BigTV English

NBK 109: నందమూరి ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. NBK 109 నుంచి అప్డేట్ రెడీ..!

NBK 109: నందమూరి ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. NBK 109 నుంచి అప్డేట్ రెడీ..!

Balakrishna – NBK 109: టాలీవుడ్ డేర్ అండ్ డ్యాషింగ్ హీరో బాలయ్య బాబు సినిమా వస్తుందంటే థియేటర్ల వద్ద హంగామా ఓ రేంజ్‌లో ఉంటుంది. ఫుల్ మాస్ యాక్షన్ సినిమాలను ఇష్టపడేవారు ఆయన సినిమాలను అస్సలు మిస్ అవ్వరు. మాస్ డైలాగ్‌లతో సినీ ప్రియుల్ని, అభిమానుల్ని ఉర్రూతలుగిస్తుంటాడు. గతేడాది ‘భగవంత్ కేసరి’ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఎన్నో అంచనాలతో తెరకెక్కింది.


ఇక థియేటర్లలో రిలీజ్ అయిన తర్వాత ఈ మూవీకి మంచి రెస్పాన్స్ వచ్చింది. దీంతో బాలయ్య బాబు ‘విరసింహా రెడ్డి’ తర్వాత మరొక బ్లాక్ బస్టర్ హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఇందులో స్టార్ హీరోయిన్‌ కాజల్, యంగ్ బ్యూటీ శ్రీలీల నటించి మెప్పించారు. ఇక బాక్సాఫీసు వద్ద కలెక్షన్లు కూడా బాగానే వచ్చాయి. అయితే ఈ ఏడాది మరొక పెద్ద సినిమాతో బాలయ్య బాబు ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమయ్యాడు.

ఇందులో భాగంగానే ప్రముఖ దర్శకుడు బాబి డైరెక్షన్‌లో ఓ మూవీ చేస్తున్నాడు. ‘NBK 109’ అనే వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ మూవీలో బాలయ్య బాబు ఫుల్ ఊరమాస్ లుక్‌లో కనిపించబోతున్నాడు. ఇప్పటికే ఈ మూవీ నుంచి బాలయ్యబాబు ఫస్ట్ లుక్ గ్లింప్స్ రిలీజ్ చేయగా యూట్యూబ్‌లో ట్రెండింగ్‌గా మారాయి. అందులోనూ బాలయ్య మాస్ యాక్షన్ సీన్లు అయితే మరో రేంజ్‌లో ఉండటంతో ఈ మూవీ పక్కగా బాలయ్యకు మరో హిట్‌ని ఇస్తుందని అభిమానులు ఫిక్స్ అయిపోయారు.


Also Read: గూస్‌బంప్స్ తెప్పిస్తున్న బాలయ్య.. బాబీ సినిమా టైటిల్.. ఇదిగో ఇదేనట!

ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ నుంచి తాజాగా ఓ క్రేజీ అప్డేట్ నెట్టింట వైరల్‌గా మారింది. ఈ మూవీ నుంచి త్వరలో అదిరిపోయే అప్డేట్ వస్తుందంటూ ఓ వార్త జోరుగా సాగుతుంది. వచ్చే నెల అంటే జూన్ 10న బాలకృష్ణ బర్త్ డే. అందువల్ల ఈ బర్త్ డే సందర్భంగా ‘ఎన్‌బీకే 109’ మూవీ టైటిల్‌ను మేకర్స్ రివీల్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో ఈ విషయం తెలియగానే నందమూరి ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత నాగవంశీ, సాయి సౌజన్య కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అలాగే రాక్ స్టార్ దేవీశ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి మ్యూజిక్ అందిస్తున్నాడు.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×