Man Kiss On King Cobra’s Head: ప్రపంచంలో చాలా మంది పాములు అంటే చాలా భయపడతారు. చూడటం కాదు, కనీసం వాటి పేరు విన్నా భయంతో వణికిపోతారు. పాములు తిరుగుతాయని చెప్తే అటు వైపు వెళ్లడానికి కూడా కొంత మంది ఇష్టపడరు. కానీ, మరికొంత మంది పాములను చాలా ఇష్టపడుతారు. వాటితో కలిసి ఆటలాడుకుంటారు. పాములతో ఫ్రెండ్లీగా ఉండే వీడియోలు సోషల్ మీడియాలో బోలెడు కనిపిస్తుంటాయి. ఇప్పుడు మనం చెప్పుకోబోయే, ఎంత పెద్ద పామునైనా ఇట్టే పట్టేస్తాడు. తల మీద ముద్దులు కూడా పెట్టేస్తాడు. పామును ముద్దాడ్డం ఏంటని ఆశ్చర్యపోతున్నారా? అయితే ఈ వీడియోను చూస్తే, మీరు కచ్చితంగా షాక్ అవుతారు.
కోబ్రాకు కిస్ పెట్టిన మైక్
మైక్ హోల్‌స్టన్ అనే ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ ద్వారా ఈ వీడియో షేర్ అయింది. ఈ వీడియోలోని మైక్ ప్రమాదకరమైన కోబ్రాతో ప్రాణాంతక స్టంట్ చేశాడు. వైరల్ అవుతున్న ఆ వీడియోలోని ఒక వ్యక్తి ఎలాంటి భయమూ లేకుండా కింగ్ కోబ్రాతో ఆటలాడుతూ తలపై ముద్దుపెట్టాడు. ఆ వ్యక్తి ముద్దు పెడుతుంటే పాము వెనుతిరిగి కరిచేందుకు ప్రయత్నిస్తుంది. అయినప్పటికీ అతడు వదలకుండా దాన్ని చేతులతో పట్టుకున్నాడు. సుమారు 10 అడుగులకు పైగా పొడవున్న ఓ భారీ పాముతో విన్యాసాలు చేశాడు. అది కోరలు చాచుతూ బుసలు కొట్టినా, తను ఏ మాత్రం భయపడకుండా దాని తలపై ముద్దు పెట్టాడు. ఈ వీడియో చూస్తేనే వెన్నులో వణుకు పుడుతోంది. మైక్ షేర్ చేసిన ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
?utm_source=ig_embed&utm_campaign=loading" data-instgrm-version="14">
ప్రాణాలతో చెలగాటం అంటూ నెటిజన్ల ఆగ్రహం
మైక్ పాముతో ఆడలాడే వీడియో ఏకంగా 19 మిలియన్లకు పైగా వ్యూస్ అందుకుంది. నెటిజన్లు ఈ వీడియో చూసి షాక్ అవుతున్నారు. కొంత మంది మైక్ హోల్ స్టన్ ధైర్యాన్ని మెచ్చుకోగా, మరికొంత మంది తీవ్ర ఆగ్రహం, ఆందోళన వ్యక్తం చేశారు. “ఇలాంటి పనిని నా దృష్టిలో పిచ్చి పని అంటారు. నేను కనీసం స్క్రీన్ వైపు కూడా చూడలేకపోయాను” అని ఓ నెటిజన్ కామెంట్ పెట్టాడు. “ప్రజలు వ్యూస్ కోసం క్రూరమైన పనులు చేస్తున్నారు” అంటూ మరో వ్యక్తి కామెంట్ చేశాడు. “అతడికి భయం లేదు. అందుకే నిర్లక్ష్యంగా ఉంటున్నాడు. ఈ వీడియో చూడ్డానికి చాలా భయానకంగా ఉంది” అని ఇంకో నెటిజన్ కామెంట్ చేశాడు. “ఇలాంటి వీడియోలు చూస్తుంటే హారర్ సినిమాలతో పనేం ఉంది?” అని మరో వ్యక్తి కామెంట్ చేశాడు.
గతంలో ఇలాంటి స్టంట్స్ చేసిన నిక్ రాంగ్లర్
మైక్ మాత్రమే కాదు, వన్యప్రాణుల ఔత్సాహికుడు నిక్ ది రాంగ్లర్ గతంలో ఇలాంటి స్టంట్స్ చేశాడు. అతడు సుమారు 12 అడుగుల పొడవున్న కింగ్ కోబ్రా తలపై ముద్దు పెట్టి అందరినీ షాక్ కి గురి చేశాడు. అంతేకాదు, ఆ భారీ పాముతో నిక్ ఏకంగా ఫోటోలకు పోజులిచ్చి అందరినీ ఆశ్చర్యపరిచాడు.
Read Also: మలంతో మనీ.. ఈ కొరియన్ ప్రొఫెసర్ ఐడియాకు హ్యాట్సాఫ్.. ఇక టాయిలెట్‌లోనే ఎనర్జీ పుట్టించవచ్చు!