Adulterated Toddy Issue Kamareddy District: కామారెడ్డి జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఈ రోజు సాయంత్రం కల్తీ కల్లు తాగి 15 మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. గమనించిన స్థానికులు వెంటనే ఆస్పత్రికి తరలించారు.
వివరాల ప్రకారం.. కామారెడ్డి జిల్లాలోని నస్రుల్లాబాద్ మండలంలోని దుర్కి గ్రామంలో ఈ రోజు చాలా మంది కల్లు తాగారు. అయితే అది కల్తీ కల్లు కావడంతో చాలా మంది అనారోగ్యానికి గురయ్యారు. వీరిలో 15 మంది పరిస్థితి సీరియస్ గా ఉండడంతో వెంటనే స్థానికులు నిజామాబాద్ ఆస్పత్రికి తరలించి అత్యవసర చికిత్స అందిస్తున్నారు. మరి కొంత మంది మతి స్థిమితం కోల్పోయినట్టు ప్రవర్తిస్తున్నారు. బాధిత వ్యక్తుల్లో నలుగురి పరిస్థితి విషయం ఉన్నట్టు వైద్యులు తెలిపారు.
ALSO READ: Rajiv Yuva Vikasam: రూ.4,00,000 స్కీంకు దరఖాస్తు చేసుకున్నారా..? ఇంకా వారం రోజులే గడువు మిత్రమా..!
గ్రామంలో కల్లు తాగిన అందరూ మతిస్థిమితం కోల్పోయి వింతగా ప్రవర్తిస్తున్నారని గ్రామస్థులు తెలిపారు. వెంటనే గ్రామస్థులు పోలీసులు సమాచారం ఇచ్చారు. సమాచారం అందుకున్న పోలీసులు, ఉన్నత అధికారులు గ్రామానికి చేరుకున్నారు. అక్కడి పరిస్థితిని సమీక్షిస్తున్నారు. దీనిపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
ALSO READ: BEL Jobs: హైదరాబాద్, బెల్‌లో ఉద్యోగాలు.. మంచి సాలరీ, ఇంకా 2 రోజులే గడువు
ALSO READ: IDBI Recruitment: డిగ్రీతో ఐడీబీఐలో ఉద్యోగాలు.. ఎలాంటి ఎగ్జామ్ లేదు.. లక్షల్లో జీతాలు భయ్యా..