2025 New Year Celebrations : నూతన ఏడాదికి స్వాగతం చెప్పేందుకు చాలా దేశాల్లోని వారంతా ఎంతో ఎదురుచూస్తున్నారు. మన దగ్గర ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి కాగా, సంబురాలకు సిద్ధమైపోయారు. కానీ.. ఇప్పటికే కొన్ని దేశాల్లో కొత్త ఏడాది ఎంటరైపోయింది తెలుసా.? అవును.. మనకంటే చాలా ముందుగానే చాలా దేశాలు నూతన ఏడాదిని ఆహ్వానించింది, ఆయా దేశాల్లో గ్రాండ్ గా వెల్ కమ్ చెప్పేసి, అదిరిపోయేలా సెలబ్రేషన్స్ జరుపుతున్నారు. ఇంతకీ.. మనకంటే ముందే న్యూఇయర్ సెలబ్రేషన్స్ మొదలు పెట్టిన దేశాలు ఏంటో తెలుసా.. అసలు మొదట ఎక్కడ కొత్త ఏడాది అడుగుపెడుతుందో తెలుసుకుందామా.. అయితే పదండి
ఇంకొన్ని గంటల్లోనే కొత్త ఏడాది రాబోతుంది. ఇకపై 2024 ఏ చరిత్ర, ముగిసిపోయిన అధ్యయనం. కొత్త ఏడాదిలో సరికొత్త సవాళ్లతో పాటు అవకాశాలు అందుకునేందుకు సిద్ధమైపోతున్నారు. అయితే.. మనకంటే చాలా ముందుగానే అనేక దేశాల్లో సంబురాలు మొదలయ్యాయి. ఇప్పటికే.. కళ్లు చెదిరే టపాసులు పేల్చుతూ.. న్యూ ఇయర్ ను ఆహ్వానించారు. మరి ఆయా దేశాలు ఏవో తెలుసా.. పసిఫిక్ మహా సముద్రంలోని కిరిబాటి అనే దీవుల్లోని ప్రజలకు అందరికంటే చాలా ముందుగా నూతన ఏడాది ప్రారంభమవుతుంది. అంటే.. మన దగ్గర మధ్యాహ్నం 3.30కు. ఆ తర్వాత న్యూజిలాండ్‌కు చెందిన చాతమ్ ఐలాండ్స్ ప్రజలు మన దగ్గర మధ్యాహ్నం 3.45 లకే వాళ్లు 2025లోకి ఎంటర్ అయిపోయారు.
కొత్త ఏడాదిలోకి వెళ్లిన దేశాలు..
భారత్ కంటే ముందుగానే న్యూజిలాండ్ వాసులు 2025 (New year 2025)లోకి వెళ్లారు. మన దగ్గర సాయంత్రం 4.30 గంటలకే ఆ దేశంలోకి న్యూ ఇయర్ ప్రవేశించింది. దీంతో.. అక్కడి నగరాల్లోని ప్రజలు పెద్ద ఎత్తున సంబురాలు చేసుకుంటున్నారు. బాణాసంచా, బాంబులతో ఆకాశం రంగురంగుల వెలుగులతో జిగేలుమంటోంది. ఆక్లాండ్ స్కై టవర్ దగ్గర న్యూఇయర్ వేడుకలు.. ఘనంగా ప్రారంభమయ్యాయి. ఆస్ట్రేలియాలో మనకంటే అయిదున్నర గంటల ముందు న్యూ ఇయర్ ఎంటర్ అవుతుంది. జపాన్, దక్షిణ కొరియా, ఉత్తర కొరియా దేశాలు మూడున్నర గంటల ముందే కొత్త ఏడాదిలోకి అడుగు పెడతాయి.
Also Read : ఇథియోపియాలో రోడ్డు ప్రమాదం.. 71 మంది మృతి
భారత్ తో పాటు శ్రీలంకకు ఒకేసారి న్యూ ఇయర్ వస్తే.. మన పొరుగు దేశాలైన భూటాన్, నేపాల్, బంగ్లాదేశ్ దేశాలకు ఓ 30 నిముషాల ముందు న్యూ ఇయర్ వస్తుంది. భారత్ కంటే చాలా దేశాలకు ముందే న్యూ ఇయర్ వస్తుంటే.. మన తర్వాత కూడా అనేక దేశాలు కొత్త ఏడాదిలోకి అడుగుపెడుతుంటాయి. ఇంగ్లాండ్ అయితే.. అయిదున్నర గంటల తర్వాత, అమెరికా 10.30 గంటల తర్వాత న్యూ ఇయర్ లోకి ప్రవేశిస్తాయి. మరి చిట్టచివరిగా న్యూ ఇయర్ కి స్వాగతం చెప్పే దేశాలు ఏంటో తెలుసా.. అమెరికన్ సమోవాను.. ఇక్కడ న్యూ ఇయర్ ఎంటర్ అయ్యే సమయానికి.. వాటి పక్కనే ఉండే, మొదటిగా న్యూ ఇయర్ ప్రవేశించిన కిరిబాటి దీవుల్లోని వారికి మరో రోజు వస్తేస్తుంది.