Viral Video : కొన్ని వీడియోలు భలే గమ్మత్తుగా ఉంటాయి. డేంజర్ గానూ ఉంటాయి. వాటిని చూసి నవ్వుకోవాలో.. భయపడాలో.. బాధపడాలో అర్థం కాదు. అలాంటిదే ఈ వైరల్ వీడియో కూడా.
క్రిష్టియన్ సాంప్రదాయంలో ఓ పెళ్లి జరుగుతోంది. పెళ్లికూతురు వైట్ గౌన్‌లో అందంగా మెరిసిపోతోంది. వరుడు సూటుబూటు వేసుకుని టిప్ టాప్‌గా ఉన్నాడు. ఆ పెళ్లికి సుమారు 200 మంది వరకు అతిథిలు వచ్చారు. అనుకున్న టైమ్‌కు పెళ్లి తంతు స్టార్ట్ చేశారు పాస్టర్.
కుప్పకూలిన వరుడు..
టేబుల్ మీద బైబిల్ పెట్టి ఉంది. మైకులో పాస్టర్ ఏదో చదువుతున్నారు. పెళ్లి చేసుకోబోతున్న కొత్త జంట పాస్టర్ ముందు నిలబడి ఉంది. గెస్ట్‌లు అంతా ఆసక్తిగా చూస్తున్నారు. అంతలోనే ఆ పెళ్లికొడుకు మెలికలు తిరిగాడు. నిలబడలేక పోయాడు. స్లో స్లో గా వెనక్కి వాలిపోతున్నాడు. అప్పటికీ అతను వధువు చేయి పట్టుకునే ఉన్నాడు. పెళ్లి కొడుకు అలా పడిపోతున్న దృశ్యాన్ని ఎవరూ గమనించలేదు. సడెన్‌గా పాస్టర్ చూశాడు. వెంటనే ముందుకు పరిగెత్తుకుని వచ్చాడు. అప్పటికే దాదాపు కింద పడిపోయాడు ఆ వరుడు. తల నేలకు కొట్టుకోకుండా పాస్టర్ అతని కోట్‌ను గట్టిగా పట్టుకున్నాడు.
పెళ్లికొడుకు సేఫేనా?
అసలు అక్కడ ఏం జరుగుతుందో పెళ్లికూతురుకు ఏం అర్థం కాలేదు. ఆమె బ్లాంక్ అయిపోయి చూస్తూ ఉండిపోయింది. వరుడు కింద పడ్డాక కానీ క్లారిటీ రాలేదు. వెంటనే అతని కాలర్ పట్టుకుని పైకి లేపే ప్రయత్నం చేసింది. ఈలోగా పక్కనే ఉన్న అతని డాక్టర్ ఫ్రెండ్ ఒకతను వచ్చి పల్స్ చెక్ చేశాడు. పాస్టర్ సైతం కాస్త ఫస్ట్ ఎయిడ్ చేశాడు. కాసేపటికి పెళ్లికొడుకు స్పృహలోకి వచ్చాడు. అప్పటి వరకూ అతను చనిపోయాడేమో అనుకున్నారు చాలా మంది. ఏ గుండెపోటో వచ్చి ఉంటుందని భావించారు. వరుడు తేరుకున్నాక హమ్మయ్యా అని రిలాక్స్ అయ్యారు పెళ్లికి వచ్చిన వాళ్లంతా.
ఓవర్ ఎగ్జైట్‌మెంట్..
కోలుకున్నాక మెళ్లిగా నోరు విప్పాడు పెళ్లికొడుకు. పెళ్లి పనులతో 10 రోజులుగా చాలా టైర్డ్ అయ్యానని అన్నాడు. తీరా పెళ్లి వేడుకు స్టార్ట్ అయ్యే సరికి తాను ఉద్వేగం తట్టుకోలేక పోయానని చెప్పాడు. తెల్ల గౌన్‌లో అందమైన కాబోయే భార్యను చూసే సరికి తనకు మైండ్ బ్లాక్ అయిందని.. ఒకలాంటి జలదరింపు కలిగిందని తెలిపాడు. అంతలోనే స్పృహ తప్పి పడిపోతున్నట్టు తనకు అనిపించిందని.. అదంతా అందంగా, అద్భుతంగా ఉందని హ్యాపీగానే ఫీల్ అయ్యాడు. వరుడు కోలుకున్నాక.. పెళ్లి ప్రాసెస్ కంటిన్వ్యూ చేశారు. ఇదంతా బ్రెజిల్‌లో జరిగింది. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రేమలో పడటంలా మనోడు పెళ్లిలో పడ్డాడంటూ కామెడీగా కామెంట్ చేస్తున్నారు నెటిజన్లు. అతను అలా పడుతుంటే.. పెళ్లి కూతురు నుంచి అసలు ఎలాంటి రియాక్షన్ కూడా లేదంటూ నెగటివ్ పోస్టులు కూడా పెడుతున్నారు కొందరు.