BigTV English

Viral News: ఒక్క రోజు రెస్టారెంట్ బిల్లు కోటి రూపాయలా? బంగారం ఏమైనా తిన్నార్రా బాబూ?

Viral News: ఒక్క రోజు రెస్టారెంట్ బిల్లు కోటి రూపాయలా? బంగారం ఏమైనా తిన్నార్రా బాబూ?

Cannes Restaurant Bill: ఎప్పుడూ ఇంట్లోనేనా.. అప్పుడప్పుడు రెస్టారెంట్ కు వెళ్లా హ్యాపీగా డిన్నర్ చేసి రావాలని చాలా మంది అనుకుంటారు. తరచుగా వెళ్తుంటారు కూడా. ఫ్యామిలీ, ఫ్రెండ్స్, బంధువులు ఎవరో ఒకరితో కలిపి వెళ్లి నచ్చిన డ్రింక్ తాగేస్తారు. నచ్చిన ఫుడ్ తినేస్తారు. ఇక రెస్టారెంట్ బిల్ అనేది అక్కడ కల్పించే సౌకర్యాలు, దాని స్టేటస్ ను బట్టి ఉంటుంది. ఒక ఫ్యామిలీ మొత్తం వెళ్లి డిన్నర్ చేసినా రూ. 5,000 నుంచి రూ.  10,000 వేల వరకు ఖర్చు అవుతుంది. మరీ గొప్ప రెస్టారెంట్ అనుకుంటే రూ. 20, 000 అవుతుంది. కానీ, కేన్స్ లోని ఓ రెస్టారెంట్ లో ఆరుగురు ఫ్రెండ్స్ కలిసి చేసిన డిన్నర్ బిల్ చూస్తే కళ్లు తిరిగిపడిపోవాల్సిందే!


ఒక్క రాత్రి రెస్టారెంట్ బిల్ ఏకంగా రూ. కోటి!

కేన్స్ లోని ఫ్రెంచ్ రివేరా ప్రాంతంలో లా మోమ్  అనేది చాలా ఫేమస్ రెస్టారెంట్. కేన్స్ కు వెళ్లే ఎంతో మంది సెలబ్రిటీలు ఇక్కడే బస చేసేందుకు ఇష్టపడుతారు. అలాగే తాజాగా ఆరుగురు ఫ్రెండ్స్ ఆ రెస్టారెంట్ కు వచ్చారు. అక్కడ చక్కటి ఫుడ్ తో పాటు డ్రింక్స్ ఆస్వాదించారు. ముఖ్యంగా ఆ హోటల్ కు సంబంధించి బీచ్ లో ఫుడ్ తింటూ ఎంజాయ్ చేశారు. ఒక్కరోజు రాత్రి ఆ రెస్టారెంట్ లో గడిపినందుకు ఇచ్చిన బిల్లు ఏకంగా $116,500. అంటే భారత కరెన్సీలో ఈ మొత్తం ఏకంగా రూ. 1,02,31,171. ఈ బిల్లులో దాదాపు $21,800(రూ.19,14,502) ఫుడ్ ఖర్చులు కాగా, ఆల్కహాల్ కు $19,600(రూ.17,21,295) బిల్ చేశారు. ఇందులో ఖరీదైన షాంపైన్ బాటిల్, ఇతర మద్యం బాటిళ్లు ఉన్నట్లు గుర్తించారు.   స్టఫ్, సర్వీసు ఛార్జీలు సహా మొత్తం రూ. కోటి బిల్లు ఇచ్చారు. ఈ బిల్ ఫోటోను సదరు వ్యక్తులు ఫోటో తీసి సోషల్ మీడియాలో షేర్ చేవారు. ప్రస్తుతం ఈ బిల్లు నెట్టింట వైరల్ అవుతోంది.


నెటిజన్లు ఏం అంటున్నారంటే?

ఇక ఈ బిల్లును చూసి నెటిజన్లు ముక్కు మీద వేలేసుకుంటున్నారు. “ఒక్కరాత్రి రెస్టారెంట్ ఖర్చు రూ. కోటి అంటే వాళ్ల దగ్గర డబ్బు ఎంత వృథాగా పడి ఉందో అర్థం అవుతోంది” అని ఓ నెటిజన్ రాసుకొచ్చాడు. “ఈ బిల్లు చూస్తుంటే నా కళ్లు చెదిరిపోయేలా ఉంది. ఇంత డబ్బు ఉంటే ఓ రెండు, మూడు మధ్య తరగతి కుటుంబాలు జీవితాంతం హాయిగా బతుకుతాయి” అని మరో వ్యక్తి రాసుకొచ్చాడు. “ఈ బిల్లును చూస్తుంటే, సదరు వ్యక్తులు రేపు అనేది ఉన్నది అనే విషయం మర్చిపోయి ఖర్చు పెట్టినట్లు అనిపిస్తుంది. బహుశా స్కైలాబ్ లాంటిది ఏదైనా పడి భూమి అంతం అవుతుందని వారికి ఎవరైనా చెప్పారేమో?” అంటూ ఫన్ చేశాడు. మొత్తంగా ఈ బిల్లుపై ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా చర్చ జరుగుతోంది.

Read Also: తేనెటీగల విషంతో రొమ్ము క్యాన్సర్‌ మాయం.. పరిశోధకుల కీలక ఆవిష్కణ!

Related News

Viral News: ఆ చికెన్ మీద మనసు పడ్డ బ్లాక్ పింక్ లిసా, వరల్డ్ వైడ్ గా వైరల్ అంతే!

DMart: డిమార్ట్ లో ఈ మహిళల్లా అస్సలు చేయకండి, లేదంటే బుక్కవ్వడం పక్కా!

Viral Video: పొంగిపొర్లే నదిలో డేంజర్ స్టంట్, వరద ధాటికి జీప్ పల్టీ, సీన్ కట్ చేస్తే..

Viral Video: మెట్రో స్టేషన్ లో షాక్.. యెల్లో లైన్‌ దాటిన సెక్యూరిటీ.. అదే సమయంలో!

Pakistan Woman: ఇదేం శిక్ష.. యువతిని రేప్ చేసిన వ్యక్తి.. అతడి చెల్లిని బహిరంగంగా రేప్ చేయాలని తీర్పు!

Big Stories

×