Viral Video: ఈ రాణి చేసే పనులు మీరు అస్సలు చేయలేరు. అది కూడా ఏ పనైనా చకచకా సాగాల్సిందే. ఆ కోటకు ఆమెనే రాణి. ఈ రాణి చేసే పనులు చూసి, ఊరు ఊరంతా షాక్ కు గురవుతున్నారట. మరి ఆ కోటలో రాణి ఎవరు? అసలేం పనులు చేస్తోందో కూడ మీరు తెలుసుకుంటే అవాక్కవ్వాల్సిందే.
ఆ ఇంటికి రాణి లేకుంటే వారికి ఒక్క పని కూడ సాగదట. రాణి ఉంటేనే ఆ ఇంటికి కళ. అందుకే రాణిని కంటికి రెప్పలా చూసుకుంటారు ఆ ఇంటి వారు. నమ్మకానికి అంబాసిడర్ గా పేరుగాంచిన రాణికి సపరేట్ ఫాలోయింగ్ కూడా ఉందట. రాణి అంటున్నారు.. పని చేయడం ఏమిటని అనుకుంటున్నారా.. అవును మరీ రాణికి పనులు చేయాల్సిన పరిస్థితులు వచ్చాయి. యూపీలోని రాయ్‌బరేలీ జిల్లాలోని సాద్వా గ్రామంలో విశ్వనాథ్ అనే రైతు నివాసం ఉంటున్నారు. ఆ ఇంటికి ఒకరోజు రాణి వచ్చింది. రాణి వచ్చిందేమిటని వారందరూ ఆశ్చర్యపోయారు.
సరే సరే.. రాణి వచ్చింది కదా అంటూ వారంతా సంబరపడ్డారు. రాణి వచ్చింది.. సైలెంట్ గా ఉంటుందని అనుకుంటే, అలా ఉండలేదు. ఇంట్లో ఏ పనైనా చకచకా చేస్తోంది. ఒక్క నిమిషం ఖాళీగా ఉండడం లేదు. సమయం వృథా చేయడం లేదు. అందరితో పాటు కలిసి భోజనం చేస్తోంది. అందరూ తిన్న ప్లేట్లు తీసేస్తోంది. అంతేకాదు ఆ ప్లేట్లు ఎంచక్కా శుభ్రం కూడా చేస్తోంది. అలా ఆ రాణి చేసే పనులు చూసి, గ్రామస్తులు కూడా షాక్ తిన్నారు.
Also Read: చలికాలంలో బెల్లం తింటే.. బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు..
ఇటీవల ఆ రాణి చేసే పనులను ఓ యువకుడు వీడియో తీశాడు. ఆ వీడియోలో రాణి పనులన్నీ రికార్డయ్యాయి. ఇక అంతే సోషల్ మీడియాలో రాణికి సపరేట్ ఫాలోయింగ్ కూడా వచ్చేసింది. తమ ఇంటికి దీపం రాణి అంటూ విశ్వనాథ్ కూడ సంబరపడ్డారు. తమతో కలిసిపోయిన రాణి లేకుండా తాము ఒక్క నిమషం కూడా ఉండలేమని తెలిపారు ఆయన. ఇంతకు ఆ రాణి ఎవరో అనుకుంటున్నారా.. ఎవరో కాదు వానరం. వారింటికి వచ్చి సకల పనులు చేసింది ఆ వానరం. ఔను మీరు చదివింది నిజమే. ఒక వానరం మనిషిలా పని చేస్తుందా అంటూ ఆశ్చర్యపోవద్దు.
వంట చేస్తోంది. అంట్లు తోముతోంది. ఇంట్లో ఏ పనైనా చకచకా చేస్తోంది. మీరు నమ్మలేదా అయితే ఈ క్రింద ఉన్న వీడియోపై ఓ లుక్ వేయండి. ఆ వీడియో చూసి మీరు రాణి గురించి గొప్పలు చెప్పేస్తారు.. ప్లీజ్ వాచ్..!
ఇది కోతి కాదు.. రాణి!
యూపీలోని రాయ్‌బరేలీ జిల్లాలోని సాద్వా గ్రామానికి చెందిన విశ్వనాథ్ అనే రైతు ఇంట్లో ఈ కోతి ఉంటోంది. ముద్దుగా రాణి అని పిలుచుకుంటారు. విశ్వనాథ్ కుటుంబంలో ఓ సభ్యురాలిగా మారిపోయిన రాణి వారితో పాటే భోజనం చేస్తుంది. వంట చేయడంలో సహాయపడటంతోపాటు అంట్లు కూడా తోమి… pic.twitter.com/xjJC1VgwRB
— ChotaNews App (@ChotaNewsApp) December 31, 2024