E-Paper
Advertisement

అమరావతిలో వైకాపా నేతలపై దాడి.. ప్రభుత్వంపై విరుచుకుపడ్డ.. పేర్ని నాని, అంబటి!

అమరావతిలో వైకాపా నేతలపై దాడి.. ప్రభుత్వంపై విరుచుకుపడ్డ.. పేర్ని నాని, అంబటి!
Advertisement

Amaravati Lands: అమరావతి భూసేకరణ వ్యవహారం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పెను దుమారం రేపుతోంది. రాజధాని ప్రాంతంలో రైతుల భూముల సేకరణ, అక్కడ మాజీ మంత్రుల పర్యటన సందర్భంగా జరిగిన ఉద్రిక్తతలు తీవ్ర ఉత్కంఠకు దారితీశాయి. కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న తీరు, వైఎస్సార్సీపీ నాయకులపై జరిగిన దాడులను నిరసిస్తూ మాజీ మంత్రులు పేర్ని నాని, అంబటి రాంబాబులు ప్రభుత్వంపై, పోలీసుల వైఖరిపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.

బలవంతపు భూసేకరణ.. కందకాల అరాచకం

Advertisement

ప్రభుత్వానికి అస్సలు అవసరం లేకపోయినా, రైతుల నుంచి బలవంతంగా భూములు లాక్కోవడం అత్యంత దుర్మార్గమైన చర్య అని మాజీ మంత్రి పేర్ని నాని మండిపడ్డారు. భూములు ఇవ్వడానికి నిరాకరిస్తున్న రైతుల పొలాల చుట్టూ కందకాలు తవ్వడం అరాచకానికి పరాకాష్ట అని ఆయన ధ్వజమెత్తారు. బాధితులు తమ బాధలను చెప్పుకుని, పిలిస్తేనే తాము అక్కడికి వెళ్లామని స్పష్టం చేశారు. తాము క్షేత్రస్థాయికి వెళ్తే అక్కడ జరుగుతున్న దోపిడీ, రైతుల సమస్యలు ప్రపంచానికి తెలిసిపోతాయనే భయంతోనే ప్రభుత్వం కుట్ర పన్నిందని ఆరోపించారు.

పక్కా ప్లాన్‌తో రౌడీ మూకల దాడి

Advertisement

ఉండవల్లి సెంటర్ వద్ద పక్కా ప్లాన్‌తో వైఎస్సార్సీపీ నాయకులను అడ్డుకుని దాడులకు తెగబడ్డారని పేర్ని నాని పేర్కొన్నారు. తమను అడ్డుకున్న వారెవ్వరూ రాజధానికి భూములు ఇచ్చిన అసలు రైతులు కారని, కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం వచ్చిన వారేనని విమర్శించారు. పాలకొల్లు సత్యం అనే వ్యక్తి క్వారీల్లో పనిచేసే కూలీలను, గూండాలను తీసుకొచ్చి, వారికి మద్యం తాగించి మరీ తమపైకి ఉసిగొల్పారని ఆవేదన వ్యక్తం చేశారు. తాడేపల్లి మండల టీడీపీ అధ్యక్షుడే ల్యాండ్ పూలింగ్‌లో తన సొంత భూమిని ఇవ్వలేదని, అలాంటి వారు రౌడీ మూకలను పంపి దాడులు చేయించడం హాస్యాస్పదంగా ఉందన్నారు.

పోలీసుల తీరుపై అంబటి రాంబాబు ఆగ్రహం

మరో మాజీ మంత్రి అంబటి రాంబాబు మాట్లాడుతూ.. చట్టపరంగా భూములు తీసుకుంటే తమకు ఎలాంటి అభ్యంతరం లేదని, కానీ గతంలో వైఎస్ జగన్‌ను కలిశారన్న కారణంతోనే రైతులను వేధించటం దారుణమన్నారు. ‘బాధిత రైతులను కలవటానికి వెళ్తే కార్లను ధ్వంసం చేసి, పెద్దపెద్ద రాళ్లతో దాడులు చేస్తారా?’ అని ప్రశ్నించారు. నిరంతరం ‘గొడ్డలి పార్టీ’ అంటూ విమర్శలు చేసే చంద్రబాబు, లోకేష్‌లు ఇప్పుడేం సమాధానం చెబుతారని నిలదీశారు.

హత్యాయత్నం కేసులు నమోదు చేయాలని డిమాండ్

తాము కేవలం నాయకులం మాత్రమే వెళ్లామని, కానీ టీడీపీ లీడర్లు కార్యకర్తలను, రౌడీలను పంపి దాడులు చేయించారని అంబటి ఆరోపించారు. ఈ ఘర్షణలో పోలీసు కానిస్టేబుల్ కి కూడా గాయం అయిందని, మరి ఇప్పుడు కేసు పెడతారా లేక తిరిగి తమపైనే అక్రమ కేసులు నమోదు చేస్తారా? అని ప్రశ్నించారు. శాంతిభద్రతలను కాపాడాల్సిన పోలీసులే ఏకపక్షంగా వ్యవహరిస్తూ, దాడులకు సహకరించడం సరికాదని, ఈ దుర్మార్గ పాలన ఎల్లకాలం సాగదని ఆయన హెచ్చరించారు. తమపై దాడికి తెగబడిన వారిపై తక్షణమే హత్యాయత్నం కేసులు నమోదు చేయాలని ఉభయ నేతలు గట్టిగా డిమాండ్ చేశారు.

Also Read: అయోధ్య వివాదం ఎఫెక్ట్? టీటీడీ అకౌంటింగ్ వ్యవహారాల్లో ఊహించని మార్పులు!

Related News

జగన్ ఎక్కడికి వెళ్లినా అదే రచ్చ.. కర్నూలు జైలులో ఏం జరిగింది? నిజాలు బయటపెట్టిన జైలు అధికారి

అంతర్జాతీయ నగరం.. అమరావతిపై న్యూయార్క్ టైమ్స్ ప్రత్యేక కథనం! ఆపై సీఎం చంద్రబాబు..

ఆధారాలు పట్టుకుని రండి.. డీఎస్సీపై చర్చకు మేము సిద్ధం.. వైసీపీకి చంద్రబాబు ఓపెన్ ఛాలెంజ్!

డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసు.. రాజమండ్రి కోర్టుకు హాజరైన ఎమ్మెల్సీ అనంతబాబు!

అమరావతి సీడ్ యాక్సెస్ రోడ్.. స్టీల్ బ్రిడ్జ్ వద్ద ఆ ‘వంపు’ ఎందుకు?

అమరావతిని ఆపడం ఎవరితరం కాదు.. గ్రేట్ విజన్‌కు మొదటి సక్సెస్ మాత్రమే-సీఎం చంద్రబాబు

శ్రీకాకుళంలో టైటానియం ప్లాంట్‌.. సీఎం చంద్రబాబుతో కరణ్ అదానీ భేటీ, రూ.16 వేల కోట్లు పెట్టుబడులు

భోగాపురం ఎయిర్‌పోర్టులో రాకపోకలు.. ప్రత్యేక విమానంలో బీజేపీ ఎంపీ, టీడీపీ ఎమ్మెల్యే!

Big Stories

Advertisement
×