అయితే, అవి ఏఐ వీడియోలు కావచ్చని సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న భూకంపం.. సునామీ వీడియోలను కింది ట్వీట్లలో చూడండి.

Related News

Viral Video: ఈయన దాహమేస్తే ఇంజిన్ ఆయిల్ తాగేస్తాడు.. రోజూ ఏకంగా 8 లీటర్లు!

Viral Video: ఫ్లష్ కొట్టగానే.. బుస్సు అంటూ పైకిలేచిన తాచు పాము, పాపం.. గుండె జారింది!

Rare Meteor: ఆకాశంలో అరుదైన మెరుపులు.. నిజంగా ఉల్కాపాతమేనా?

Viral Video: రోడ్డు మధ్యలో కారు ఆపి.. హస్త ప్రయోగం.. ఇంత కరువులో ఉన్నావ్ ఏంట్రా?

Viral Video: నడి రోడ్డుపై భర్తను ఉతికి ఆరేసిన భార్య.. పెళ్లికాని ప్రసాదులు మీరు చాలా లక్కీ!

Viral News: పానీ పూరీల కోసం రోడ్డుపై కూర్చోని ధర్నా చేసిన మహిళ.. కారణం తెలిస్తే నవ్వు ఆగదు!

Hyderabad Rains: వానల్లో జనాలకు సాయం.. స్విగ్గి, జొమాటో డెలివరీ బాయ్స్‌ పై హైదరాబాదీలు ప్రశంసలు!

Chimpanzee: వామ్మో.. చింపాంజీలు ఇంత తాగుబోతులా? ఇన్నాళ్లూ ఈ విషయం తెలియదే!

Big Stories

×