Bigg Boss 8 Telugu Latest Promo: బిగ్ బాస్ 8లోని మొదటివారంలో నైనికా, యష్మీ, నిఖిల్ చీఫ్స్‌గా అర్హతను సంపాదించుకున్నారు. కానీ రెండో వారం పూర్తయ్యే సమయానికి నైనికా, యష్మీలకు చీఫ్స్ అనే అర్హత చేజారిపోయింది. నిఖిల్ మాత్రమే ఇంకా చీఫ్‌గా ఉన్నాడు. ఇక హౌజ్‌కు ఒక్కడే కాకుండా మరొక చీఫ్ అవసరం కూడా ఉంది కాబట్టి మిగతా హౌజ్‌మేట్స్ అంతా కలిసి అభయ్‌ను చీఫ్‌ను చేశారు. అలా ప్రస్తుతం చీఫ్స్‌గా నిఖిల్, అభయ్ చేతుల్లోకి బిగ్ బాస్ హౌజ్ బాధ్యతలు వెళ్లాయి. ఇక ఆదివారం ఎపిసోడ్‌లో ఈ చీఫ్స్‌ను ఎంచుకొని వారి టీమ్‌లోకి వెళ్లే హౌజ్‌మేట్స్ ఎవరు అనే విషయంపై క్లారిటీ వస్తుంది. దాంతో పాటు ఒక పెద్ద ట్విస్ట్ కూడా ఉంది. దానికి సంబంధించిన ప్రోమో తాజాగా విడుదలయ్యింది.
సోనియా ఓవరాక్షన్
ప్రోమో మొదలవ్వగానే Y,S అక్షరాలకు అర్థం ఏంటో తమకు చెప్పమని సోనియాను అడిగారు నాగార్జున. దానికి సోనియా సిగ్గుపడింది కానీ ఏమీ మాట్లాడలేదు. హౌజ్‌కు కొత్త చీఫ్ కావాలి అన్నప్పుడు అభయ్‌ను సపోర్ట్ చేసింది సోనియా. కానీ తాను ఏ టీమ్‌లోకి వెళ్లాలి అనే నిర్ణయం తీసుకోవాలి అన్నప్పుడు తను నిఖిల్ పేరు చెప్పింది. ‘‘నా అవసరం, నా గైడెన్స్ ఎక్కువగా నిఖిల్‌కే అవసరం అనిపిస్తుంది’’ అంటూ మరోసారి తాను గొప్ప అన్నట్టుగా మాట్లాడింది. దీంతో నాగార్జున నవ్వారు. ఆ తర్వాత ‘‘సోనియా, విష్ణుప్రియా ఇద్దరూ నీ టీమ్‌లోనే ఉన్నారు’’ అంటూ నిఖిల్‌ను ఆటపట్టించారు నాగార్జున. మణికంఠ కూడా నిఖిల్ టీమ్‌ను వదిలేసి అభయ్ టీమ్‌కు వెళ్లాలని అనుకుంటున్నట్టు తెలిపాడు.
Also Read: అభయ్‌కు సోనియా వెన్నుపోటు, నిఖిలే కావాలంటూ రూట్ ఛేంజ్.. తనకు బ్రెయిన్ లేదని ఒప్పుకున్న విష్ణుప్రియా
నామినేట్ చేసినవాడికే ఓటు
‘‘అభయ్‌కు వినే అలవాటు తక్కువగా ఉందని నేనే చెప్పాను. ఆ అలవాటు ఏమైనా మారుతుందా అని నేను చూడాలని ఉంది’’ అంటూ అభయ్ టీమ్‌లోకి వెళ్లడానికి కారణం చెప్పాడు మణికంఠ. ‘‘అభయ్‌కు నువ్వు కావాలో లేదో కనుక్కున్నావా’’ అంటూ మణికి కౌంటర్ ఇచ్చారు నాగార్జున. ఇద్దరం ఒకేలాగా ఆలోచిస్తామంటూ అభయ్ గురించి చెప్తూ తన టీమ్‌లోకి వెళ్లింది ప్రేరణ. ఆ తర్వాత పృథ్వి వచ్చి నిఖిల్ టీమ్‌ను ఎంచుకుంటానని అన్నాడు. అయితే పృథ్వి నామినేషన్స్‌లో ఉండడానికి కారణమే నిఖిల్ అని గుర్తుచేశారు నాగార్జున. ‘‘కసి తీర్చుకోవడానికి వెళ్తున్నావా’’ అంటూ నవ్వారు.
వారిదే బాధ్యత
ఆ తర్వాతే కంటెస్టెంట్స్‌కు అసలైన ట్విస్ట్ ఇచ్చారు నాగార్జున. ‘‘డేంజర్ జోన్‌లో ఆడియన్స్ సెలక్ట్ చేసిన ఇద్దరే ఉన్నారు. ఇప్పుడు సీజన్‌లోని అతిపెద్ద ట్విస్ట్ మీ ముందుకొచ్చింది. వాళ్లలో ఇంట్లో ఎవరు ఉంటారు, ఇంటి బయటికి ఎవరు వస్తారు అనేది ఈవారం సీజన్ 8లోని హౌజ్‌మేట్స్ డిసైడ్ చేయబోతున్నారు’’ అని చెప్పగానే హౌజ్‌మేట్స్ అంతా ఒక్కసారిగా షాకయ్యారు. కానీ డేంజర్ జోన్‌లో ఉన్న ఆ ఇద్దరు ఎవరు అనే విషయాన్ని మాత్రం ప్రోమోలో రివీల్ చేయలేదు. మొత్తానికి బిగ్ బాస్ 8లో రెండోవారం ఎలిమినేట్ అయ్యేది శేఖర్ భాషానే అని సోషల్ మీడియాలో కథనాలు వినిపిస్తున్నాయి. చాలావరకు ఈ ఎలిమినేషన్ కన్ఫర్మ్ అని సమాచారం.