ప్రేమికుల రోజు వచ్చిందంటే చాలు.. ప్రేమలో ఉన్న వాళ్లు వాలంటైన్స్ డే వీక్ పేరుతో రకరకాల గిఫ్టులు ఇచ్చిపుచ్చుకుంటారు. హ్యాపీగా జాలీగా సెలబ్రేట్ చేసుకుంటారు. తమ ప్రేమను ఎదుటి వారికి వ్యక్తం చేసేందుకు ప్రయత్నిస్తుంటారు. పువ్వులు, చాక్లెట్లు, బహుమతులు ఇస్తుంటారు. ప్రేమను మరింత బలోపేతం చేసుకునేందుకు ప్రయత్నిస్తారు. కానీ, మిమ్మల్ని వదిలేసి వెళ్లిన ప్రియురాలు లేదంటే ప్రియుడు ఎప్పుడైనా గుర్తుకు వచ్చాడా? ప్రేమికుల రోజున వారి మీద మీ కోపం అంతా చూపించాలని ఉందా? అయితే, వారికి ఓ చెత్త బహుమతి పంపించండి. ఇంతకీ ఆ బహుమతి ఏదై ఉంటే బాగుంటుంది? ఎలా పంపాలి? అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం..
10 డాలర్ల ఛార్జ్ తో ఏనుగు పేడ బహుమతి
అమెరికా టేనస్సీలోని మెంఫిస్ జూ సంస్థ ఎక్స్ లవర్స్ కు చెత్త బహుమతి పంపించే సౌకర్యాన్ని కల్పిస్తున్నది. ఇందుకోసం 10 డాలర్లు ఛార్జ్ చేస్తుంది. ముందుగా వారికి డబ్బులు పే చేసి, మీ ఎక్స్ లవర్ వివరాలను అందిస్తే, వారికి ఈ చెత్త బహుమతిని అందిస్తారు. ఇంతకీ ఈ సంస్థ పంపించే బహుమతి ఏంటో తెలుసా? అత్యంత దుర్వాసన వెదజల్లే ఏనుగు పేడ. “మీకు చిరాకు కలిగించే పొరుగు వారు, అహంకారపూరితంగా వ్యవహరించే అత్తగారు, మీ మాజీ లవర్, పిచ్చి లేపే తోటి ఉద్యోగి, మీకు కంపరం తెప్పించే వ్యక్తికి ఈ వాలంటైన్స్ డే రోజు అత్యంత చెత్త బహుమతి అయిన దుర్వాసన కలిగి ఉన్న ఏనుగు పేడను అందివ్వండి. మీరు 10 డాలర్లు పే చేసి, ఆర్డర్ ఇస్తే, మీ కోపాన్ని కనబరిచేలా మేం చెత్తి బహుమతిని పార్శిల్ చేస్తాం” అని మెంఫిస్ జూ సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది.
Read Also: భర్త ధనవంతుడంటూ బంధువులకు పంగనామాలు.. ‘ఫేక్ పెళ్లి చేసుకుని మరీ..
మీరు ఈ ఆర్డర్ ఎలా ఇవ్వాలంటే?
మెంఫిస్ జూ సోషల్ మీడియా ఈ గిఫ్ట్ ఆర్డర్ ను ఎంచుకోవాలి. ఆర్డర్ కోసం నిర్ణీత ఛార్జ్ చెల్లించాలి. మీరు కోరుకున్న వారికి డిజిటల్ థాంక్యూ యు కార్డ్, దుర్వాసనతో కూడిన ఏనుగు పేడతో కూడిన బహమతిని పంపిస్తారు. డేటింగ్, డంపింగ్ ప్రచారం కేవలం ప్రచార జిమ్మిక్ కాదు. ఈ డబ్బులను మెంఫిస్ జూ తన సంరక్షణలో ఉన్న జంతువు బాగోగుల కోసం వినియోగించనున్నారు. ఈ జూ ప్రస్తుతం 3,500 కంటే ఎక్కువ జంతువులను సంరక్షిస్తున్నది. వీటి సంరక్షణ కోసం నిధులను సేకరించేందుకు ఈ కార్యక్రమం చేపట్టినట్లు నిర్వాహకులు వెల్లడించారు. ఈ ప్రయత్నాన్ని చాలా మంది అభినందిస్తున్నారు. నచ్చని వారి పట్ల కోపాన్ని ప్రదర్శించే క్రమంలో వన్యప్రాణులను కాపాడేందుకు సాయం చేయడం గొప్పగా ఉందంటున్నారు. ఈ ఆలోచన చేసిన వారికి అభినందనలు చెప్తున్నారు.
Read Also: రైలు వాష్ రూమ్ లో నిలబడి కుంభమేళాకు వెళ్లిన యువతులు, నెట్టింట వీడియో వైరల్