Mother Elephant Viral Video: ప్రపంచంలో ఏ తల్లికైనా తన బిడ్డలకు మించిన సంపద మరేదీ ఉండదు. తను ఉన్నంత కాలం వారిని కంటికి రెప్పలా చూసుకుంటుంది. తను కష్టపడినా పిల్లలు బాధపడనీయదు. మనుషులే కాదు, ప్రతి జంతువు తన పిల్లలను ఎంతో ప్రేమగా చూసుకుంటుంది. ఆపద రాకుండా కాపాడుకుంటుంది. తాజాగా ఓ ఏనుగు తన బిడ్డను అపురూపంగా చూసుకునే ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది. ఇంతకీ ఆ ఏనుగు ఏం చేసిందంటే..
బిడ్డకు దిష్టి తీసిన తల్లి ఏనుగు
సాధారణంగా బిడ్డల మీద చెడు దృష్టి పడకూడదని మనుషులు తమ పిల్లలకు దిష్టి తీస్తుంటారు. కొంత మంది చిన్న పిల్లలకు దిష్టి చుక్క పెడతారు. ఇప్పటి వరకు మనుషులే ఇలా చేస్తారని అందరం భావించాం. కానీ, జంతువులు కూడా తమ పిల్లల మీద చెడు కన్ను పడకూడదని జాగ్రత్తలు తీసుకుంటాయి. ఇదే విషయాన్ని నిరూపించింది తాజాగా ఓ ఏనుగు. తన బిడ్డ మీద ఎలాంటి చెడు దృష్టి పడకూడదనే ఉద్దేశంతో పడుకున్న తన బిడ్డకు దిష్టి తీస్తూ కనిపించింది. అచ్చం మనుషుల మాదిరిగానే తొండంతో బిడ్డకు దిష్టి తీసింది. తొండాన్ని బిడ్డ చుట్టూ తిప్పడంతో పాటు నలుమూలగా నేలకు తొండాన్ని ఆనిస్తూ కనిపించింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది.
Read Also: ఆ పండు తిన్న ఆర్టీసీ డ్రైవర్.. ఆల్కహాల్ టెస్ట్ లో పాజిటివ్, అసలు దోషి ఎవరంటే?
నెటిజన్లు ఏం అంటున్నారంటే?
ఈ వీడియో ప్రస్తుతం నెటిజన్లను బాగా ఆకట్టుకుంటుంది. నెటిజన్లు సదరు ఏనుగు ప్రేమను చూసి ఫిదా అవుతున్నారు. నిజంగా ఆ బుడ్డ ఏనుగుకు ఇలాంటి తల్లి దొరకడం నిజంగా అదృష్టం అంటున్నారు. మనుషులే కాదు, జంతువులు కూడా తన బిడ్డలకు దిష్టి తగలకుండా ఇలా చేస్తాయని ఈ వీడియో చూసిన తర్వాతే తెలిసిందని మరికొంత మంది కామెంట్స్ చేస్తున్నారు. తల్లి ప్రేమ ముందు మరే ప్రేమ సాటి రాదని మరికొంత మంది కామెంట్స్ పెడుతున్నారు. మరికొంత మంది ఈ వీడియో మీద అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ వీడియో ఏఐలో క్రియేట్ చేసినట్లు కనిపిస్తుందని కామెంట్స్ చేస్తున్నారు. ఈ రోజుల్లో ఏఐ వచ్చిన తర్వాత ఏది నిజమైన వీడియోనో? ఏది ఏఐ వీడియోనో తెలుసుకోవడం చాలా కష్టం అయ్యిందని మరికొంత మంది అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. అందరినీ తెగ ఆకట్టుకుంటుంది.
Read Also: భార్య కంటే ఎత్తు కనిపించాలని సర్జరీ, అవసరమా బ్రో!