BigTV English

Prasanth Varma: చిన్న టీజర్ కట్‌కు రూ.2 కోట్లా.? ప్రశాంత్ వర్మను పక్కన పెట్టిన ఆహా.?

Prasanth Varma: చిన్న టీజర్ కట్‌కు రూ.2 కోట్లా.? ప్రశాంత్ వర్మను పక్కన పెట్టిన ఆహా.?

Prasanth Varma: సినీ పరిశ్రమలో సక్సెస్, ఫెయిల్యూర్ అనేది పూర్తిగా ఒకరి చేతిలో ఉండదు. అందుకే కొందరు సక్సెస్‌ను, ఫెయిల్యూర్‌ను పట్టించుకోకుండా ముందుకెళ్తుంటారు. కొందరు మాత్రం సక్సెస్‌ను తలకెక్కుంచుకుంటారు. అలా చేయడం వల్ల కనుమరుగయిపోయిన సినీ సెలబ్రిటీలు ఎంతోమంది ఉన్నారు. సక్సెస్‌లో ఉన్నప్పుడు డిమాండ్ చూపిస్తూ.. ఫెయిల్యూర్ ఉన్నప్పుడు అవకాశాలు ఇచ్చేవాళ్లు లేక ఎంతోమంది తిరిగి ఇంటికి వెళ్లిపోయారు. ఇప్పుడు యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ కూడా అదే రేంజ్‌లో డిమాండ్ చూపిస్తూ అందరికీ షాకిస్తున్నారు. ముఖ్యంగా ఈ దర్శకుడి డిమాండ్‌ను తట్టుకోలేక తనను పూర్తిగా దూరం పెట్టేసింది ఆహా.


మరీ అంతా?

ఇప్పటివరకు సినిమాలకు మాత్రమే కాకుండా ‘అన్‌స్టాపబుల్’ అనే షోను కూడా డైరెక్ట్ చేశాడు ప్రశాంత్ వర్మ (Prasanth Varma). ఇప్పటివరకు ఈ షోకు సంబంధించిన మూడు సీజన్స్ విడుదలయ్యాయి. తాజాగా నాలుగో సీజన్ కూడా ప్రారంభమయ్యింది. అయితే ‘అన్‌స్టాపబుల్’ మొదటి రెండు సీజన్స్‌కు సంబంధించిన ట్రైలర్, ఎడిటింగ్‌ బాధ్యతలను ప్రశాంత్ వర్మనే చూసుకున్నాడు. అప్పటికి ‘హనుమాన్’ మూవీ విడుదల కాలేదు కాబట్టి ఈ షో ట్రైలర్, ఎడిటింగ్ కోసం రెమ్యునరేషన్‌ను రీజనబుల్‌గానే డిమాండ్ చేశాడట. కానీ ‘హనుమాన్’ తర్వాత ప్రశాంత్ రేంజ్ మారిపోయింది. అందుకే ఒక షోకు ట్రైలర్‌ను డైరెక్ట్ చేయడం కోసం ఏకంగా రూ.2 కోట్లు డిమాండ్ చేస్తున్నాడని టాక్.


Also Read: హనుమాన్ ను మించి జై హనుమాన్..మరో పాన్ ఇండియా హిట్ ఖాయం

దూరం పెట్టారు

‘అన్‌స్టాపబుల్ 4’ (Unstoppable 4)కు సంబంధించిన ట్రైలర్ కొన్నాళ్ల క్రితం విడుదలయ్యింది. దీనిని పూర్తిగా ఏఐతోనే డిజైన్ చేశారు మేకర్స్. మొదటి రెండు సీజన్స్‌కు విడుదలయిన ట్రైలర్‌కు మంచి టాక్ రావడంతో ఈసారి కూడా ప్రశాంత్ వర్మనే ‘అన్‌స్టాపబుల్ 4’ ట్రైలర్‌ను కట్ చేస్తే బాగుంటుందని ఆహా భావించిందట. కానీ దీని టీజర్ షూటింగ్, డైరెక్షన్, ఎడిటింగ్ చేయడం కోసమే ప్రశాంత్ వర్మ రూ.2 కోట్లు డిమాండ్ చేసినట్టు టాలీవుడ్‌లో వార్తలు వినిపిస్తున్నాయి. అయితే కేవలం టీజర్ కట్ కోసం రూ.2 కోట్లు డిమాండ్ చేయడం ఆహాకు నచ్చలేదట. అందుకే ‘అన్‌స్టాపబుల్ 4’ నుండి ప్రశాంత్ వర్మను దూరం పెట్టినట్టు సమాచారం. అంతే కాకుండా దీనివల్లే బాలయ్యతో కూడా విభేదాలు మొదలయ్యాయని తెలుస్తోంది.

సినిమా ఉంటుందా

‘అన్‌స్టాపబుల్’ షో వల్లే బాలయ్యకు, ప్రశాంత్ వర్మకు మంచి సాన్నిహిత్యం పెరిగింది. అలాంటిది ఇప్పుడు సీజన్ 4కు ప్రశాంత్ వర్మ ఎక్కువ డిమాండ్ చేయడం వల్ల వీరిద్దరి మధ్య దూరం పెరిగిందని తెలుస్తోంది. అప్పట్లో ప్రశాంత్‌పై ఉన్న నమ్మకంతో తన కుమారుడు మోక్షజ్ఞ సినీ ఎంట్రీ బాధ్యతను తనకు అప్పగించారు బాలయ్య. ఇప్పుడు ‘అన్‌స్టాపబుల్ 4’ విషయంలో వచ్చిన విభేదాల వల్ల ఈ దర్శకుడిపై సీరియస్‌గా ఉన్నారట. అంతే కాకుండా అసలు మోక్షజ్ఞను ప్రశాంత్ వర్మ డైరెక్షన్‌లో పరిచయం చేయాలా వద్దా అని కూడా ఆలోచించడం మొదలుపెట్టారట బాలయ్య. మొత్తానికి ప్రశాంత్ వర్మ తీసుకున్న ఒక్క నిర్ణయం వల్ల తనపై భారీ ఎఫెక్టే పడనుంది.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×