BigTV English

Spaceship Landing: అంతరిక్ష నౌకలను భూమిపై కాకుండా సముద్రంలోనే ఎందుకు దింపుతారు?

Spaceship Landing: అంతరిక్ష నౌకలను భూమిపై కాకుండా సముద్రంలోనే ఎందుకు దింపుతారు?

భారత వ్యోమగామి శుభాన్షు శుక్లా తన బృందంతో కలిసి జూలై 15న అంతరిక్షం నుండి సురక్షితంగా భూమికి తిరిగి వచ్చారు. స్పేస్ ఎక్స్ డ్రాగన్ అంతరిక్షనౌక ‘గ్రేస్’ భూమికి వారిని తీసుకొని తిరిగి వచ్చింది. అమెరికాలోని దక్షిణ కాలిఫోర్నియా తీరానికి సమీపంలోని పసిఫిక్ మహాసముద్రంలో అంతరిక్షం నౌక పడిపోయింది. కేవలం శుభాన్షు శుక్లా వచ్చిన అంతరిక్ష నౌక మాత్రమే కాదు… ఏ అంతరిక్ష నౌక అయినా సముద్రంలోనే ల్యాండ్ చేస్తారు. కానీ నేలపై ఎప్పుడూ ల్యాండ్ చేయరు. దీని వెనక కారణమేంటో తెలుసా?


స్ప్లాష్ డౌన్ అంటే ఏమిటి?
అంతరిక్ష నౌకను భూమిపై కాకుండా సముద్రంలోకి దింపడానికి కారణం వెనుక సైన్స్ దాగి ఉంది. ఒక నౌక అంతరిక్షం నుండి భూమికి తిరిగి వచ్చినప్పుడు దానిని పారాచూట్ సహాయంతో నీటిలో ల్యాండ్ చేస్తారు. ఈ ప్రక్రియను స్ప్లాష్ డౌన్ అని అంటారు. అంతరిక్షం నుండి భూవాతావరణంలోకి ప్రవేశించినప్పుడు దాని వేగం గంటకు వేల కిలోమీటర్లు ఉంటుంది. అంతరిక్షం నౌక ఇంత వేగంగా ప్రయాణిస్తున్నప్పుడు ఘర్షణ, అధిక వేడి ఉత్పత్తి అవుతుంది. అందుకే అంతరిక్ష నౌకకు ప్రత్యేక ఉష్ణ కవచంతో రక్షిస్తారు. అప్పుడే అంతరిక్ష నౌకలో ఉన్న వ్యోమగాములు కూడా సురక్షితంగా ఉంటారు. భూ వాతావరణంలోకి ఈ అంతరిక్ష నౌక ప్రవేశించిన తర్వాత ఆ నౌక వేగాన్ని తగ్గించడానికి ప్యారాచూట్ ను విడుదల చేస్తారు.

అంతరిక్ష నౌకలను భూమి పై కాకుండా నీటిలోనే ల్యాండ్ చేస్తారు. ఒక అంతరిక్షం నౌక నీటిలో దిగినప్పుడు అది భూమి కంటే తక్కువ షాక్ ను పొందుతుంది. దీనివల్ల వ్యోమగాములకు అంతరిక్ష నౌకకు తక్కువ నష్టమే జరుగుతుంది. అదే భూమిపై దిగితే వారికి జరిగే నష్టం అధికంగా ఉంటుంది. అంటే ఆ ప్రాంతంలో ఘర్షణ అంతరిక్ష నౌకకు, భూమికి గట్టిగా జరిగే అవకాశం ఉంటుంది. దీనివల్ల అంతరిక్ష నౌకకు, ఆ నౌకలో ఉన్న వ్యోమగాములకు గాయాలు అయ్యే అవకాశం ఎక్కువ. అందుకే అంతరిక్షం నౌకను భూమిపై కాకుండా సముద్రంలోనే ల్యాండ్ చేస్తారు. భూమిపై ల్యాండ్ చేయాలనుకుంటే ఆ అంతరిక్షం నౌక భూమిపై పర్వతాలు, లోయలు, గోతులు ఉన్నచోట ఎక్కడైనా కూడా ల్యాండ్ కావచ్చు. అలాంటప్పుడు ప్రమాదం జరిగే అవకాశం కూడా ఎక్కువగానే ఉంటుంది.


ఇప్పటివరకు అంతరిక్ష నుంచి వచ్చిన ప్రతి నౌకను నీటిలోనే ల్యాండ్ చేశారు. భూమిపై ల్యాండ్ చేసే ప్రయత్నం చేయలేదు. భవిష్యత్తులో ఆ ప్రయత్నాలు కూడా జరిగే అవకాశం లేకపోలేదు.

Related News

Guava Benefits: ఇంట్లో ఉన్న కాయతో ఇన్ని ప్రయోజనాలా? అదేంటో తెలిస్తే అస్సలు నమ్మలేరు

Brinjal Benefits: వంకాయ తింటే ఏం జరుగుతుంది? ఆరోగ్యానికి..!

Eosinophilia Symptoms: అలసట, చర్మంపై దద్దుర్లతో ఇబ్బంది పడుతున్నారా ?

Spicy Food: ఎక్కువ కారం తింటున్నారా? అయితే ఇది మీకోసమే!

Kidney Stones: ఈ లక్షణాలు మీలో ఉన్నాయా ? అయితే కిడ్నీ స్టోన్స్ కావొచ్చు !

Breathing Problems: శ్వాస తీసుకోవడంలో ఇబ్బందా? కారణాలివేనట !

Big Stories

×