Viral Video: ఇటీవల ఎక్కడ పడితే అక్కడ దొంగలు దోపిడీలకు పాల్పడుతున్నారు. వస్తువులు, అమ్మాయిలు, చిన్న పిల్లలు ఇలా దొంగతనాలు, దోపిడీలు చేస్తూ జైలు పాలవుతున్నారు. ఇలాంటి ఘటనలు తరచూ ఎన్నో వెలుగుచూస్తుంటాయి. అయితే సోషల్ మీడియా యుగం వచ్చిన తర్వాత ఇలాంటి ఘటనలకు సంబంధించిన వీడియోలు తరచూ నెట్టింట హల్ చల్ చేస్తుంటాయి. షాపుల్లో, బంగారం దుకాణాల్లో, ఇళ్లల్లో, కంపెనీల్లో, గుడిల్లో ఇలా ఎక్కడ పడితే అక్కడ దొంగతనాలకు పాల్పడుతుంటారు. అయితే కేవలం మగవారు మాత్రమే కాకుండా ఆడవారు కూడా ఇలాంటి పనులు చేస్తూ అడ్డంగా దొరికిపోతుంటారు. ఇలాంటి వీడియోలు తరచూ నెట్టింట వైరల్ అవుతుండగా.. అలాంటి తరహాలోనే తాజాగా ఓ వీడియో సోషల్ మీడియాలో దర్శనమిచ్చింది.
ఓ యువతి షాపులో దొంగతనం చేసే ప్రయత్నం చేసి అడ్డంగా షాపు యజమాని, సిబ్బందికి దొరికిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. షాపులో అందరి కళ్లు కప్పి దొంగతనం చేయాలని ప్రయత్నించింది. షాపింగ్ చేయాలనే ఆలోచనతో ఓ షాపింగ్ మాల్ లోకి వెళ్లింది. ఈ తరుణంలో జీన్స్ ప్యాంట్ ట్రయల్ చేయాలని అనుకుంది. ఈ క్రమంలో అక్కడే ఉన్న సిబ్బందికి ప్యాంట్ ట్రయల్ చేయాలని అడిగింది. టెస్టింగ్ కోసం డ్రెస్సింగ్ రూంలోకి వెళ్లింది. అయితే అంతవరకు బాగానే ఉన్న అసలు ట్విస్ట్ ఇక్కడే చోటుచేసుకుంది.
డ్రస్సింగ్ రూంలో నుండి బయటకు రాగానే ఏవి కొనకుండా అక్కడి నుంచి జారుకోవాలని ప్రయత్నించింది. దీంతో సిబ్బందికి అనుమానం వచ్చి ఆ యువతిని పట్టుకున్నారు. అనంతరం ప్యాంట్ విప్పే ప్రయత్నం చేశారు. దీంతో జీన్స్ ప్యాంట్ లోపల మరొక ప్యాంట్ చూడడంతో అంతా షాక్ అయ్యారు. ప్యాంటును దొంగిలించి అక్కడి నుంచి పారిపోవాలని అనుకుంది. ఈ తరుణంలో ఆమెను సిబ్బంది అంతా చితకబాదారు. అనంతరం అక్కడి నుంచి యువతి పరారైంది. దీనికి సంబంధించిన దృశ్యాలు అక్కడే ఉన్న సీసీటీవీ కెమెరాలో రికార్డ్ కావడంతో సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా తెగ వైరల్ అవుతోంది.
— Second before disaster (@NeverteIImeodd) July 12, 2024