ఎవరైనా తమకు ఎంతో ఇష్టమైన వ్యక్తిని కోల్పోయినప్పుడు.. ఆ దుఃఖం కొంత మందిని అసాధారణమైన పనులు చేయిస్తుంది. ఇలా బాధ పడిన ఓ మహిళ ఏకంగా తన భర్త అస్థికలను తినేసింది. ఇదో అరుదైన కథ అయినప్పటికీ దుఃఖం ఎంత శక్తివంతమైనదో చూపిస్తుంది. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే?
2011లో టేనస్సీకి చెందిన కాసీ అనే మహిళ ‘మై స్ట్రేంజ్ అడిక్షన్’ అనే టీవీ షోలో కనిపించింది. వివాహం అయిన రెండు సంవత్సరాల తర్వాత ఆమె తన భర్త సీన్ అస్తమాతో చనిపోయాడు. అతడి మరణాన్ని ఆమె తట్టుకోలేకపోయింది. భర్త అస్థికలు ఉన్న కలశాన్ని తను ఎక్కడికి వెళ్తే అక్కడికి తీసుకెళ్లేది. ఒక రోజు కలశం నుంచి కొంత బూడిద బయటకు వచ్చి తన చేతివేళ్ల మీద పడింది. ఆ బూడిదను అనుకోకుండా ఆమె రుచి చూసింది. ఆ తర్వాత ఆ బూడిదను తినడం మొదలుపెట్టింది. కాసీ రోజుకు 5 నుంచి 6 సార్లు బూడిదను తినేది. ఆ బూడిద కుళ్లిన గుడ్డు లాంటి రుచి ఉండేదని చెప్పింది. ఆమె దాదాపు ఒక పౌండ్ బూడిద, అంటే మొత్తం దహన సంస్కారాలలో దాదాపు 10 నుంచి 15% బూడిదకు సమానం. ఈ అలవాటు ఆమె తీవ్రమైన బరువు తగ్గడానికి దారితీసింది. కారణం, అమె ఆహారం తీసుకోకుండా కేవలం బూడిద తినడం మొదలు పెట్టింది.
ఆ తర్వాత కాసీ బరువు తగ్గడం మొదలు పెట్టింది. రాను రాను పరిస్థితి సీరియస్ కావడంతో హాస్పిటల్ కు వెళ్లింది. డాక్టర్లకు అసలు విషయం చెప్పింది. వెంటనే ఆమెను డాక్టర్లు హాస్పిటల్లో జాయిన్ చేసుకున్నారు. ముందుగా ఆమెకు ఉన్న అస్థికల బూడిద తినే అలవాటును దూరం చేయాలనుకున్నారు. అస్థికల కలశాన్ని ఆమెకు దూరంగా ఉంచారు. అయితే, ఆమెకు ఈ బూడిద తినడం వల్ల ఎలాంటి ఆరోగ్య సమస్యలు రాలేదని వైద్యులు గుర్తించారు. డాక్టర్ల పర్యవేక్షణలో ఆమె కోలుకున్నారు. మానసిక నిపుణుల కౌన్సిలింగ్ తో ఆమె తన భర్త లేడనే బాధ నుంచి బయటపడటం మొదలుపెట్టింది.
బూడిదను తినడం సాధారణం కాదు. కానీ, ఎవరైనా తీవ్ర దుఃఖంతో బాధపడుతున్నప్పుడు మట్టి, బూడిదను తినేస్తుంటారు. కాసీ కూడా ఆమె భర్త బాధ నుంచి బూడిద తినాలోనే ఆలోచన పుట్టింది. ఆమె కోల్పోయిన వ్యక్తితో కనెక్ట్ అయ్యేలా చేసింది. దహనం చేసిన బూడిద సాధారణంగా విషపూరితం కానప్పటికీ, దహన ప్రక్రియలో హానికర పదార్థాలు కలుస్తాయి. వాటిని తినడం వల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. కడుపు సమస్యలు, పోషకాహార లోపం లాంటి సమస్యలు తలెత్తుతాయి. బూడిదలో కొన్నిసార్లు రసాయనాలు కడుపులోకి వెళ్లే అవకాశం ఉంది. ఇవి తీవ్రమైన హాని కలిగించే ప్రయత్నం చేస్తాయి. బూడిద తినడం ఇతరులకు దిగ్భ్రాంతికరంగా అనిపించినా, వారికి మాత్ర పోగొట్టుకున్న మనిషి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటున్నట్లు ఫీలవుతారు.