Funny Dog Rooster Fight Viral Video: సోషల్ మీడియాలో తరచుగా ఆసక్తికర వీడియోలు దర్శనం ఇస్తుంటాయి. చిన్న చిన్న జంతువులు పెద్ద జంతువులను భయపెడుతుంటాయి. కోడెను మేకపోతు భయపెట్టడం, కుక్క పులిని ఉరికించడం, గొర్రెను పిల్లి వెంటబడటం లాంటి ఘటనలు చాలాసార్లు చూశాం. ఇలాంటి అరుదైన, ఆసక్తికర వీడియోలు నెట్టింట కనిపిస్తూనే ఉంటాయి. కానీ, తాజాగా ఓ కోడి పుంజు ఏకంగా కుక్కకు ముచ్చెమటలు పట్టించడం ఎప్పుడైనా చూశారా? లేదంటే.. ఇప్పుడు చూడండి.
కుక్కపై ఒంటి కాలుతో లేచిన కోడిపుంజు
నిజానికి పక్షులు జంతువులకు మనుషుల మాదిరిగానే ఫీలింగ్స్ ఉంటాయి. అవి కూడా కోపాన్ని, జాలిని చూపిస్తాయి. తమకు అన్యాయం జరుగుతుందని భావిస్తే తిరగబడుతాయి. ఎదిరిస్తాయి. బరిలో బలవంతుడు ఉన్నా, పోరాడి కొట్లాడుతాయి. తమ సత్తా చాటుకుంటాయి. తాజాగా ఓ కోడి పుంజు కూడా తన కోపాన్ని అంతా బయటపెట్టింది. ఏకంగా కుక్క మీదే కయ్యానికి కాలు దువ్వింది. కుక్క గుర్రుమంటూ అరుస్తున్నా, తనను చంపే శక్తి ఉన్నప్పటికీ కోడిపుంజు ఎగిరి ఎగిరి కాళ్లతో తన్నింది. నోటితో పొడిచింది. కుక్క ఓసారి కోడిపుంజు తలను పట్టుకున్నప్పటికీ ‘నియ్యవ్వ తగ్గేదే లే’ అన్నట్లు రెచ్చిపోయింది. తన కోపం తగ్గే వరకు కుక్క మీద గొడవ చేసి నెమ్మదిగా అక్కడి నుంచి వెళ్లిపోయింది.
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న కుక్క-కోడిపుంజు ఫైటింగ్ వీడియో
ఇక కుక్క- కోడిపుంజు ఫైట్ కు సంబంధించిన వీడియో Momentos Virales అనే అకౌంట్ ద్వారా ఎక్స్ లో షేర్ అయ్యింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇప్పటికే ఈ వీడియోను 4.5 లక్షలకు పైగా వ్యూస్ సాధించింది. ఈ ఫైట్ ను చూసి నెటిజన్లు ఫన్నీగా రియాక్ట్ అవుతున్నారు. “ఆ కోడి పుంజు ఇంకా బతికే ఉందా?” అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. “ఆ కుక్కకు తిక్కలేసి దాని మెడ కొరికేసి ఉంటుంది” అని ఇంకో వ్యక్తి కామెంట్ పెట్టాడు. “ఆ కోడిపుంజుకు చాలా ధైర్యం ఎక్కువ. చిన్నది అయినప్పటికీ పెద్ద జంతువు అయిన కుక్క అన్యాయాన్ని బలంగా ఎదిరిస్తోంది. నిజంగా గొప్ప విషయం” అంటూ మరో వ్యక్తి రాసుకొచ్చాడు. “ప్రతి మనిషి ఆ కోడిపుంజు లాగే ప్రయత్నం చేయాలి. అన్యాయం చేసే వాడు ఎంత పెద్ద వాడు అయినప్పటికీ ధైర్యంగా పోరాడాలి అనే స్ఫూర్తిని అందిస్తోంది ఆ కోడిపుంజు” అంటూ మరో వ్యక్తి కామెంట్ చేశాడు. “మన స్థాయి తెలుసుకుని ప్రవర్తించడం మంచిది. ఆ కుక్కకు తిక్కలేస్తే ఆ కోడిపుంజు మెడ క్షణాల్లో తెగిపడుతుంది” అని ఇంకో వ్యక్తి రాసుకొచ్చాడు. మొత్తంగా ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలోనెటిజన్లను బాగా ఆకట్టుకుంటోంది. ఫన్నీ కామెంట్స్ తో పాటు, ఆలోచించే వ్యాఖ్యలు చేస్తున్నారు నెటిజన్లు.
Read Also: టర్కీకి చెక్కేస్తున్న బట్టతల బాధితులు.. ఇంతకీ అక్కడి ప్రత్యేకత ఏమిటో తెలుసా?
😂😅🤣 pic.twitter.com/VF5Qs4GCud
— Momentos Virales (@momentoviral) March 6, 2025
Read Also: ఆ కారులో ఏముంది? ఆమె అంత భయంతో పరిగెట్టింది?